వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.
గ్రామాల ఆభివృద్ధికి ప్రభుత్వం కృషి..రూ.60.00 లక్షలతో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన
◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి
◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరులో తరిమెల రోడ్డు డ్రైనేజ్ పనులను సాంబశివారెడ్డి, ఎం. వీరాంజనేయులు ప్రారంభించారు.
సంజీవరెడ్డి విగ్రహం దగ్గర నుంచి తరిమెల రోడ్డు బైపాస్ వరకు గ్రామ సచివాలయాలు 1-2-3 పరిధిలోని జి. జి.ఎంపీ నిధుల ద్వారా దాదాపు రూ 60.00 లక్షలతో 700 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణం చేపట్టనున్నారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగుతోందన్నారు. గత టీడీపీ పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ లేక వర్షాలు వచ్చిన ప్రతిసారీ ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి ప్రజలు సమస్యని తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యకి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారన్నారు. సీఎం జగనన్న చేస్తున్న అభివృద్ధి మరింత మెరుగుపడాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల అధికారులు, సంబంధిత శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Feb 22 2024, 09:10