అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన వై. యస్.ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మండలంలో ఆసరా ద్వారా 9.42కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 1,044 సంఘాలకు దాదాపు రూ. 37.67 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేకూర్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో, ప్రతిపక్షాలు గెలవడానికి సాధ్యం కాని హామీలు ఇస్తూ మోసం చేయటానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోకండి అన్నారు. ఇంటి దగ్గరికి అందిస్తున్న సంక్షేమ పాలన మళ్లీ కావాలి అంటే జగనన్నకు ఓటు వేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అమలు పరిచిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ అందిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత మేలు జరుగుతుందన్నారు.
వలంటీర్లు...సంక్షేమ సారథులు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరువచేస్తున్న వలంటీర్లు సంక్షేమ సారథులని, వారి సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ సాంబశివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.
మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర వలంటీర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వాలంటీర్ ఎం.అనిక్ కుమార్ సేవా వజ్ర, ఐదు మంది వాలంటీర్లకు సేవారత్న, 292 మంది వాలంటీర్లకు సేవా మిత్రా పురస్కారాలను అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరుసగా నాలుగవ ఏడాది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సిఊపి ప్రభుత్వం అందిస్తున్న సేవ పురస్కారాలు వాలంటీర్ల అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత చక్కగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు,తదితరులు పాల్గొన్నారు.
Feb 24 2024, 08:35