జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో అర్హత సాధించిన మోడల్ స్కూల్ అండ్ కళాశాల విద్యార్థిని భవ్య శ్రీ అభినందించిన ప్రిన్సిపల్ రాము ,అధ్యాపక బృందం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట లోని మోడల్ స్కూల్ ,కళాశాల విద్యార్థిని పల్సం భవ్య శ్రీ జేఈఈ 2024 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి రాము భవ్యశ్రీ ని అభినందించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గత సంవత్సరం కూడా ఎన్నో ఎంసెట్ ఎంబిబిఎస్ ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు .ఈ విధంగా ప్రతి పోటీ పరీక్షలతో పాటు, ఎన్ ఎంఎంఎస్ లో కూడా.. విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. స్కూల్, కళాశాల అధ్యాపక బృందం రోజువారి తరగతుల తోపాటు కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మోటివేషన్ గైడ్స్గా ఉండటంతో పాటు, విశాలమైన లైబ్రరీ ,డిజిటల్ తరగతుల నిర్వహణ ,వారి విజయానికి కారణమయ్యాయని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిని భవ్య శ్రీ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా , ఆనందంగా ఉందన్నారు. నా ప్రిపరేషన్ కు ,లైబ్రరీ బుక్స్ తో పాటు అనుభవం గల అధ్యాపకులు బోధించి, కాంపిటేషన్ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించడానికి సఫలీకృతం చేశారని, ఈ సందర్భంగా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అభినందించిన వారిలో కే రమేష్ ,అనసూయ ,ప్రవీణ్, పూర్ణిమ, సుష్మిత కనకదుర్గ, పృథ్వీరాజ్, రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు

భాష నైపుణ్యం పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన కొలనుపాక విద్యార్థులు


 ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్పెల్ విజార్డ్, ఆంగ్ల భాషా నైపుణ్య డ్రామా పోటీలు సోమవారం నల్లగొండలో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య తెలిపారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పెల్ విజార్డ్, డ్రామా పోటీలు నిర్వహించగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వి. రక్షిత, ఎన్. దీపిక, ఎన్. రుచిత, డి. సాహితి మరియు టి. శ్రావణి లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రామా పోటీల్లో మొదటి బహుమతిని అందుకున్నారు. ఈనెల 25 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, ఎస్ ఎం సి చైర్మన్ రాజబోయిన కొండల్, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, కొలనుపాక, మరియు పరిసర గ్రామాల తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

పిల్లల మార్పు కేవలం ఉపాధ్యాయులు తోనే జరుగుతుంది: వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ లాల్ తల్లిదండ్రులకు చేసుకుంటున్న విన్నపము ఏమనగా..

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.

ఇది నిజం.

గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?

కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు

5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.

దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,

పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. 

భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. 

ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!

అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.

ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.

 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. 

ఇది యదార్ధం. 

ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

    

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.

అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. 

మా బాగు కోసమే అని అనుకునేవారు.

     

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!

సాహితీవెత్తల కృషి ప్రశంసనీయం :నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహీతీవేత్త కూరెళ్ల విఠలాచార్య ఏర్పాటు చేసిన గ్రంథాలయం నూతన భవనం ని ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...

కూరెళ్ల విఠలాచార్య గారు వృద్ధాప్యంలో సాహిత్య రంగంతో పాటు ,సామాజిక రంగానికి సేవ చేయటం గర్వించదగ్గ విషయమన్నారు.

అక్షర జ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో సోంత ఇంటినే, గ్రంథాలయం గా మార్చడం ప్రశంసనీయం అన్నారు.

దేశ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీ లభించడం చాలా అభినందనీయం అని అన్నారు.

ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు బీర్ల ఐలయ్య గారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో,ప్రజా ప్రతినిధులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలని,చిన్న లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు,తెలంగాణ ప్రజలందరూ,సుఖ సంతోషాలతో ఉండాలని శివయ్యను ని కోరుకున్నారు.

మెగా డీఎస్సీ ని ప్రకటించాలి: కూచి మల్ల నాగేష్ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు


మెగా డీఎస్సీ కోసం బీఈడీ మరియు డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన 5089 పోస్టులకుగాను మరో 20 వేల పోస్టులు అదనంగా కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ప్రకటించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఊరుకో బడి అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రాతిపదికన సెకండ్ గ్రేట్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు వ్యాయామ ఉపాధ్యాయులు క్రాప్ ఆర్ట్ టీచర్లు మొదలగు అన్ని ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు.

భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


యాంకర్ పార్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సోమవారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు క్యాంప్ ఆఫీస్ కి వచ్చి తమ సమస్యలను తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్, టిపిసిసి మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల గణన విజయోత్సవ కార్యక్రమం


బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ పిలుపుమేరకు ..రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సాధన విజయోత్సవాలు భువనగిరిలో బీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ. ...

  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా 

బీసీ కులాల లెక్కలు చేపట్టాలని చేస్తున్న ఉద్యమానికి స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన పై తీర్మానం చేయడం జరిగింది, ఇది బీసీల పోరాట విజయం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గార్ల కృషితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం లభించడం ఎంతో 

హర్షనియం, అని అలాగే ఇది చారిత్రాత్మక నిర్ణయం.

కావున యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్త బీసీ సమాజం, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని... మహాత్మ జ్యోతిబాపూలే, విగ్రహం వద్ద  విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు వేతనాలు పెంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ధర్నా


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ ముందు ఏఐటియూసి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం  ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ మరియు వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి, పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ని , వర్కర్లను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయ భవనం ప్రారంభం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ రేపు సోమవారం 19న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం భవనాన్ని ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్ హనుమంతు కె జేండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం చేరుకుని డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయం భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ కు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.