స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


హైదరాబాద్ రవీంద్రభారతిలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 84వ జయంతి ఉత్సవాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రులతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఐటి, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి శాలువా కప్పి మెమొంటో అందజేశారు.

నిరుద్యోగులను నిరాశపర్చిన మెగా డీఎస్సీ: కూచి మల్ల నాగేష్ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు


మెగా డీఎస్సీ నోటిఫికేషన్ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల మంది అభ్యర్థులకు 11,062 పోస్టులు మాత్రమే నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇది అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. ఎన్నికల సమయంలో 25 వేల నుండి 30 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి 11062 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి ఇదిగో మెగా డీఎస్సీ! అదిగో మెగా డీఎస్సీ! అని నిరుద్యోగులను దగా చేశారని అన్నారు. నిరుద్యోగుల పుణ్యమా అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిరుద్యోగులను కాంగ్రెస్ కూడ నిలువు దోపిడి చేయాలని చుస్తుందని నిరుద్యోగులు అందరూ మీ పాలనను గమనిస్తున్నారని అన్నారు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ ధరకాస్తు ఫీజులు తక్కువ చేస్తామన్నారని, మరి నేడు డీఎస్సీ అప్లికేషన్ ఫీజు తగ్గించి, పోస్టుల సంఖ్య పెంచాలని కోరారు.

బిజెపి జిల్లా సెక్రెటరీ గా నియమితులైన కొప్పుల యాదిరెడ్డికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రెటరీ గా నూతనంగా నియమితులైన సందర్భంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ తరపున మండల కార్యాలయంలో వారికి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య ,కణతాల అశోక్ రెడ్డి , మైసోల్ల మచ్చగిరి,రాములు, బచ్చు శ్రీనివాస్ ,దయ్యాల వెంకటేశం,అపిషెట్టి సంతోష్ , డోగిపర్తి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమరేందర్ , బుంగమట్ల మహేష్ ,భాషవాడ బిక్షపతి, నరేష్, కుంభం మహేష్ ,గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తాపురం శివాలయం గుడికి విరాళం అందజేసిన మేడి కుమార్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం శివాలయం గుడిలో శివరాత్రి ఉత్సవాలకు గోపరాజు పల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మేడి కుమార్ శివాలయం గుడికి పదివేల రూపాయలు విరాళంగా కల్లూరి శ్రీనివాస్ స్వామి ,చేగురి మహేష్ కు అందజేయడం జరిగింది.

గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు... వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలో మహిళ మిస్సింగ్ అయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన నారి అశోక్ చిన్న కుమార్తె నారి మనిషా , విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటుంది. ఈనెల 23న సూర్యాపేటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 28 బుధవారం గోకారం బయలుదేరారు . మనిషా ఇంటికి చేరుకోకపోగా ,తండ్రి గ్రామంలో ,చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. మనిషా తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని గురువారం ఉదయం ఎనిమిది గంటలకి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కావద్దు: ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్, దేశి రెడ్డి వెంకట్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక, పహిల్వాన్ పురం గ్రామాలలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున దేశి రెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వారికి వివరించడం జరిగింది. పరీక్ష సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి, స్ట్రెస్ కు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. మనం వచ్చింది వచ్చి పోవడానికి కాదు ఏదైనా ఇచ్చి పోవడానికి అని తెలియజేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లగొండ ఇంచార్జ్ నూనె సుదర్శన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక ప్రధానోపాధ్యాయులు గంగ దారి బిక్షపతి, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, వరమ్మ, పహిల్వాన్ పురం ఉపాధ్యాయులు గురు ప్రసాద్, కృష్ణమూర్తి, విమల, అండాలు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని montessori లో

 సైన్స్ ఫేర్ లతో విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెరుగుతుందని పాఠశాల డైరెక్టర్,న్యాయవాది

 కొండూరు బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుతారనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ, అటవీ,గ్లోబల్ వార్మింగ్ , చంద్రాయన్ అంతరిక్ష నమూనాలతో పాటు వివిధ సైన్స్ ప్రదర్శనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించగా సైన్స్ ఫెయిర్ లోని నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.థామస్ అబ్రహం, అనూప్, సాండ్రా, మహేష్, జేరిన్, మనూ, డార్లి, కావ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నిక

యాంకర్ పార్ట్; భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బుధవారం 11 గంటలకి నిర్వహించారు. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ ,వైస్ చైర్మన్ లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు నిర్వహించిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో భువనగిరి పట్టణం 29 వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనారు. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కి 18 మంది చేతులెత్తి మద్దతు తెలిపినారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ప్రకటించారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలియజేశారు.

వెలువర్తి గ్రామంలో కిడ్నాపర్ల భయాన్ని తొలగించి, అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మంగళవారం రాత్రి వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజల్లో కిడ్నాపర్ల గురించి భయాన్ని తొలగించి, నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈరోజు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో తిరుగుతుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అప్పగించారని అన్నారు. కిడ్నాపర్ల గురించి గ్రామస్తుల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ..గ్రామస్తులు, యువకులతో కలిసి గ్రామంలో తిరిగామని అన్నారు. ఇటీవల దొంగతనాలు పెరిగాయని దొంగతనాలు పట్ల , నేరాలు సైబర్ నేరాల గురించి ప్రజలకి అవగాహన కల్పించామని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు రాష్ట్ర,ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వనికి,గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం రోజు రాష్ట్ర సచివాలయంలో 500కే గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.జీవో రిలీస్ చేసినందుకు గ్యారెంటీల అమలుకు దశ దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.