వాలంటీర్ల సేవలు అభినందనీయం..సచివాలయాలతోనే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆలూరు సాంబ శివారెడ్డి, బోయ గిరిజమ్మ, ఎం. వీరాంజనేయులు
సచివాలయాలతోనే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం
◆ ఆలూరు సాంబ శివారెడ్డి, బోయ గిరిజమ్మ మరియు
ఎం. వీరాంజనేయులు
రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థతో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండల పరిధిలోని ఈస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డా. వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ గోదాము భవనాలను మరియు సలకంచెర్వులో గ్రామ సచివాలయాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత ప్రారంభించారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
వాలంటీర్ల సేవలు అభినందనీయం
వాలంటీర్ల సేవలను ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు, బోయ గిరిజమ్మ అభినందించారు. ఈ కార్యక్రమానికి వీరు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
శింగనమల మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ వాలంటీర్లుగా ఎంపికైన వారికి, నగదు బహుమతి, బ్యాడ్జ్ అందజేసి శాలువాతో సత్కరించారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ సేవలను గుర్తించిన జగనన్న భవిష్యత్తులో వారికి మరింత మేలు చేకూరుస్తారని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తే జగనన్న ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్ వ్యవస్థతో ఇంటి దగ్గరికే సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. సంక్షేమ పాలన ఇంటి వద్దకు రావాలంటే మరోసారి ముఖ్యమంత్రి జగనన్నను చేసుకుందామన్నారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
వాలంటీర్ల వ్యవస్థ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మరోసారి ప్రజలని మోసం చేయడానికి ఎన్నికల సమయంలో వస్తున్న ప్రతిపక్షాలని తిప్పికొడదామని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
Feb 20 2024, 07:42