గృహ జ్యోతి జీరో బిల్లు రాని దరఖాస్తుదారులకు ఇబ్బందులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా గృహ జ్యోతి పథకానికి ఇదివరకే కరెంటు మీటర్ నెంబరు, ఆధార్ కార్డు గృహ జ్యోతి దరఖాస్తు ఫారమును సమర్పించిన గృహ జ్యోతి పథకం ప్రారంభించి నా సమయంలో కరెంటు మీటర్ రీడింగ్ బిల్లు కోట్టే సమయంలో జీరో బిల్లు రాకపోవడంతో గృహ జ్యోతి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కి సంబంధించిన దరఖాస్తు ఫారం ను మళ్లీ స్థానిక ఎంపీడీవో ఆఫీసులో సమర్పించాలని చెప్పడంతో వలిగొండ మండలంలో 37 గ్రామ పంచాయతీల ప్రజలు గృహజ్యోతి లబ్ధిదారులు గత మూడు నాలుగు రోజులగా వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఈ పథకం అమలుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ గృహజ్యోతి పథకానికి ఆఫీసులోని సిబ్బంది వచ్చిన గృహ జ్యోతి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు వాపోయారు.

వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని

స్థానిక ఎంపీడీవో అధికారిని కోరారు.

చిత్తాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వి .జస్వంత్, ఎన్ శామిని ,దేవి ప్రియ, పి హేమలత ,ఎం వరుణ్ కుమార్ ,ఏ వరుణ్ తేజ్, పాల్గొన్నారు. వీరికి ప్రధానోపాధ్యాయులు విజయానంద్ బహుమతులు ప్రధానం చేశారు .ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఎస్ విజయ్ కుమార్, రస్మిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల బిజెపి నూతన అధ్యక్షులుగా బోళ్ల సుదర్శన్ ఎన్నిక


*యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా బోళ్ల సుదర్శన్ ను జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ గారు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , బూర నరసయ్య గౌడ్, బందారపు లింగస్వామి గౌడ్,CN రెడ్డి, దంతూరి సత్తయ్య గౌడ్, ఏలే చంద్రశేఖర్ ,రాచకొండ కృష్ణ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది, రానున్న ఎంపీ ఎన్నికల్లో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తన వంతు కృషిగా పనిచేస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపుమేరకు పనిచేస్తానని వారు అన్నారు ,క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు ,వీరు విద్యార్థి దశలో ABVP పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, మరియు విద్యార్థి హక్కుల కొరకు పోరాటం చేయడం జరిగింది మరియు బిజెపి పట్టణ అధ్యక్షుడిగా ,బీజేవైఎం జిల్లా కోశాధికారిగా ,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పలు పదవులలో పనిచేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా జోగు అంజయ్య నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా 

భువనగిరి నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడిగా జోగు అంజయ్య ను రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం. అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ నియామక పత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా జోగు అంజయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ. శ్రీనివాస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ బలవంత రెడ్డి ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రాజు వలిగొండ టి యు ఎఫ్. మహిళా అధ్యక్షురాలు గంధ మల్ల మల్లమ్మ. ప్రధాన కార్యదర్శి బొడిగె సుదర్శన్ మంటి లింగయ్య మంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయమునకు బస్సు సర్వీస్ ప్రారంభం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నకు బుధవారం బస్సు సర్వీసును ప్రారంభించారు. మత్స్యగిరి గుట్ట ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ బాబు మాట్లాడుతూ ..ఈరోజు నుండి ప్రతిరోజు ఉప్పల్ నుండి మత్స్యగిరి గుట్ట దేవాలయానికి వయా బీబీనగర్ , భువనగిరి ,వలిగొండ రెండు ట్రిప్పులు మరియు మత్స్యగిరి దేవాలయం నుండి యాదగిరిగుట్ట దేవాలయానికి రాత్రికి ఒక ట్రిప్పు నడిచే విధంగా నూతనంగా బస్ సర్వీసు ప్రారంభించామని అన్నారు. ఇట్టి సదుపాయాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాలు ,సినిమా ప్రోగ్రాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని, అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నామని, రోడ్లకి అనుమతి ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వం 6 వేల పాఠశాలలు మూసి వేశారని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రాలేదు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణం పై విచారణ చేస్తామని అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి : మోత్కూర్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ కేంద్రంలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ అభినందన సభ మోత్కూర్ సెయింట్ ఆన్స్ స్కూల్ లో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న వార్షిక పరీక్షలో విద్యార్థుల ప్రతిభని వెలికితీయడానికి SFI-ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టు లో బహుమతులు అందజేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు..

గురుకులం జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన నాతాళ్లగూడెంకు చెందిన మోటే మీనాక్షి


వలిగొండ మండల పరిధిలోని నాతల్లగూడెం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య మనోరమా దంపతుల కుమార్తె మీనాక్షి ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించింది.మీనాక్షి ప్రస్తుతం మైనార్టీ గురుకుల కళాశాలలో ఔట్సోర్సింగ్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా పని చేస్తూనే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి పట్టుదలతో ఉద్యోగం సాధించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణాళిక ప్రకారం లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు అన్నారు.

భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీగా నియమితులైన కొప్పుల యాదిరెడ్డికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సన్మానం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీ గా నూతనంగా నియమితులైన సందర్భంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ తరపున మండల కార్యాలయంలో వారికి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య ,కణతాల అశోక్ రెడ్డి , మైసోల్ల మచ్చగిరి,రాములు, బచ్చు శ్రీనివాస్ ,దయ్యాల వెంకటేశం,అపిషెట్టి సంతోష్ , డోగిపర్తి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమరేందర్ , బుంగమట్ల మహేష్ ,భాషవాడ బిక్షపతి, నరేష్, కుంభం మహేష్ ,గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి వలిగొండ మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక గురించి సన్నాహక సమావేశము


ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండల కేంద్రంలో CN రెడ్డి కాంప్లెక్స్ లో నాగెల్లీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన నూతన అధ్యక్షుని ఎన్నిక కొరకు సన్నహక సమావేశం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా మండల ఇంచార్జి చందా మహేందర్ గుప్తా గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఆశావాహుల పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి గౌడ్ జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్,సీలోజు శ్రీరాములు, కనతాల అశోక్ రెడ్డి, బంధారపు రాములు,బోల్ల సుదర్శన్, బచ్చు శ్రీనివాస్, మైసొల్ల మచ్చ గిరి, మారోజు అనిల్ కుమార్ ,ఎలిమినేటి వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్, మంద నరసింహ, దయ్యాల వెంకటేశం, రేగురి అమరేందర్,కందుల తానిషా గౌడ్, పోలు నాగయ్య, గండికోట హరికృష్ణ ,మాటూరి శివ, బుంగమట్ల మహేష్ ,బర్ల మల్లేశం, బైరు మల్లేశం, కందికట లక్ష్మణ్ గౌడ్ , ముందుగా నాగరాజు, గోల్కొండ అశోకు, పిన్నింటీ నరేందర్ రెడ్డి,మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.