ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
-సీఎం జగనన్నతోనే గ్రామాభివృద్ధి
శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎల్బీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు.
యం. జి.యన్.ఆర్.ఇ. జి. యస్ క్రింద రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమానంగా చూస్తోందని, ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు జోరుగా చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీ పాలనలో చేయని అభివృద్ధిని నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలోని జన చైతన్య కాలనీలో ఉన్న మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆలూరు రమణారెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల సొంత నిధులను ముస్లిం పెద్దలకు అందజేశారు.
గత టిడిపి ప్రభుత్వ పాలనలో మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి నిర్మించిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వంత ఖర్చుతో గోడను నిర్మించుకున్నాము అని , గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంతో కాంపౌండ్ గోడ ఖర్చు తామే ఇస్తామని మాట ఇచ్చి నేడు మాట నిలుపుకున్నారని ముస్లిం పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తమ కాలనీల్లో అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు, అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇలాంటి పాలన మళ్ళీ రావడం కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు తెలిపారు.
అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివరెడ్డికి ఆలూరు రమణారెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 09 2024, 07:46