దుప్పల్లి గ్రామానికి చెందిన వల్లపు రామలింగయ్య మిస్సింగ్... దర్యాప్తు చేపట్టిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దుప్పల్లి గ్రామానికి చెందిన వల్లపు రామలింగయ్య భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తేదీ 19 ఫిబ్రవరి 2024 సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి రామలింగయ్య భార్య లింగమ్మ మేకలను మేపడానికి వెళ్లి తిరిగి రాత్రి 7:00 ఇంటికి వచ్చేసరికి తన భర్త రామలింగయ్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఆచూకీ లభించకపోవడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకి స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భార్య లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు.

గోకారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం... దర్యాప్తు చేపట్టిన పోలీసులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన ఏరువా రామచంద్రయ్య తండ్రి స్వామి తన భార్య సుశీలతో తేదీ 17-02- 2024 రోజున మేడారం జాతరకు వెళ్లారు. తిరిగి తేదీ 21-02- 224 సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి చేరుకొని చూడగా ఇంటి తలుపులు తెరుచుకొని గుర్తుతెలియనీ వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బెడ్ రూమ్, బీరువా తెరిచి , బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారం మరియు వెండి పట్టగొలుసులు దొంగలు ఎత్తుకెళ్లారని స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు.

వలిగొండలో దాసిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహించిన పోలీసులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దాసిరెడ్డిగూడెం క్రాస్ రోడ్ లో వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు నెంబర్ ప్లేటు సరిగా లేని వాహనాలను గుర్తించి చలానా విధించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ లను, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ లాల్ మాట్లాడుతూ ..వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాల తో ప్రయాణించాలని అన్నారు ,లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు

కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బుధవారం రోజున రైతు వేదిక భవనంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసిన మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ....కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా మంజూరైన 46 కళ్యాణ లక్ద్మీ,శాదిముభారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్,జెడ్పిటిసి వాకిటి పద్మా ఆనంతరెడ్డి,వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాలనర్సింహ,ఎంపిటిసిలు కుందారపు యశోద కొమురయ్య,పల్లెర్ల భాగ్యమ్మ రాజు,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రసూల్ నాయకులు తుమ్మల యుగేందర్ రెడ్డి,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ,బద్దం సంజీవరెడ్డి,కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, ఈతాప రాములు వెలిమినేటి సత్యనారాయణ,పులిపలుపుల రాములు,ఏర్పుల వెంకటేశం,కొండూరు సాయి, మైసొల్ల ప్రవీణ్ ఎంపిడిఓ జితేందర్ రెడ్డి,తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీతాసిల్దార్, ఆర్ ఐ మనోహర్ వివిధ గ్రామాల ఎంపిటిసిలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

కళాశాల భవన నిర్మాణానికి తీన్మార్ మల్లన్న విరాళం


 భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అదనపు భవన నిర్మాణానికి కళాశాల పూర్వ విద్యార్థి, సీనియర్ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తనవంతు భాద్యతగా రెండు లక్షల పదహారు వేల రూపాయల(రూ 2,16,000) విరాళం చెక్ రూపంలో అందించారు. బుధవారం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా తీన్మార్ మల్లన్న తన భార్య మమత తో పాటు కళాశాలను సందర్శించి, కళాశాల పూర్వ విద్యార్ధుల విరాళాలతో నూతనంగా నిర్మాణం చేస్తున్న పీజీ బ్లాక్ భవనానికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ అధ్యాపకులు తీన్మార్ మల్లన్న ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి బుచ్చయ్య , వైస్ ప్రిన్సిపాల్ గాజుల రమేష్, కళాశాల పూర్వ విద్యార్ధులు కడారు నర్సిరెడ్డి, కొడిమాల కృష్ణ, అయిలయ్య ,బాల్ రెడ్డి, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.

