భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీగా నియమితులైన కొప్పుల యాదిరెడ్డికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సన్మానం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీ గా నూతనంగా నియమితులైన సందర్భంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ తరపున మండల కార్యాలయంలో వారికి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య ,కణతాల అశోక్ రెడ్డి , మైసోల్ల మచ్చగిరి,రాములు, బచ్చు శ్రీనివాస్ ,దయ్యాల వెంకటేశం,అపిషెట్టి సంతోష్ , డోగిపర్తి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమరేందర్ , బుంగమట్ల మహేష్ ,భాషవాడ బిక్షపతి, నరేష్, కుంభం మహేష్ ,గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి వలిగొండ మండల నూతన అధ్యక్షుడు ఎన్నిక గురించి సన్నాహక సమావేశము


ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండల కేంద్రంలో CN రెడ్డి కాంప్లెక్స్ లో నాగెల్లీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన నూతన అధ్యక్షుని ఎన్నిక కొరకు సన్నహక సమావేశం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా మండల ఇంచార్జి చందా మహేందర్ గుప్తా గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఆశావాహుల పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి గౌడ్ జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్,సీలోజు శ్రీరాములు, కనతాల అశోక్ రెడ్డి, బంధారపు రాములు,బోల్ల సుదర్శన్, బచ్చు శ్రీనివాస్, మైసొల్ల మచ్చ గిరి, మారోజు అనిల్ కుమార్ ,ఎలిమినేటి వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్, మంద నరసింహ, దయ్యాల వెంకటేశం, రేగురి అమరేందర్,కందుల తానిషా గౌడ్, పోలు నాగయ్య, గండికోట హరికృష్ణ ,మాటూరి శివ, బుంగమట్ల మహేష్ ,బర్ల మల్లేశం, బైరు మల్లేశం, కందికట లక్ష్మణ్ గౌడ్ , ముందుగా నాగరాజు, గోల్కొండ అశోకు, పిన్నింటీ నరేందర్ రెడ్డి,మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మత్తును వెంటనే చేపట్టాలని, జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేత


భువనగిరి: మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన రైతులు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయని వెంటనే చెరువులు కుంటలు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో రైతులకు పూర్తిగా నష్టపోతున్నారని ఇకనైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో.

ఎడ్ల రాజేందర్ రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంట నరసింహ మాజీ మున్సిపల్ చైర్మన్ కొండ స్వామి ముదిరెడ్డిగూడెం మాదండి జితేందర్ రెడ్డి చందుపట్ల గోమార్ సుధాకర్ రెడ్డి హుస్నాబాద్ అంద శంకర్ తాడెం రాజశేఖర్ భువనగిరి సిరిపంగ సుభాష్ భువనగిరి తుమ్మేటి శ్రీశైలం హుస్నాబాద్ దండబోయిన సత్యనారాయణ హుస్నాబాద్ బి పాపయ్య బాలంపల్లి రాములు గంగసానిపల్లి M ధర్మారెడ్డి డి నరసింహ బొంబాయి పెళ్లి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు పై సస్పెన్షన్ వేటు


యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను ఉల్లంఘించి ,భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తన బదిలీని తప్పించుకున్నందుకు ,విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు, సస్పెండ్ చేస్తూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన చిత్తాపురం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైదరాబాదులో తన నివాసంలో కలిసి గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మాణముకు నిధులు కేటాయించాలని కోరగా వారు స్పందిస్తూ బడ్జెట్ నిధులు కేటాయించగానే మీకు అంబేద్కర్ భవనం సాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన సాగునీటి సౌకర్యం కొరకు భీమ లింగం కాల్వ పొడిగింపులో చిత్తాపురం వరకు కాల్వ మరమ్మతులు చేయించాలని  మరియు ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఉన్నందున ప్రత్యేక బోరు వేయించాలని కోరగా ఆరు స్పందిస్తూ తక్షణమే గ్రామంలో బోరు వేయించి తాగునీటి ఎద్దడి తీరుస్తానని మరియు సాగునీరు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది  .ఈ కార్యక్రమంలో పీసరి వెంకటరెడ్డి ,చేగురు మచ్చగిరి, ఆరూరు నరసింహ ,కందాటి సోమిరెడ్డి ,బోడ విజయ్ కుమార్ ,వలమాల అంజయ్య ,వలమాల కుమార్ ,లింగస్వామి, రాములు ,ధర్మయ్య ,యాదయ్య ,దాసు, పీసరి ఉప్పల్ రెడ్డి ,అరూరు వెంకటయ్య  ,తదితరులు పాల్గొన్నారు.

