నేడు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్,లోకి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరను న్నట్లు ఎక్స్ వేదికగా ప్రవీణ్‌ కుమార్ ప్రకటించారు.

తన రాజకీయ భవితవ్యంపై ఆదివారం వందలాది శ్రేయో భిలాషులు, ఆప్తులు, అభి మానులందరితో మేధోమ ధనం జరిపానని పేర్కొ న్నారు.

ఆ సభలో రకరకాల అభిప్రా యాలు వచ్చాయని, కానీ తన మీద నమ్మకంతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ ఎక్స్ వేదిక గా ప్రవీణ్‌కుమార్ హృదయ పూర్వక ధన్య వాదాలు తెలిపారు.

తెలంగాణ విశాల ప్రయో జనాలను దృష్టిలో ఉంచు కొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని వెల్లడించారు.

తాను ఎక్కడున్నా బహు జన మహనీయుల సిద్దాం తాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు.

దయచేసి నిండు మనస్సు తో ఆశ్వీరదించండి…జై భీం..జై తెలంగాణ..జై భారత్ అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.

సుప్రీం కోర్టుకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్

ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు.

ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేప థ్యంలో ఈడీ ఆమెను అక్ర మంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వో న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారిం చారు.ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారు లు కవితను అరెస్ట్ చేయ డం నిబంధనలను విరుద్ధ మని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు.ఇదే విషయం పై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు.

ప‌ట్టాలు త‌ప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్

ఈ మ‌ధ్య కాలంలో రైళ్లు త‌రుచూ ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. అధి కారులోప‌మో లేదా సాంకే తిక లోప‌మో గానీ ప్ర‌మాదా లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమ‌వారం తెల్ల‌వారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

అదృష్టవశాత్తూ ఈ ఘట నలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని సబర్మతి నుంచి యూపీలోని ఆగ్రాకు వెళ్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్ సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది.

మాదర్ రైల్వే స్టేషన్‌ సమీ పంలో తెల్ల‌వారుజా మునా రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహా యక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తు న్నారు.

రాత్రి తామంతా గాఢ నిద్ర లో ఉండా పెద్ద శబ్దం వినిపిం చిందని, చివరకు రైలు పట్టా లను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడి యాకు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.

హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..

హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీ క్షలు జరుగుతాయి.

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తం గా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియ నుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు జరు గుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరప నున్నారు.

పేపర్ లీకేజీ వంటి అవాం చిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసు కురాకుండా నిషే ధించారు. 130 సమస్యా త్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తర గతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రా నికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ నంబర్‌ ప్రింట్‌ చేశారు.

ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసు కునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొ చ్చారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. హాల్ టిక్కెట్లు చూపి తే ఆర్టీసీ బస్సులో టెన్త్‌ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.

ఎన్నికల కోడ్ నిబంధనలు

ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల పోస్టర్లు తొలగించాలి.

ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారిక వాహనాల విని యోగం నిలిపివేయాలి.

అధికారుల బదిలీలపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదు...

తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడు దలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షెడ్యూల్‌ ఎట్టకేలకు ఎన్ని కల కమిషన్‌ విడుదల చేసింది.

అయితే దేశంలో మొత్తం ఐదు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, లోక్‌సభ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగను న్నాయి.

18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది.

అయితే ఇందులో జమ్మూ లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగ నున్నాయి. అయితే లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగియ నుంది.

ఇక తెలంగాణ విషయా నికొస్తే రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగనున్నాయి.

తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం ప్రకటించారు.

అయితే ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు జరుగ నున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది.

ఎన్నికలకు కోటి 50 లక్షల సిబ్బంది

ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల సిబ్బంది ఉండను న్నట్లు రాజీవ్‌ తెలిపారు. జూన్‌ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రేపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్?

రేపు మధ్యాహ్నం 3 గంట లకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుంది.

ఈ మేరకు ఈసీ నేడు అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతా యని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగ నున్నాయి.

లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈలో గానే కొత్త ప్రభుత్వం ఏర్ప డాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చ్ 10న షెడ్యూల్ విడుదలయింది.

ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో… రేప టి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...

తెలంగాణలో నేటి నుండి ఒంటి పూట బడి

రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించ నున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్ప కుండా ఒంటిపూట బడు లను అమలులోకి తీసుకు రావాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.

ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలా బాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బాస్ ప్రకటించారు.

ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థు లను ప్రకటించారు. తాజా గా, ఇద్దరు అభ్యర్థుల ప్రకట నతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా 11కి చేరింది.

ఇంకా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్‌ ఎస్‌.. ఐదుగురు అభ్యర్థు లను ప్రకటించింది.

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూ బాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయి నపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మహబూ బ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది.

అటు.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు.