జగన్ రెడ్డి సిద్ధం సభలో జర్నలిస్ట్ కృష్ణ పై దాడి బాధాకరం శోచనీయం రౌడీ మూకల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా సమావేశంలో వెల్లడి
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసిపి సిద్ధం సభలో వైసిపి మూకలు ఏ బీ ఎన్ ఫోటో గ్రాఫర్ కృష్ణ పై విచక్షణ రహితంగా దాడి చేయడము బాధాకరం సాక్షాత్తు సీఎం సమక్షంలోనే ఫోటో కవరేజ్ చేయడానికి వెళ్లిన కృష్ణా పై దాడి చేయడం అంటే రాష్ట్రంలోశాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఏబీఎన్ విలేకర్ కృష్ణ పావని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు గారు, పరిటాల సునీత గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు, ప్రభాకర్ చౌదరి గారు, పార్థసారధి గారు, రాష్ట్ర కార్యదర్శి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు,గారు, శ్రీధర్ చౌదరి గారు, తలారి ఆదినారాయణ గారు, గంజి నాగరాజు గారు,
ఈ సందర్బంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జిల్లా నాయకులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న రాప్తాడు బహిరంగ సభ లో ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫర్ పై..కొందరు వైసీపీ రౌడీ మూకలు అమానుషంగా దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. పట్టపగలు ఇంత దారుణమైన సంఘటన తన సభలో జరిగితే, ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఖండ్డిచరా ? దీని ద్వారా ఎటువంటి సంకేతం పంపదలిచారు? ఆ ఫోటోగ్రాఫర్ చేసిన నేరమేమిటో జగన్ చెప్పగలరా? రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యం గా చేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించే వారు లేరనే దురంహ కారమా?18.02.2024. రాప్తాడు నియోజకవర్గం లో నిర్వహించిన సిద్ధం సభపై అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం అయినది సిద్ధం సభ చంద్రబాబు నాయుడు గారిని ఇతర ప్రతిపక్ష నాయకులను దూషించడానికి సొంత డబ్బు కొట్టుకోవడానికి నిర్వహించారు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని దాడి ఘటన పై మీడియా మిత్రులు తెదేపా జనషేన వామపక్ష నాయకుల తో కలసి జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి జిల్లా ఎస్పీ గారిని కలిసి దాడి పై చర్చించి వైసీపీ రౌడీ మూకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది
తక్షణం ముఖ్యమంత్రి నోరువిప్పి జరిగినదానికి క్షమాపణ కోరాలి. దాడికి పాల్పడిన రౌడీ మూకల్ని చట్టప్రకారం శిక్షించాలి...
Feb 20 2024, 12:04