గృహ జ్యోతి జీరో బిల్లు రాని దరఖాస్తుదారులకు ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా గృహ జ్యోతి పథకానికి ఇదివరకే కరెంటు మీటర్ నెంబరు, ఆధార్ కార్డు గృహ జ్యోతి దరఖాస్తు ఫారమును సమర్పించిన గృహ జ్యోతి పథకం ప్రారంభించి నా సమయంలో కరెంటు మీటర్ రీడింగ్ బిల్లు కోట్టే సమయంలో జీరో బిల్లు రాకపోవడంతో గృహ జ్యోతి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కి సంబంధించిన దరఖాస్తు ఫారం ను మళ్లీ స్థానిక ఎంపీడీవో ఆఫీసులో సమర్పించాలని చెప్పడంతో వలిగొండ మండలంలో 37 గ్రామ పంచాయతీల ప్రజలు గృహజ్యోతి లబ్ధిదారులు గత మూడు నాలుగు రోజులగా వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఈ పథకం అమలుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ గృహజ్యోతి పథకానికి ఆఫీసులోని సిబ్బంది వచ్చిన గృహ జ్యోతి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు వాపోయారు.
వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని
స్థానిక ఎంపీడీవో అధికారిని కోరారు.
Mar 07 2024, 20:42