ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో సిబ్బంది వీడ్కోల సభ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో సిబ్బంది వీడ్కోల సభనిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వైద్యాధికారులు డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, డాక్టర్ తహీరున్నిసా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దండువారిపల్లి హెల్త్ వెల్నెస్ సెంటర్ నందు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ గా పనిచేయుచున్న కుమారి భవాని గారు , స్టాఫ్ నర్స్ ఉద్యోగం కర్నూలు జిల్లాలో వచ్చిన సందర్భముగా ప్రస్తుతం పని చేయుచున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిన సందర్భంగా సిబ్బంది ఈరోజు వీడ్కోల సభ ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది, అలాగే ప్రతి శుక్రవారం రోజు గర్భవతులకు అన్నదానం చేయుచున్న చిప్పల చంద్రశేఖర్ , అనిత దంపతులను కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఆర్డిటిలో పనిచేయుచున్న చిరు ఉద్యోగి అయినా చంద్రశేఖర్ గారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి శుక్రవారం రోజు 70 నుంచి 100 మంది గర్భవతులకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయుచున్నారు వారిని కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు, పి హెచ్ ఎన్ చెన్నమ్మ గారు, ఫార్మసిస్ట్ మహబూబ్ బాషా, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్ లో ధనుంజయ, నాగరాజు శివ నంద, ఆనంద, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ యామిని జ్యోతి, జయంతి, ధనలక్ష్మి, మంజు భార్గవి, మణి ,శ్రీ కీర్తి, గౌతమి, శ్రీజ, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి, బుజ్జమ్మ ,ఆదిలక్ష్మి, నాగేంద్రమ్మ, లక్ష్మీదేవి, అటెండర్ శివరాజ్, హోమియోపతి అటెండర్ కిషోర్ కుమార్, ఎఫ్ ఎన్ ఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

పెద్దమ్మ స్వామి గుడి నిర్మాణం కోసం దుర్గం గ్రామస్తులైన కురుబ గురు ప్రసాద్ 30 వేల రూపాయల విరాళం

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గొల్లపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నందు పెద్దమ్మ స్వామి గుడి నిర్మాణం కోసం దుర్గం గ్రామస్తులైన కురుబ గురు ప్రసాద్ 30 వేల రూపాయల విరాళం సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు కలసి గొల్లపల్లి గ్రామస్తులకు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ దొడ్డి పెద్దన్న మసాల కాటమయ్య పెద్ద గంగన్న రామకృష్ణ పాల్గోన్నారు. కాలనివాసులు చేసిన సహయానికి కృతజ్ఞతలు తెలిపారు

నార్పల కలను సాకారం చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. జగనన్న అండతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి, హామీని నెరవేర్చని గత పాలకులు.. ఎమ్మెల్యే

రూ.2.50 కోట్ల వ్యయంతో కూతలేరు బ్రిడ్జిను ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

◆ పాల్గొన్న శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయ కర్త ఎం. వీరాంజనేయులు..

గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు చేయని పనిని చేసి చూపించి నార్పల మండల ప్రజల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

నార్పల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూతలేరు బ్రిడ్జ్ ను ఆమె ప్రారంభించారు.

గత పాలకులు కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాజీ లయ్యారన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్మావతి నార్పల మండల ప్రజలకు కూతలేరు బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నేడు నెరవేర్చారు. మాట తప్పని మడమ తిప్పని సీఎం జగనన్న ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నార్పల మండల ప్రజలకు ఇచ్చిన హామీనీ నేడు సగర్వంగా నెరవేర్చుకున్నారు. 

నాడు కాంగ్రెస్ పార్టీ, నిన్న తెలుగుదేశం పార్టీ కూతలేరు బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీనే నెరవేర్చకుండా కాలయాపన చేసి వెళ్లిపోయారు. ఇచ్చిన హామీనే తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత పద్మావతికే దక్కుతుంది.

ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికలకు ముందు కూతలేరు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పిన విధంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామన్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం వాటిని లెక్కచేయకుండా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి మాట ఇస్తే తప్పని ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని రుజువు చేశామన్నారు.

