యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి


 దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం యాదగిరిగుట్ట డిపో దగ్గర కార్మికులు యూనియన్ల కు అతీతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ టీ ఎస్ ఆర్టీసీ ని, ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీల డబ్బులు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ కాలం నాటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలియజేయుట కొరకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికుల పక్షపాతిగా, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు మురళి, కృష్ణయ్య, కుమార్, రమేష్ ,యాదగిరి, నగేష్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు.

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్


NEP కి వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో సంతకాల సేకరణకు మద్దతు తెలిపి అడ్డగూడూరు మండలంలో సంతకాల సేకరణను ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు*

అనంతరం ఎమ్మెల్యే సామేల్ గారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 అనంతరం ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ ....

విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. 

 రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు. 

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని అన్నారు.

ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందుత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు ఇటుకల చిరంజీవి గారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ , వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ, అడ్డగూడూరు మండల నాయకులు కళ్యాణ్, లోకేష్ , వంశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సర్నెని గూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికుడు మృతి


ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి ప్రాణాలు కోల్పోయిన కల్లుగీత కార్మికుడు రామన్నపేట మండలం సర్నేని గూడెం గ్రామానికి చెందిన నీల నరసింహ వయసు 62 సంవత్సరాలు అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఒక్క కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారుఇతని కుటుంబాన్ని కిప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయగిరి కిష్టయ్య కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎర్ర రవీం దర్ పులి బిక్షం అంకిటి శీను తానిషా కోరారు

స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


హైదరాబాద్ రవీంద్రభారతిలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 84వ జయంతి ఉత్సవాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రులతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఐటి, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి శాలువా కప్పి మెమొంటో అందజేశారు.

నిరుద్యోగులను నిరాశపర్చిన మెగా డీఎస్సీ: కూచి మల్ల నాగేష్ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు


మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల మంది అభ్యర్థులకు 11,062 పోస్టులు మాత్రమే నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇది అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. ఎన్నికల సమయంలో 25 వేల నుండి 30 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి 11062 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి ఇదిగో మెగా డీఎస్సీ! అదిగో మెగా డీఎస్సీ! అని నిరుద్యోగులను దగా చేశారని అన్నారు. నిరుద్యోగుల పుణ్యమా అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిరుద్యోగులను కాంగ్రెస్ కూడ నిలువు దోపిడి చేయాలని చుస్తుందని నిరుద్యోగులు అందరూ మీ పాలనను గమనిస్తున్నారని అన్నారు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ ధరకాస్తు ఫీజులు తక్కువ చేస్తామన్నారని, మరి నేడు డీఎస్సీ అప్లికేషన్ ఫీజు తగ్గించి, పోస్టుల సంఖ్య పెంచాలని కోరారు.

బిజెపి జిల్లా సెక్రెటరీ గా నియమితులైన కొప్పుల యాదిరెడ్డికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీ గా నూతనంగా నియమితులైన సందర్భంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ తరపున మండల కార్యాలయంలో వారికి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య ,కణతాల అశోక్ రెడ్డి , మైసోల్ల మచ్చగిరి,రాములు, బచ్చు శ్రీనివాస్ ,దయ్యాల వెంకటేశం,అపిషెట్టి సంతోష్ , డోగిపర్తి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమరేందర్ , బుంగమట్ల మహేష్ ,భాషవాడ బిక్షపతి, నరేష్, కుంభం మహేష్ ,గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తాపురం శివాలయం గుడికి విరాళం అందజేసిన మేడి కుమార్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం శివాలయం గుడిలో శివరాత్రి ఉత్సవాలకు గోపరాజు పల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మేడి కుమార్ శివాలయం గుడికి పదివేల రూపాయలు విరాళంగా కల్లూరి శ్రీనివాస్ స్వామి ,చేగురి మహేష్ కు అందజేయడం జరిగింది.

గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు... వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ అయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన నారి అశోక్ చిన్న కుమార్తె నారి మనిషా , విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటుంది. ఈనెల 23న సూర్యాపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 28 బుధవారం గోకారం బయలుదేరారు . మనిషా ఇంటికి చేరుకోకపోగా ,తండ్రి గ్రామంలో ,చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. మనిషా తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని గురువారం ఉదయం ఎనిమిది గంటలకి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కావద్దు: ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్, దేశి రెడ్డి వెంకట్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక, పహిల్వాన్ పురం గ్రామాలలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున దేశి రెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వారికి వివరించడం జరిగింది. పరీక్ష సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి, స్ట్రెస్ కు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. మనం వచ్చింది వచ్చి పోవడానికి కాదు ఏదైనా ఇచ్చి పోవడానికి అని తెలియజేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లగొండ ఇంచార్జ్ నూనె సుదర్శన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక ప్రధానోపాధ్యాయులు గంగ దారి బిక్షపతి, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, వరమ్మ, పహిల్వాన్ పురం ఉపాధ్యాయులు గురు ప్రసాద్, కృష్ణమూర్తి, విమల, అండాలు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని montessori లో

 సైన్స్ ఫేర్ లతో విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెరుగుతుందని పాఠశాల డైరెక్టర్,న్యాయవాది

 కొండూరు బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుతారనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ, అటవీ,గ్లోబల్ వార్మింగ్ , చంద్రాయన్ అంతరిక్ష నమూనాలతో పాటు వివిధ సైన్స్ ప్రదర్శనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించగా సైన్స్ ఫెయిర్ లోని నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.థామస్ అబ్రహం, అనూప్, సాండ్రా, మహేష్, జేరిన్, మనూ, డార్లి, కావ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.