కాంగ్రెస్ మూడో జాబితా :ఐదుగురికి చోటు

ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాను విడు దల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగు రికి చోటు దక్కింది.

పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి – సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ – దానం నాగేందర్‌, చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ – మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజ రాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలోని కొన్ని స్థానా లకు అభ్యర్థులను ప్రకటిం చారు.

తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో నాలు గు స్థానాలకు జహీరాబాద్‌ – సురేశ్‌ కుమార్‌ షెట్కర్‌, నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇంకా.. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన మూడు జాబితాల్లో కాంగ్రెస్‌ 139 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తర లించారు.

ఈ సందర్భంగా ఆప్‌ కార్య కర్తలు అడ్డుకోబోగా.. పోలీ సులు వారిని చెదరగొట్టారు. గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి మినహాయింపు నిరాకరిం చిన కొద్ది సేపటికే సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది.

విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత ల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్‌ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

ఆప్‌ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్‌ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ భద్రతా సిబ్బంది నిలువ రించింది. లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ వ్యవహా రంలో తొమ్మిది సార్లు విచారణకు రావాలని పిలిచినా హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు.

మరోవైపు తనపై బలవం తపు చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశా లివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపు చ్చింది. దీంతో ఈడీ అరెస్టు చేసింది..

పాలీసెట్ పరీక్ష తేదీలో మార్పు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పు లు చేర్పులు చేస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికలున్న క్రమంలో ఆ రోజు, ముందు రోజు, తర్వాతి రోజుల్లో ఉన్న పరీక్షల తేదీలను మారుస్తున్నారు.

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పాలిసెట్‌, తేదీని మే 17 నుంచి మే 24వ తేదీకి వాయిదా వేశారు. ఈమేరకు బుధవారం సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటన చేశారు.

ఇక ఎప్‌సెట్‌కు కూడా ఒకటి, రెండ్రోజుల ముందుగానే ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలను పంపించారు. సర్కారు అనుమతినివ్వ గానే... కొత్త తేదీలను ప్రకటించనున్నారు.

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు.. మే 9, 10వ తేదీల్లో ఇంజనీరింగ్‌, 11, 12వ తేదీల్లో అగ్రికల్చ ర్‌, ఫార్మసీ పరీక్షలను నిర్వ హించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో కొంత ముందు గానే.. మే 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఏప్రిల్‌,మూడో వారంలో ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలా ఖరు నాటికి స్పాట్‌ వాల్యు యేషన్‌ను పూర్తి చేయను న్నారు.

తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నయా లేదా అనేది పరిశీలించి ఫలితాలను ప్రకటించనున్నారు...

ఈడీ అరెస్ట్‌, కస్టడీని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కవిత

•రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీట్రయల్‌ కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ రేపు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చింది. తన అరెస్ట్‌ అక్రమమని, కస్టడీ రాజ్యాంగ విరుద్ధ మంటూ సోమవారం 537 పేజీలతో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌, పిటిషన్‌ పై విచారణ, కోర్టు ఉత్తర్వుల కాపీలు, మీడియా పబ్లిష్‌ చేసిన కథనాలను కవిత జత చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిం దని, పొలిటికల్‌ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని తన పిటిష న్‌లో కవిత ఆరోపించారు.

చట్టవ్యతిరేకంగా, కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేశారని మెన్షన్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమ లులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి కేసు తనపై లేదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ అంశాలను పరిగ ణన లోకి తీసుకొని తాజా పిటి షన్‌పై తుది తీర్పు వెలువ డేవరకు తక్షణమే తనను విడుదల చేసేలా ఆదేశాలి వ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత అరెస్ట్‌ పై స్టే విధిస్తూ, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు

లిక్కర్ స్కాం కేసు లో ఆరో పణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను నాలుగో రోజు బుధవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట రేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించను న్నారు.

ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యా లయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండ రింగ్ కేసులో కవిత పాత్ర.. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడి యా కేజ్రీవాల్‌తో ఒప్పందా లు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.

రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్‌ లో కవిత భోజనం చేస్తు న్నారు.

ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమ ణులు అఖిల సౌమ్య, విను త, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకు నేందుకు అను మతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.

కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించి నట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచా రం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది.

మంగళ వారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యా హ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించి నట్టు తెలిసింది.

అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలి సేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతిం చారు....

నేడు టీడీపీ 3వ జాబితా విడుదల?

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ వీడనుం దని సమాచారం.

కాగా, మొత్తం 25 ఏంపీ సీట్లకు గాను.. పొత్తులో భాగంగా టీడీపీకి 17 సీట్లు వచ్చాయి...

కాంగ్రెస్ రెండో జాబితా ; ఇదేనా ❓️

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబం ధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది.

నిజామా బాద్- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,

ఆదిలాబాద్- డాక్టర్ సుమలత,

కరీంనగర్- ప్రవీణ్ రెడ్డి,

వరంగల్- పసునూరి దయాకర్,

చేవెళ్ల- రంజిత్ రెడ్డి,

మల్కాజ్ గిరి- సునీతా మహేందర్ రెడ్డి,

నాగర్ కర్నూల్- మల్లు రవి,

పెద్దపల్లి- గడ్డం వంశీల

పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

హోమ్ ఓటింగ్‌కు నోటిఫికేషన్ జారీ..

త్వరలో జరగనున్న ఎన్ని కలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కోసం ఈసీ నోటిఫి కేషన్ మంగళవారం విడు దల చేసింది.

మే 13న జరగనున్న ఎన్ని కల్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, శారీరక వైకల్యం ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పిం చాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అనుమతినిస్తారు.

పోలింగ్ తేదీ 13వ తేదీకి పది రోజుల ముందు నుంచి ఇంటి నుంచే ఓటు వేయ వచ్చు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు..

ప్రణీత్ రావు కేసులో తీగలాగుతున్న పోలీసులు : కదులుతున్న రాజకీయ లింకులు

తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్లాంటి ఉద్యో గులతో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌రావు.. వేల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తిం చారు.

కూపీలాగిన కొద్దీ లింకులు కదలుతున్నాయి. ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో ప్రణీత్‌కు సహక రించిన వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్‌ టీమ్‌. గతంలో ఈ ఆ ఇద్దరు ప్రణీత్‌ టీమ్‌లో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు పోలీసులు.

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ఫ్రణీత్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్‌లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటిక‌ల్‌‌గా కలకలం రేపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు.

ఫోన్‌ట్యాపింగ్‌తో తనకే సంబంధంలేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్‌ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు దయాకర్‌రావు.

ఇక, విచారణలో బాగంగా బంజారాహిల్స్‌ పీఎస్‌లో ప్రణీత్‌రావును వైడ్‌ యాంగి ల్‌లో ప్రశ్నించింది స్పెషల్‌ టీమ్‌. గత ఆరేళ్లుగా ప్రణీత్‌ ఎలాంటి ఆపరేషన్స్‌ నిర్వ హించారో ఆరా తీశారట.

అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్‌ ట్యాపింగ్‌? టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేయ డం వెనక కారణాలేంటి? ట్యాపింగ్‌ చేసిన కాల్‌ రికార్డ్స్‌ను ఎవరికి ఎందుకు పంపించారు? అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేక రించినట్టు తెలుస్తోందట.

ఇక, ప్రణీత్‌ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వయి రీ చేస్తున్నారు ప్రత్యేక బృం దం పోలీసు అధికారులు.

హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడు దలైన నేపథ్యంలో ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పోలీస్‌, ఎస్‌. ఎస్‌.టి, ఎఫ్‌.ఎస్‌.టి టీమ్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటలపాటు 9 టీంలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మూడ్రోజుల్లోనే రూ.35లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న ఈ బృందాలు, విలువైన వస్తువులను సీజ్‌ చేశాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16,43,300తోపాటు రూ.10,250 విలువగల వస్తువులను సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎఫ్‌. ఎస్‌.టీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రూ.9,30,000 సీజ్‌ చేయగా, పోలీసులు మరో రూ.7,13,300ను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.17,25, 311 విలువగల వస్తువుల ను పట్టుకున్నారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని.. 8 మందిని ప్రోహిబిషన్‌ కేసుల్లో అరెస్టు చేశారు.

మంగళవారం నగదు, ఇతర వస్తువులపై 5 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్క రించారు. ఇప్పటి వరకు వరకు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.