శింగనమల చెరువు లోకలైజేషన్, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జగనన్న పాలనలో చేసి చూపించామన్నారు. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు నుంచి అభివృద్ధి వరకు కార్యక్రమాలు ఎక్కడా నిలపకుండా పూర్తి చేశామన్నారు. ప్రజలందరూ జగనన్న వెంట ఉన్నారని తెలియడానికి 'సిద్ధం సభ' కు వచ్చిన ప్రజలే నిదర్శనమన్నారు.

రాబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేస్తే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ప్రజలకు దగ్గరగా ఉంటామన్నారు.

కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలో పాలించిన నాయకులు ఎవరూ నెరవేర్చని కూతలేరు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి నార్పల ప్రజల కష్టాలను, మరియు ఈ బ్రిడ్జి పై అనేక గ్రామాలకు వెళ్ళటాని సులువుగా చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పరవశించిన భక్తజనం.. కొండమీదరాయుని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సుప్రసిద్ధమైన కొండమీదరాయుని రథోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కొండమీదరాయునికి శ్రీదేవి, భూదేవితో కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. సూర్యప్రభ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో ఉరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథం ముందు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పూజా కార్యక్రమంలో జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల వైస్సార్సీపీ సమన్యయకర్త ఎం. వీరాంజనేయులు,పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్యయకర్త ఎం. శంకర్ నారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మధ్యాహ్నం రథోత్సవం ప్రారంభమైంది. భక్తులు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నుంచి పాత పంచాయతీ కార్యాలయం వరకు లాగారు. తిరిగి సాయంత్రం బ్రాహ్మణ వీధి, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. ఈ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో గ్రామ పురవీధులు నిండిపోయాయి. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. దేవరకొండ పైకి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో భక్తజనం పులకించి పోయింది.

సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయం.. శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయం.. శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

గ్రామాల అభివృద్ధితోపాటు సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎం.వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండల పరిధిలోని శివపురం, సి.బండమీదపల్లి, పోతురాజు కాలువ గ్రామాలలో ఆయన పర్యటించారు.

గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని పలకరిస్తూ, ముఖ్యమంత్రి జగనన్న దీవెనలతో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని మీ అందరి దీవెనలతో గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధి గత టిడిపి పాలన కంటే మెరుగుగా సాగుతుందన్నారు. సంక్షేమ పాలనను చూసి ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తూ ప్రజలని మోసం చేస్తున్నారన్నారు. గ్రామాల్లో ప్రజలు జగనన్న సంక్షేమ పాలనతో చాలా సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికలలో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతూ మోసపూరిత హామీలతో ప్రజలని మోసం చేస్తున్నారని అలాంటి మాయమాటలు నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితుల్లో లేరన్నారు. జగనన్న పాలన మరోసారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మహిళల ఆర్థిక పరిపుష్టికి 'ఆసరా.. 'రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,.పెనుకొండ ఎమ్మెల్యే సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

మహిళల ఆర్థిక పరిపుష్టికి 'ఆసరా.. 'రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,.పెనుకొండ ఎమ్మెల్యే

సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

◆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న

● శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

● పాల్గొన్న పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ మరియు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య.

వైయస్సార్ ఆసరా పథకం మహిళల ఆర్థిక పరిపుష్టికి ఆసరాగా నిలుస్తోందని సాంబ శివారెడ్డి, ఎం.వీరాంజనేయులు అన్నారు.

యల్లనూరు మండల కేంద్ర పరిధిలోని గ్రామ సచివాలయం-2 దగ్గర ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు, శంకర్ నారాయణ, పైలా నరసింహయ్య పాల్గొన్నారు.

మండలంలో ఆసరా ద్వారా రూ.5.99 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 588 సంఘాలకు దాదాపు రూ.23.96 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేకూర్చారు. మరియు ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 706 సంఘాలకు దాదాపు రూ.43.33 కోట్ల రూపాయలు వైయస్సార్ సున్నా వడ్డీ క్రింద లబ్దిని చేకూర్చారు. 