కీర్తిశేషులు తుమ్మల నర్సయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


వలిగొండ మండలం అరూరు గ్రామానికి చెందిన మహ్మద్ ఖలీల్ గుండెపోటుతో మరణించినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 12 వేల ఆర్థిక సహాయం అందించిన, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య గారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాస్ తుమ్మల సంతోష్ తుమ్మల మధుసూదన్ మురళి

సేవా సమితి తరపున కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కసర బోయిన లింగయ్య యాదవ్ ,మాజీ మచ్చ గిరి గుట్ట ధర్మకర్త సేవా సమితి అధ్యక్షులు పిట్టల సుధాకర్, సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ చెమ్మ య్య, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, ఆవుల సత్యనారాయణ, గ్రామపంచాయతీ మాజీ సభ్యులు ఓ బి సి మండల అధ్యక్షులు కనకాచారి, ఆవుల అంజయ్య, స్కూల్ చైర్మన్ బండారు మహిపాల్ రెడ్డి ,గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కసర బోయిన నరసింహ యువజన కాంగ్రెస్ మండల నాయకులు ఎలిమినేటి సంతోష్, కోయగూర మధు, బత్తిని వెంకటేష్ ,ఖదీర్, కొణితాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో అర్హత సాధించిన మోడల్ స్కూల్ అండ్ కళాశాల విద్యార్థిని భవ్య శ్రీ అభినందించిన ప్రిన్సిపల్ రాము ,అధ్యాపక బృందం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట లోని మోడల్ స్కూల్ ,కళాశాల విద్యార్థిని పల్సం భవ్య శ్రీ జేఈఈ 2024 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి రాము భవ్యశ్రీ ని అభినందించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గత సంవత్సరం కూడా ఎన్నో ఎంసెట్ ఎంబిబిఎస్ ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు .ఈ విధంగా ప్రతి పోటీ పరీక్షలతో పాటు, ఎన్ ఎంఎంఎస్ లో కూడా.. విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. స్కూల్, కళాశాల అధ్యాపక బృందం రోజువారి తరగతుల తోపాటు కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మోటివేషన్ గైడ్స్గా ఉండటంతో పాటు, విశాలమైన లైబ్రరీ ,డిజిటల్ తరగతుల నిర్వహణ ,వారి విజయానికి కారణమయ్యాయని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిని భవ్య శ్రీ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా , ఆనందంగా ఉందన్నారు. నా ప్రిపరేషన్ కు ,లైబ్రరీ బుక్స్ తో పాటు అనుభవం గల అధ్యాపకులు బోధించి, కాంపిటేషన్ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించడానికి సఫలీకృతం చేశారని, ఈ సందర్భంగా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అభినందించిన వారిలో కే రమేష్ ,అనసూయ ,ప్రవీణ్, పూర్ణిమ, సుష్మిత కనకదుర్గ, పృథ్వీరాజ్, రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు

భాష నైపుణ్యం పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన కొలనుపాక విద్యార్థులు


 ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్పెల్ విజార్డ్, ఆంగ్ల భాషా నైపుణ్య డ్రామా పోటీలు సోమవారం నల్లగొండలో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య తెలిపారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పెల్ విజార్డ్, డ్రామా పోటీలు నిర్వహించగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వి. రక్షిత, ఎన్. దీపిక, ఎన్. రుచిత, డి. సాహితి మరియు టి. శ్రావణి లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రామా పోటీల్లో మొదటి బహుమతిని అందుకున్నారు. ఈనెల 25 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, ఎస్ ఎం సి చైర్మన్ రాజబోయిన కొండల్, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, కొలనుపాక, మరియు పరిసర గ్రామాల తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

పిల్లల మార్పు కేవలం ఉపాధ్యాయులు తోనే జరుగుతుంది: వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ లాల్ తల్లిదండ్రులకు చేసుకుంటున్న విన్నపము ఏమనగా..

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.

ఇది నిజం.

గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?

కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు

5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.

దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,

పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. 

భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. 

ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!

అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.

ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.

 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. 

ఇది యదార్ధం. 

ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

    

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.

అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. 

మా బాగు కోసమే అని అనుకునేవారు.

     

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!

సాహితీవెత్తల కృషి ప్రశంసనీయం :నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహీతీవేత్త కూరెళ్ల విఠలాచార్య ఏర్పాటు చేసిన గ్రంథాలయం నూతన భవనం ని ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...

కూరెళ్ల విఠలాచార్య గారు వృద్ధాప్యంలో సాహిత్య రంగంతో పాటు ,సామాజిక రంగానికి సేవ చేయటం గర్వించదగ్గ విషయమన్నారు.

అక్షర జ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో సోంత ఇంటినే, గ్రంథాలయం గా మార్చడం ప్రశంసనీయం అన్నారు.

దేశ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీ లభించడం చాలా అభినందనీయం అని అన్నారు.