మహిళల అభ్యున్నతికి జగనన్న కృషి.. ప్రభుత్వ విద్యా సలహా దారులు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ
మహిళల అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండల కేంద్రంలోని సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు " వై. యస్. ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ది చెక్కు పంపిణీ పండుగలా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ హాజరయ్యారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. 2019 ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ చేసారని గుర్తు చేశారు. మండలంలో ఆసరా ద్వారా 9.51 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ నుంచిఅయ్యాయన్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 1,058 సంఘాలకు దాదాపు రూ.38.14 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా క్రింద అందించినట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరాంజనేయులును జగనన్న సమన్వయకర్తగా నియమించారని, రాబోయే ఎన్నికలలో గెలిపించాలని కోరారు.
శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయం సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న హామీలన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారని చెప్పారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేశారన్నారు.
అనంతరం మహిళా సంఘాలకు చెక్కు పంపిణీ చేసి, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వలంటీర్ల సేవలు అమూల్యం
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలతో ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలు అందుతుండటమే గాకుండా అవినీతి రహిత పాలన అందించడం జరుగుతోందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, శంకర్ నారాయణ తెలిపారు.
మండల కేంద్రంలో సెవెన్ హిల్స్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.
వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం సేవా పురస్కారాల కింద వలంటీర్ జి. రాజుకు సేవా వజ్రకు రూ.
45 వేలు, 5 మందికి సేవా రత్న క్రింద రూ.25 వేలు, 272 మంది సేవా మిత్ర క్రింద రూ.10 వేలు చెప్పున ఒక్కొక్కరికి ప్రోత్సాహక బహుమతిని అందజేయడంతో పాటు వాలంటీర్లకు బ్యాడ్జ్ అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలంటీర్ల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు సేవలందిస్తున్నారని, సంక్షేమ పథకాలను అర్హులైన, లబ్ధిదారుల ఇళ్ళకే చేరుస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించాలన్నారు.
జగనన్న పరిపాలనలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావటం ఎంతో సంతోషంగా ఉందని, సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేరువ చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వాలంటీర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, మహిళా సంఘాలు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Feb 21 2024, 07:59