588 స్వయం సహాయక సంఘాల సభ్యులు, 5,880 మందికి నాలుగో విడతగా దాదాపు రూ.5.99 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు.

వారు మాట్లాడుతూ.. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ ప్రకృతి కూడా తోడుగా ఉండి రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు.గత ఎన్నికల సమయంలో టీడీపీ పొదుపు మహిళలను పసుపు కుంకుమ పథకం పేరుతో మోసం చేసిందన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మహిళల బాధలు తెలుసుకుని వారి కష్టాలను తీర్చేందుకు రుణాలను మాఫీ చేయడం పాటు వారికి ఆసరా, చేయూత, సున్నావడ్డీ, జగనన్న తోడు, స్త్రీ నిధి తదితర పథకాలు అమలు చేసి వారికి అండగా‌ నిలిచారన్నారు.

గత టిడిపి పరిపాలనలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా నాయకులు వారి పార్టీ వారికి మాత్రమే కొన్ని పథకాలు అందించేవారన్నారు. జగనన్న ప్రభుత్వ పాలనలో కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఇలాంటి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అంటే జగనన్నను రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డికి, దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.

వాలంటీర్ల సేవలు అమోఘం

కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు చాలా విలువైనవని, ఆ సేవల ద్వారా వలంటీర్ వ్యవస్థను ప్రపంచం గుర్తించిందని ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.

మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం -2 పరిధిలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంబ శివారెడ్డి, వీరాంజ నేయులు, పైలా నరసింహయ్య హాజరయ్యారు.

వలంటీర్లు డి. కౌసల్య, డి. సువర్ణ లకు సేవా వజ్ర, కె. శాంతి, సుబ్బన్న గారి పెద్దిరాజు, ఆర్. రామనాథరెడ్డి, ఎస్. విజయ్ కుమార్, టి. రాజశేఖర్ లకు సేవా రత్న, మిగిలిన 197 మంది వలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలను అందజేసి, శాలువాతో సత్కరించారు.

వారు మాట్లాడుతూ..వలంటీర్ల సేవలు అనిర్వచనీయమన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి రానున్న ఎన్నికలలో వైయస్సార్సీపీ గెలుపునకు సోపానాలన్నారు. జగనన్న చేసిన మేలుని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి, ముఖ్యమంత్రి జగనన్న గెలుపునకు వలంటీర్లు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన వై. యస్.ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మండలంలో ఆసరా ద్వారా 9.42కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 1,044 సంఘాలకు దాదాపు రూ. 37.67 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేకూర్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో, ప్రతిపక్షాలు గెలవడానికి సాధ్యం కాని హామీలు ఇస్తూ మోసం చేయటానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోకండి అన్నారు. ఇంటి దగ్గరికి అందిస్తున్న సంక్షేమ పాలన మళ్లీ కావాలి అంటే జగనన్నకు ఓటు వేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అమలు పరిచిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ అందిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత మేలు జరుగుతుందన్నారు.

వలంటీర్లు...సంక్షేమ సారథులు

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరువచేస్తున్న వలంటీర్లు సంక్షేమ సారథులని, వారి సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ సాంబశివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.

మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర వలంటీర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వాలంటీర్ ఎం.అనిక్ కుమార్ సేవా వజ్ర, ఐదు మంది వాలంటీర్లకు సేవారత్న, 292 మంది వాలంటీర్లకు సేవా మిత్రా పురస్కారాలను అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరుసగా నాలుగవ ఏడాది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సిఊపి ప్రభుత్వం అందిస్తున్న సేవ పురస్కారాలు వాలంటీర్ల అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత చక్కగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు,తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి పేట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన అరటి తోటను సందర్శించిన మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేట గ్రామం నందు పాలమూరు వెంకటగిరి అనే రైతు యొక్క నాలుగు ఎకరముల అరటి తోట అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంగా విషయం తెలుసుకున్న మండల ఇంచార్జ్ ఆలూరు రమణారెడ్డి అరటితోటి సందర్శించి రైతు వెంకటగిరిని పరామర్శించారు వెంటనే సంబంధిత అధికారులకు మొబైల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి సమాచారం తెలియజేసి వెంటనే మనం వెంకటగిరి రైతును ఆదుకోవా లని అధికారులకు సూచించారు అంతేకాదు మీ కుటుంబానికి మా ఆలూరు కుటుంబం మరియు పార్టీ అండదండగా ఉంటామని రైతుకు భరోసా ఇచ్చారు చివరిగా గ్రామంలో ఉన్న తాగునీటి ట్యాంకును మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల జడ్పిటిసి చెదుళ్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిపేట రవి రెడ్డి ఆలూరు సుబ్బరాయుడు జెసిఎస్ మండల కన్వీనర్ మండల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు జంతలూరు రామ్మోహన్ రెడ్డి అమ్మవారిపేట గ్రామ వైసిపి నాయకులు దేవరకొండ రామాంజనేయులు దేవరకొండ సుబ్బరాయుడు ఫీల్డ్ అసిస్టెంట్ దేవరకొండ సుబ్బన్న వాలంటీర్లు దేవరకొండ శ్రీకాంత్ సాకే ఈశ్వరయ్య సాకే విజయ్ కుమార్ కుల్లాయప్ప దాదిలూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.

గ్రామాల ఆభివృద్ధికి ప్రభుత్వం కృషి..రూ.60.00 లక్షలతో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన 

◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి

◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కల్లూరులో  తరిమెల రోడ్డు డ్రైనేజ్ పనులను సాంబశివారెడ్డి, ఎం. వీరాంజనేయులు ప్రారంభించారు.

సంజీవరెడ్డి విగ్రహం దగ్గర నుంచి తరిమెల రోడ్డు బైపాస్ వరకు గ్రామ సచివాలయాలు 1-2-3 పరిధిలోని జి. జి.ఎంపీ నిధుల ద్వారా దాదాపు రూ 60.00 లక్షలతో 700 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణం చేపట్టనున్నారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగుతోందన్నారు. గత టీడీపీ పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ లేక వర్షాలు వచ్చిన ప్రతిసారీ ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి ప్రజలు సమస్యని తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యకి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారన్నారు. సీఎం జగనన్న చేస్తున్న అభివృద్ధి మరింత మెరుగుపడాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.. వైసీపీ శ్రేణులు..

పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి 

సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ, వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర ఉన్న వై . యల్. ఆర్. ఫంక్షన్ హాల్ నందు వై. యస్. ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాంబశివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, శంకర్ నారాయణ,బోయ గిరిజమ్మ, పైలా నరసింహయ్య పాల్గొన్నారు.

మండలంలో ఆసరా ద్వారా 7.65 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 929 సంఘాలకు దాదాపు రూ.30.61 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేరుర్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మేలును మహిళలు బేరీజు వేసుకోవాలన్నారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజల పక్షాన నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త ఎం.వీరాంజనేయులును ముఖ్యమంత్రి వైస్ జగనన్న గుర్తించి సమన్వయకర్తగా నియమించారని మీ ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళలకు బాసటగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు.

వలంటీర్లతోనే సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు

వలంటీర్ల వల్లే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయని సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.

మండల పరిధిలో ఉన్న వై.యల్. ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

వలంటీర్ కె. వన్నూరప్ప (బూదేడు) సేవా వజ్ర, సి. రామాంజనేయులు(గార్లదిన్నె-2 ) కె. మధుబాబు(కల్లూరు-3), కె. అనూరాధ (కమలాపురం), యస్. రిజ్వానా బేగం(మార్తాడు), వై. శివ(సిరివరం) లకు సేవా రత్న, 324 మందికి సేవా మిత్ర పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో వలంటీర్ల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి దగ్గరకు అందించిన విషయం గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల హను నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.