గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి,..
గ్రామానికి తీరిన దాహార్తికి రూ. 50.91 లక్షలు నిధులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు
తాగునీటి అవస్థలకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. జలజీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల కష్టాలను తీరుస్తున్నట్లు ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని వడియంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును సాంబ శివారెడ్డి మరియు ఎం. వీరాంజనేయులు ప్రారంభించారు.
ప్రజల దాహార్తి కోసం జలజీవన్ మిషన్ పథకం క్రింద దాదాపు రూ.50.91 లక్షల నిధులతో వాటర్ ట్యాంకు మరియు పైపు లైన్ నిర్మాణం చేశారు.
గ్రామంలోని అన్ని కుటుంబాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వడం స్థానిక తాగునీటి వనరుల లభ్యత, సమస్యను అధిగమించడం ప్రస్తుత్తం ఉన్న తాగునీటి పంపిణీ వ్యవస్థ నుంచి మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో గ్రామాల్లో నీటి సమస్య లేకుండా ఇంటింటికీ పైపు లైన్ ద్వారా కొళాయి అందించి నీటి సమస్య లేకుండా చేస్తున్నారన్నారని సాంబ శివారెడ్డి అన్నారు.
కిలోమీటరు దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. రోజూ అవస్థలు తప్పేవి కావు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించారు. ఇంటిముందే కొళాయి ఏర్పాటు చేయడంతో గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వచ్ఛమైన నీరు అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Feb 20 2024, 07:23