టేకుల సోమవారం ఎఫ్ సి ఐ గోదాములలో భారీ అగ్నిప్రమాదం


యాదాద్రి భువనగిరి జిల్లా మండలం నాగిరెడ్డిపల్లి - టేకుల సోమవారం గ్రామాల మధ్య గల ఎఫ్ సి ఐ గోదాములలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది .భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ప్రమాదానికి కారణ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్ ,ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. గోదాములలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధమైనది.

జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కరపత్రాలు ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో..డోర్ టూ డోర్ కరపత్రాలు అవిస్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్. పార్లమెంట్ ఇంఛార్జి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్. నియోజకవర్గ అధ్యక్షుడు అవేజ్ చిస్తి. జిల్లా ప్రధాన కార్యదర్శి చేగురి బాలు సోషల్ మీడియా కార్యదర్శి నితిన్ కుమార్ సూపర్ శ్రీ కోఆర్డినేటర్ శ్రీలత ,సాయి తదితరులు ఉన్నారు.

విద్యార్థుల కు స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి: మల్లం వెంకటేశం గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి


హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఆదివారం సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని సొంత భవనాలు కట్టించాలని, స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని , విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు పెంచాలని వేలాదిమంది విద్యార్థులతో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి సంఘం నేతలు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ అస్తవ్యస్యం; దంతూరి సత్తయ్య గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ లో రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక ఇంచార్జి కార్యదర్శితో పాలన సాగిస్తున్న గ్రామపంచాయతీ వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ పరిధిలోని వివిధ పనులను అస్తవ్యస్తంగా ఇంచార్జి పాలనలో నడిపిస్తున్న రని ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలిగొండ మండలం జిల్లాలోని 37 గ్రామపంచాయతీలు గల పెద్ద మండలం అని అందునా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ కావడం మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇళ్ల నిర్మాణాలు తదితర పనుల నిమిత్తం వలిగొండలో నివసిస్తూ ఉంటారు. ఈ మేజర్ గ్రామపంచాయతీకి గత రెండు సంవత్సరాలుగా ఇంచార్జి కార్యదర్శి తో పాలనను జిల్లా అధికారులు నడిపిస్తున్నరని ఆయన అన్నారు.

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకోని అధికారులని ఆయన అన్నారు. వేసవికాలంలో నీటి ఎందడి ఏర్పడుతుందని ఈ విషయంపై భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని నియమించి మేజర్ గ్రామపంచాయతీలో గల పలు సమస్యలపై దృష్టి సారించి నీటి ఎందడి నివారించగలరని ఆయన అన్నారు. వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ ఇళ్ల నిర్మాణాల అనుమతిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఈ అవకతవకలను అరికట్టాలంటే మేజర్ గ్రామపంచాయతీ అయిన వలిగొండకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించాలని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించి వలిగొండ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరగకుండా పాలనను సజావుగా నడిపించే విధంగా చూడాలని ఆయన కోరారు.

వలిగొండ : నాగారం బట్టి మైసమ్మ ఆలయం లో హుండీ లెక్కింపు


బట్టి మైసమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు 

వలిగొండ : మండలంలోని నాగారంలోగల శ్రీ బట్టి మైసమ్మ ఆలయంలో గల హుండీలను ఆదివారం లెక్కించగా ఒక సంవత్సర కాలానికి గాను 1,16,600 రూపాయలు లభించినట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యాక్రమంలో బెలిదె నాగేశ్వర్,BSR శ్రీనివాస్, గోళ్ల పెద్ద బిక్షపతి, పోలు నాగయ్య,బర్ల సత్తయ్య, మైసోళ్ల సత్యం, అల్లి వెంకటేశం,ఎల్లంకి స్వామి, తదితరులు పాల్గొన్నారు.