బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా కొప్పుల యాదిరెడ్డి నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ...గతంలో వర్కట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా, యువమోర్చా మండల అధ్యక్షునిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ గా, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వహించడం జరిగిందని ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా నియమించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కి నా నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలతో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి అందుకున్న కొలనుపాక విద్యార్థులు


తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పెల్ విజార్డ్, డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు డ్రామా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని జోడిమెట్ల అనురాగ్ యునివర్సిటీ లో

 జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు కుమారి రక్షిత, కుమారి దీపిక, కుమారి రుచిత, కుమారి సాహితీ, మరియు కుమారి శ్రావణి లు డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య , పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, మరియు ఇతర ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయిలో బహుమతిని పొందిన పాఠశాల విద్యార్థులను ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అభినందించారు.

ఈనెల 28న వరంగల్ లో జరిగే ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి


అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న వరంగల్, LB కళాశాల జయసేన ఆడిటోరియంలో వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా నినాదంతో ఏ ఐ వై ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా "దేశ పాలకుల విధానాలు - నేటి యువత కర్తవ్యం" అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు

ఆత్మకూరు మండల కేంద్రంలోని కరపత్రం,గోడపత్రిక ఆవిష్కరణ ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ 8 దశాబ్దాల స్వాతంత్య్రంలో కేంద్ర ప్రభుత్వం యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయన్నారు. దేశంలో 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్లు లెక్కలు చెబుతున్నాయని, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదన్నారు. డిగ్రీలు, పి.జి.లు, పిహెచ్.డి.లు, బి.టెక్, ఎం.టెక్, ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు,పోలీస్ కానిస్టేబుల్, హెూమ్ గార్డ్ ఉద్యోగాలకు లక్షల్లో పోటీపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్యోగాలులేక, ఉపాధి అవకాశాలులేక వలసలు పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్థులుగా, ఉగ్రవాదులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని, తద్వారా రాజకీయాలపట్ల విముఖత కలిగేటట్లు యువతను తయారుచేస్తూ సంఘవిద్రోహ శక్తులు, అవినీతిపరులు, దోపిడీదారులు రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని, ప్రజలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశ భవిష్యత్తును నవయవ్వనంతో తొణికిసలాడే యువత సరికొత్త భారతాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని ఏ ఐ వై ఎఫ్ ఈ సదస్సు ద్వారా పిలుపునివ్వబోతున్నదని వారు స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వ కాషాయీకరణను జతచేసి వీటిని వేగంగా అమలుచేయుటకు కేంద్ర ప్రభుత్వం "జాతీయ విద్యా విధానం - 2020” ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని, విద్యార్థుల మెదళ్ళను మొద్దుబార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి చొప్పించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని,అందుకే పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజకీయ పార్టీల పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని, విభజించు పాలించు అనే నినాదంతో పబ్బం గడపాలనే మోడీ దుష్ట నీచ రాజకీయాలకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మారుపాక వెంకటేష్, సలగంజి వీరస్వామి,కూరెళ్ళ మచ్చ గిరి, మారుపాక మల్లేష్, సోమనబోయిన నరసింహ, బుర్ర వెంకటేష్, మారుపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో లారీ ఢీకొని వెలువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తున్న వ్యక్తిని లోడ్ తో వెళుతున్న లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన మంత్రి స్వామిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లాలో వయోజన విద్యాశాఖ లోని మాజీ సాక్షర భారత్ మండల, గ్రామ కో-ఆర్డినేటర్లను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ వలిగొండ మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప మాట్లాడుతూ.. సాక్షర భారత్ కార్యక్రమాలలో పనిచేసిన గ్రామ ,మండల కోఆర్డినేటర్లు పూర్తిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులుగా 2010 నుండి 2018 మార్చి 31 వరకు అనగా తొమ్మిది సంవత్సరాలు అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ,అన్ని రకాల ప్రభుత్వ, సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వానికి సేవలు అందించామని అన్నారు. ప్రభుత్వం తిరిగి సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ .భాగ్యలక్ష్మి, ఏం మాధవి ,జి మానస , పీ లత ,కే లూర్దమ్మ,సిహెచ్ జ్యోతి, ఆర్ అనిత , జ్ సువర్ణ ,కే చైతన్య ,ఎం ధనమ్మ ఎం అనిత ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్. శ్రీ సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భువనగిరి వివేరా హోటల్ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి ఎన్ ఎస్ యు ఐ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు ,మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

గోకారంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా... ప్రత్యేక దాడులు నిర్వహించి పట్టుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో శుక్రవారం రాత్రి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ ఆకస్మికంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గోకారం గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంప్ లను మరియు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేశామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు. మండలంలో మూసి పరివాహక ప్రాంతం గోకారం, నాగారం ,వేములకొండ గ్రామాలలో పలుసార్లు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను పట్టుకుని, సీజ్ చేసిన కూడా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రములోని

అనాజిపురం గ్రామ శివారులోని దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ కాట రాజులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, గురువులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ కాట చిన్నప్ప మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి జీవితానికి తొలి మెట్టు లాంటిదని దానిని నిర్లక్ష్యం చేయకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రభాకర్, జ్యోతి, శ్రీనివాస్, నరేష్, కుమార్ , సుందరి, మోక్ష, మరియదాస్, రమాదేవి, సంధ్యారాణి, అనిత పీఈటీలు రాము , మహేశ్వరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది.

శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం వారి సీల్డ్ టెండర్ల ప్రకటన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో తేదీ 28. 2. 00024 నుండి 01.03. 2024 శుక్రవారం మధ్యాహ్నం 11.50 నిమిషంలోపు ఈ టెండర్లు వేయాలి. ఇట్టి టెండర్ల బాక్స్ మధ్యాహ్నం 12 గంటలకు సీల్ చేయబడుతుంది. తదుపరి మధ్యాహ్నం ఒకటి 01.30 నిమిషాలకు దేవస్థానం ఈవో గ్రామ పెద్దల సమక్షంలో ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నది. కావున భక్తులు టెండర్దారులు దేవస్థానం వారికి కావాల్సిన సామాగ్రి కొరకు షీల్డ్ టెండర్లు వేయగలరని కోరడం జరిగినది.

ఈ షీల్డ్ టెండర్లను శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుమీద చెల్లుబాటు ఉండేలా ఈ షీల్డ్ టెండర్ లో పాల్గొనే టెండర్దారులు 10000/- లో రూపాయలు ధరావత్తుతో డిడి రూపంలో గానీ నగదు రూపంలో గానీ చెల్లుబాటు అయ్యేవిధంగా షీల్డ్ టెండర్లులో పాల్గొనాలని టెండర్ షెడ్యూల్ ధర 2000/- రూపాయలుగా ఉంటుందని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇవో మోహన్ బాబు కోరారు. ఈ టెండర్ల కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తేది.01.04. 2024 నుండి తేది.31.03 2025 వరకు ఈ టెండర్ల కాల పరిమితి ఉంటుందని ఆయన అన్నారు. టెండర్ల లో కావలసిన సామాగ్రి వివరములు 1. పులిహోర కవర్స్ లడ్డు కవర్స్ కోసం టెండర్ 2. కరెంటు సామాగ్రి సరఫరా 3. బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ సున్నం యాసిడ్ కొబ్బరి పొరకలు తదితర సామాను 4. పండుగలకు బ్రహ్మోత్సవాలకు పూలు పూలదండలు పండ్లు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ అలంకరణ కోసం పూలు వేయటం కొరకు. ఈ టెండర్ వేయడానికి ధరావత్ రూపాయలు 10000/- డిడి రూపంలో నగదు రూపంలో గానీ యూనియన్ బ్యాంక్ వేముల కొండ మరియు కెనరా బ్యాంక్ అరుర్ లలో దేవాదాయ కమిషన్ పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీలు తీసి టెండర్లో పాల్గొనాలని దేవస్థానం‌ ఇవో సెల్వాద్రి మోహన్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది దేవాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అరూరు గ్రామంలో కిడ్నాప్ మరియు పోస్కో కేసు నమోదు ..వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కిడ్నాప్ మరియు పోస్కో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండారి రాజు తండ్రి యాదగిరి వయసు 33 సంవత్సరాలు , అరూరు గ్రామంలో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడు ఎర్ర గొల్లపాడు గ్రామం జనగాం మండల్ మరియు జనగాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు . ఇతన్ని అరెస్టు చేసి క జ్యూడిషల్ రిమాండ్ కొరకు కోర్టు ముందు  హాజరు పరిచినట్లు వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.