మహిళల ఆర్థిక పరిపుష్టికి 'ఆసరా.. 'రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,.పెనుకొండ ఎమ్మెల్యే సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు
మహిళల ఆర్థిక పరిపుష్టికి 'ఆసరా.. 'రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,.పెనుకొండ ఎమ్మెల్యే
సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు
◆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న
● శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు
● పాల్గొన్న పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ మరియు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య.
వైయస్సార్ ఆసరా పథకం మహిళల ఆర్థిక పరిపుష్టికి ఆసరాగా నిలుస్తోందని సాంబ శివారెడ్డి, ఎం.వీరాంజనేయులు అన్నారు.
యల్లనూరు మండల కేంద్ర పరిధిలోని గ్రామ సచివాలయం-2 దగ్గర ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు, శంకర్ నారాయణ, పైలా నరసింహయ్య పాల్గొన్నారు.
మండలంలో ఆసరా ద్వారా రూ.5.99 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 588 సంఘాలకు దాదాపు రూ.23.96 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేకూర్చారు. మరియు ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 706 సంఘాలకు దాదాపు రూ.43.33 కోట్ల రూపాయలు వైయస్సార్ సున్నా వడ్డీ క్రింద లబ్దిని చేకూర్చారు.
588 స్వయం సహాయక సంఘాల సభ్యులు, 5,880 మందికి నాలుగో విడతగా దాదాపు రూ.5.99 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు.
వారు మాట్లాడుతూ.. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ ప్రకృతి కూడా తోడుగా ఉండి రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు.గత ఎన్నికల సమయంలో టీడీపీ పొదుపు మహిళలను పసుపు కుంకుమ పథకం పేరుతో మోసం చేసిందన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మహిళల బాధలు తెలుసుకుని వారి కష్టాలను తీర్చేందుకు రుణాలను మాఫీ చేయడం పాటు వారికి ఆసరా, చేయూత, సున్నావడ్డీ, జగనన్న తోడు, స్త్రీ నిధి తదితర పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు.
గత టిడిపి పరిపాలనలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా నాయకులు వారి పార్టీ వారికి మాత్రమే కొన్ని పథకాలు అందించేవారన్నారు. జగనన్న ప్రభుత్వ పాలనలో కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఇలాంటి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అంటే జగనన్నను రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డికి, దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
వాలంటీర్ల సేవలు అమోఘం
కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు చాలా విలువైనవని, ఆ సేవల ద్వారా వలంటీర్ వ్యవస్థను ప్రపంచం గుర్తించిందని ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం -2 పరిధిలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంబ శివారెడ్డి, వీరాంజ నేయులు, పైలా నరసింహయ్య హాజరయ్యారు.
వలంటీర్లు డి. కౌసల్య, డి. సువర్ణ లకు సేవా వజ్ర, కె. శాంతి, సుబ్బన్న గారి పెద్దిరాజు, ఆర్. రామనాథరెడ్డి, ఎస్. విజయ్ కుమార్, టి. రాజశేఖర్ లకు సేవా రత్న, మిగిలిన 197 మంది వలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలను అందజేసి, శాలువాతో సత్కరించారు.
వారు మాట్లాడుతూ..వలంటీర్ల సేవలు అనిర్వచనీయమన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి రానున్న ఎన్నికలలో వైయస్సార్సీపీ గెలుపునకు సోపానాలన్నారు. జగనన్న చేసిన మేలుని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి, ముఖ్యమంత్రి జగనన్న గెలుపునకు వలంటీర్లు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Feb 27 2024, 10:48