నార్పల కలను సాకారం చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. జగనన్న అండతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి, హామీని నెరవేర్చని గత పాలకులు.. ఎమ్మెల్యే
రూ.2.50 కోట్ల వ్యయంతో కూతలేరు బ్రిడ్జిను ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
◆ పాల్గొన్న శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయ కర్త ఎం. వీరాంజనేయులు..
గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు చేయని పనిని చేసి చూపించి నార్పల మండల ప్రజల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
నార్పల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూతలేరు బ్రిడ్జ్ ను ఆమె ప్రారంభించారు.
గత పాలకులు కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాజీ లయ్యారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్మావతి నార్పల మండల ప్రజలకు కూతలేరు బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నేడు నెరవేర్చారు. మాట తప్పని మడమ తిప్పని సీఎం జగనన్న ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నార్పల మండల ప్రజలకు ఇచ్చిన హామీనీ నేడు సగర్వంగా నెరవేర్చుకున్నారు.
నాడు కాంగ్రెస్ పార్టీ, నిన్న తెలుగుదేశం పార్టీ కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీనే నెరవేర్చకుండా కాలయాపన చేసి వెళ్లిపోయారు. ఇచ్చిన హామీనే తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత పద్మావతికే దక్కుతుంది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికలకు ముందు కూతలేరు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పిన విధంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామన్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం వాటిని లెక్కచేయకుండా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి మాట ఇస్తే తప్పని ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని రుజువు చేశామన్నారు.
శింగనమల చెరువు లోకలైజేషన్, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జగనన్న పాలనలో చేసి చూపించామన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు నుంచి అభివృద్ధి వరకు కార్యక్రమాలు ఎక్కడా నిలపకుండా పూర్తి చేశామన్నారు. ప్రజలందరూ జగనన్న వెంట ఉన్నారని తెలియడానికి 'సిద్ధం సభ' కు వచ్చిన ప్రజలే నిదర్శనమన్నారు.
రాబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ప్రజలకు దగ్గరగా ఉంటామన్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలో పాలించిన నాయకులు ఎవరూ నెరవేర్చని కూతలేరు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి నార్పల ప్రజల కష్టాలను, మరియు ఈ బ్రిడ్జి పై అనేక గ్రామాలకు వెళ్ళటాని సులువుగా చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 02 2024, 07:40