పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.. వైసీపీ శ్రేణులు..
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి
సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ, వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర ఉన్న వై . యల్. ఆర్. ఫంక్షన్ హాల్ నందు వై. యస్. ఆర్. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాంబశివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, శంకర్ నారాయణ,బోయ గిరిజమ్మ, పైలా నరసింహయ్య పాల్గొన్నారు.
మండలంలో ఆసరా ద్వారా 7.65 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 929 సంఘాలకు దాదాపు రూ.30.61 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద లబ్దిని చేరుర్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మేలును మహిళలు బేరీజు వేసుకోవాలన్నారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజల పక్షాన నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త ఎం.వీరాంజనేయులును ముఖ్యమంత్రి వైస్ జగనన్న గుర్తించి సమన్వయకర్తగా నియమించారని మీ ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మహిళలకు బాసటగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు.
వలంటీర్లతోనే సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు
వలంటీర్ల వల్లే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయని సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.
మండల పరిధిలో ఉన్న వై.యల్. ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
వలంటీర్ కె. వన్నూరప్ప (బూదేడు) సేవా వజ్ర, సి. రామాంజనేయులు(గార్లదిన్నె-2 ) కె. మధుబాబు(కల్లూరు-3), కె. అనూరాధ (కమలాపురం), యస్. రిజ్వానా బేగం(మార్తాడు), వై. శివ(సిరివరం) లకు సేవా రత్న, 324 మందికి సేవా మిత్ర పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో వలంటీర్ల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి దగ్గరకు అందించిన విషయం గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల హను నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Feb 23 2024, 07:53