వలిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అభివృద్ధి పనులు జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి జడ్పిటిసి నిధులు అరుర్ గ్రామము నుండి చంద్రాయన గుట్టకు వెళ్లే కల్వర్టు కు 3,50,000కేటాయించినారు. వెలివేర్తి లో సిసి రోడ్డు కోసం 250000 జెడ్పిటిసి నిధుల నుండి కేటాయించి న్నారు. వేములకొండ దగ్గర కల్వర్టు కు నాలుగు లక్షల రూపాయలు.

 జడ్పిటిసి నిధుల నుండి కేటాయించి ఈరోజు  గ్రామ పెద్దలు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెల్వర్తి ఎంపీటీసీ ఎడవెల్లి యాదగిరి వేములకొండ ఎంపిటిసి సామ రామిరెడ్డి. మండల నాయకులు రసూలు పులిపాలుపుల రాములు. అరూరు గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు పరమేష్ నరసింహ . కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ ...తుర్కపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ భర్త నర్సిరెడ్డి నీ తన పెద్ద కోడలు బద్దం స్వరూప మరియు ఆమె కుమారుడు బద్దం సాయి రెడ్డి వ్యవసాయ భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలని తరచూ కర్రలతో కొట్టడంతో బద్దం యాదమ్మ తేదీ 12 -03- 24 న కోడలు స్వరూప పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మోత్కూర్ లో ఉంటున్న తన పెద్ద కూతురు కొంతం సువర్ణ దగ్గర ఉండగా శుక్రవారం రాత్రి 10:30 నిమిషాలకు కడుపు, ఛాతిలో నుండి నొప్పి రావడంతో మోత్కూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ మృతి చెందారు. మృతురాలి కుమారుడు బద్దం మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని శనివారం వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

బొమ్మలరామరంలో కల్నాన్ వినయ్ భాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


భారతదేశంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కల్నల్ వినయ్ బాను రెడ్డి విగ్రహాన్ని బొమ్మల రామారం నడి బొడ్డున చౌరస్తాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కల్నల్ వినయ్ బాను రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా శనివారం వినయ్ బాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..వారు ప్రాణత్యాగం చేసింది వారి కుటుంబం కోసమో ఇంకెవరి కోసమో కాదు భారతదేశ స్వాతంత్రం కోసం మన అందరి గుండెల్లో ఉండే వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి కల్నల్ వినయ్ భాను రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి మీ వంతు కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కల్నల్ వినయ్ బాను రెడ్డికి ప్రత్యేకంగా నివాళులర్పించారు..వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థినిలకు బహుమతులు అందజేత


విద్యార్థులు టాలెంట్ టెస్ట్ మాదిరిగానే 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉన్నత ఫలితాలు సాధించాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు

*భారత విద్యార్థి ఫెడరేషన్ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి జిల్లా స్థాయి టాలెంట్ నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షలలో మొదటి స్థానం మొదటి ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షల పట్ల వారిలో ఉన్న భయాందోళన దూరం చేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం టాలెంట్ టెస్ట్ ద్వారా పరీక్షలకు ముందస్తుగా విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు అందరూ మానసిక ఒత్తిడికి గురికాకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకొని మంచిగా పరీక్షలు రాసి తమ తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పరీక్షల్లో పాల్గొనబోయే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు నాయకులు మైసోల్ల నరేందర్ ఉపాధ్యాయులు పాండు , బాలశౌరి,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత అరెస్టుపై శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి , ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ , యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి , భువనగిరి జడ్పీటీసీ శ్రీ బీరు మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కొనలేకనే బిజెపి అరెస్టుల కు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ బిజెపిలు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల శాఖ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పంజాల సతీష్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరేందర్, బోడ్డు వెంకటేష్,మండల ప్రచార కార్యదర్శి పల్ల శ్రీనివాస్ రెడ్డి, BRS నాయకులు ఎర్ర శేఖర్ రెడ్డి, లక్ష్మీదేవి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు జీల్కపల్లి బలరాజ్ భువనగిరి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం


 

 

