చరిత్రలో నిలిచేలా సంక్షేమ పాలన.. వైఎస్సార్సీపీ 58 నెలల పాలన జనరంజకం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
చరిత్రలో నిలిచేలా సంక్షేమ పాలన.. వైఎస్సార్సీపీ 58 నెలల పాలన జనరంజకం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
మరోసారి వైయస్ జగనన్నకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, 58 నెలల పాలనలో సాహసోపేతమైన సంక్షేమ పథకాలను అమలుచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందని వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కే. వి. యస్.నగర్, గిరిప్రసాద్ నగర్, దక్షిణామూర్తి నగర్, చాకలి ఐలమ్మ కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
కాలనీలలోని వైఎస్సార్సీపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా కుటుంబాల లబ్ధిపై ఆరా తీశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు జగనన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని మీ అందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తామంటున్న పథకాలకు షూరిటీ, టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికి అమలు కాని వాగ్దానాలతో ఓట్ల కోసం వస్తున్న టిడిపికి సరైన సమాధానం చెప్పాలని ప్రజలకు తెలిపారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం సంక్షేమం ,అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందాయని మా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 21 2024, 06:36