పథకాలు కొనసాగాలంటే.. జగనన్న మళ్లీ రావాలి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరంజనేయులు
రాష్ట్రంలో పేదలకు మేలు జరగాలన్నా..మరోసారి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా...అభివృద్ధి పనులన్నీ ముందుకు సాగాలన్నా.. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని సమన్వయకర్త ఎం. వీరంజనేయులు అన్నారు.
శింగనమల మండలం నిదనవాడ, గ్రామంలో ఆయన పర్యటించారు.
గ్రామంలో ప్రజలను పలకరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసి చూపించారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ప్రతి ఒక్కరూ చూశారని గుర్తు చేశారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తన పాలనలో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలు గుర్తించాలని కోరారు. బాబు మోసపు మాటలు, హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని హితవు పలికారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. జరగబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mar 01 2024, 07:44