 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "సంకల్ప్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు లలో "కమ్యూనిటీ సర్వీస్ అవార్డు-2024" కు భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఎంపికైనారు. శుక్రవారం హైదరాబాద్ లోని చందానగర్ లోని హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లో జరిగిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా కొడారి వెంకటేష్ అవార్డు ను అందుకున్నారు. "సంకల్ప్ ఫౌండేషన్ " ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో వివిధ రంగాలలో సేవలందించిన, మరియు ప్రత్యేక ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, చేనేత, పారిశుద్ధ్య, పారిశ్రామిక, మహిళా హక్కుల, మహిళా సాధికారత, పిల్లల హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆద్యాత్మిక ,తదితర అంశాలపై పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత దశాబ్ద కాలంగా, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం , మహిళా సాధికారత కోసం కృషి చేసిన కొడారి వెంకటేష్

రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న మా మార్గదర్శి పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా గర్వంగా, మరియు ఆనందంగా ఉందన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గండ్ర మేడం ఆద్వర్యంలో లభించిన ఈ అవార్డుతో సామాజిక భాద్యత మరింత పెరిగిందన్నారు. నాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్, సూర్యాపేట జిల్లా పీపుల్స్ ఫౌండేషన్ డైరెక్టర్ యాతాకుల సునీల్ లు ఎక్సలెంట్ అవార్డులకు ఎంపికైనారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికకు సహకరించిన వికారాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇ. వెంకటేష్, సభ్యులు ధనసిరి ప్రకాష్ లకు కొడారి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు

మోట కొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్షిరాం జయంతి


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్సిరాం జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఉద్యోగం వ్యక్తిగత జీవితం సంపాదన ఇంటిని ఇలా అన్నింటినీ వదిలేసి సమాజంలోని సబ్బండ వర్ణాలను కలిపి ఆనాడు భగవాన్ బుద్ధుడు చెప్పిన బహుజన హితాయ బహుజన సుఖాయ లక్ష్యం సాధించి చూపి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను నిజం చేసిన మహానుభావుడు కాన్సీరామ్ అని అన్నారు. సైకిల్ మీద తిరుగుతూ లక్షల మందిని కలిసి మహనీయుల మార్గంలో సమాజాన్ని నిర్మించిన ధీరుడు కాన్షిరాం. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ జిల్లా కార్యదర్శి కుసంగుల కుమార్ మండల కన్వీనర్ శ్రీను నరసింహ శ్రీకాంత్ భట్ల శ్రీను గంధ మల్ల నాని యాదగిరి కిష్టయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయ ఈవో గా భాస్కర్ రావు నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు పై ప్రభుత్వం బదిలీ వేటి వేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశాడు అని బదిలీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈఓ గా భాస్కర్ రావు నియామకం. యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తు సస్పెండ్ అయిన భాస్కర్ రావు  తిరిగి యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్


ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ గారిపై వ్యక్తిగతంగా అనవసరంగా మాట్లాడి దూషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ 48 గంటల్లో చెప్పాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తలను సైకోలు అని సంబోధించడం విశారదన్ మహరాజ్ గారి కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం పై ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మాట్లాడుతూ.....

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు... మహనీయుల పోరాట స్ఫూర్తితో ఏర్పడినటువంటి బహుజన వాదాన్ని పూటకో మాట మారుస్తూ సిద్ధాంతానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ పగ్గాలు విడిచి హిమాలయాలకు వెళ్లిపోవాలని రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలియజేస్తాము....

 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ నాగర్ కర్నూల్ లో పదివేల మంది కార్యకర్తలతో వచ్చి నువ్వు అగ్రకులాల పార్టీ లతో కలిసి చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరికీ తెలియజేసి నిన్ను ఓడకొట్టడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాను... 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్, నకిరేకంటి నరేందర్, ch వెంకటేష్ లు పాల్గొన్నారు....

నూతన వధూవరులను ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా 

భువనగిరి పట్టణ పరిధిలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ లో వలిగొండ మాజీ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్ ల కూతురు శిరీష - ప్రణయ్ ముధిరాజ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరుల ని ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ . ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిజెపి అధ్యక్షులు బోళ్ల సుదర్శన్, మాటూరు కిట్టు, మాటూరు వెంకటేష్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.