పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య.

పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కట్టంగూర్ ఎంపీపీ

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కట్టంగూర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల్ని పరిశీలించిన కట్టంగూర్ జెల్లా ముత్తిలింగయ్య, మరియు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్ రావు, ఏపీవో రామ్మోహన్.అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వేసవికాలం వస్తున్నందున పకృతి వనాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు పకృతి సంపద ఎంతో ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణకై పకృతి వనాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.పకృతి సంపద ఎంత మెరుగైతే మానవ జీవనానికి ఎంతో ఉపయోగం ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.

.

.

అక్రిడిటేషన్‌ అనేది రాయితీ కార్డు మాత్రమే* *-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు* *-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే*

అక్రిడిటేషన్‌ అనేది రాయితీ కార్డు మాత్రమే

-జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదు

-నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే

-చిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్టే

-జర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్సింది పత్రిక ఎడిటర్లు మాత్రమే "ఖాకీలు" కాదు.

-డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు:మనసాని కృష్ణారెడ్డి.

హైదరాబాద్:

ఫిబ్రవరి 17 ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియా ప్రజాస్వామ్యానికి కావలిగా ఉండటంలో తనకు మరే వ్యవస్థ సాటిరాదని పలుమార్లు నిరూపించింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా బాధ్యతలు అనేక రకాలుగా రానురాను విస్తరించాయి. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమం నుంచి పాత్రికేయ వృత్తి అనేక రంగాలుగా విస్తరించింది. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందని వారి సౌకర్యార్థం ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు మరి కొన్ని రకాల రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అక్రిడిటేషన్‌లు ప్రవేశపెట్టిందని డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి అన్నారు. రానురాను పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య ప్రతి యేడు పెరుగుతూపోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ల జారీకి అనేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అదేవిధంగా జర్నలిస్టు సంఘాల కృషితోనో లేక ఓటు బ్యాంకు రాజకీయాలతోనే రానురాను మేం అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించడంతో అక్రిడిటేషన్లకు బాగా గిరాకీ పెరిగింది. కొందరు నాన్‌ జర్నలిస్టులు కూడా డబుల్‌బెడ్‌రూంల ఆశతో అక్రిడిటేషన్లని అంగట్లో కొనుక్కుని రిపోర్టర్లుగా చెలామణీ అవుతున్నారనే ఆరోపణలున్నాయి. అంటే కేవలం బస్‌పాస్‌గా ఉన్న అక్రిడిటేషన్‌ని ఈ పాలకులే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడంతో అక్రిడిటేషన్‌ యూనివర్సిటి పట్టా కన్నా ఎక్కువగా మారింది. అంటే అక్రిడిటేషన్‌ ఉంటేనే జర్నలిస్టు లేదంటే నకిలీ అనే ప్రచారాన్ని ముమ్మరం చేయడం వెనక కుట్ర ఉంది. తమ మాట వినేవారిని, విననివారిని కూడా తమ దారికి తెచ్చుకోవడానికి అక్రిడిటేషన్‌ అనేది ఓ కంచెలా పనిచేస్తోంది. గొర్రెల మందని ఓ కంచెలో తోలినట్లుగా ఈ అక్రిడిటేషన్‌ అనే కంచెతో జర్నలిస్టులందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని అటు పాలకులు ఇటు కొందరు జర్నలిస్టు యూనియన్ల ముసుగులో ఉన్న తాబేదార్లు ఇన్నాళ్లూ చేస్తూ వచ్చారు. అయితే రానురాను డిజిటల్‌ మీడియా ప్రాధాన్యత పెరిగి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో జర్నలిజంలో పోటీ ఏర్పడిరది. ఎక్కడ తమకు ఆదరణ దక్కకుండా పోతుందనో లేక తమ మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కారణంతో అటు పాలకులు, ఇటు కొందరు సిండికేట్‌ జర్నలిస్టులు ఈ క్రమంలో డిజిటల్‌ మీడియా మీద విషం కక్కుతూ వస్తున్నారు. అయితే డిజిటల్‌ మీడియా వేదికలో కొందరు జర్నలిజం ముసుగేసుకున్న వ్యక్తులు జర్నలిజం కట్టుబాట్లను, విలువలను తుంగలో తొక్కి విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తులు, పార్టీల నేతలపై నిత్యం సామాజిక మాధ్యమాల వాడకూడని భాషను వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ పాత్రికేయ వృత్తికి తీరని మచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించరాదు. అయితే ఇలాంటి కొందరు సూడో జర్నలిస్టులు చేసే పనికి మొత్తం పాత్రికేయ వృత్తినే అగౌరపరుస్తూ పాలకులు, అధికారుల వ్యవహరించడం తగదు. అక్రిడిటేషన్‌ ఉంటేనే జర్నలిస్టని అక్రిడిటేషన్‌ లేకుండా ఫీల్డ్‌ వర్క్‌ చేసే పాత్రికేయులుపై చర్యలు తీసుకుంటామని కొందరు అధికారులు, ఖాకీలు చెప్పడం విచిత్ర పరిణామమే కాదు పూర్తిగా ఖండిరచాల్సిన వ్యవహారమే. ఓ పత్రికకు లేదా మీడియాకు ఎవరు రిపోర్టర్లుగా ఉండాలనేది నిర్ణయించేది ఆ పత్రిక ఎడిటర్‌ లేక యాజమాన్యమే. అంతే తప్ప మరే వ్యక్తో వ్యవస్థో, అధికారికో జర్నలిస్టులను గుర్తించే హక్కు లేదు. ఎవరు జర్నలిస్టు? ఎవరు నకిలీ? అనే ప్రశ్న వేయాల్సి వస్తే ప్రజాపక్షాన నిజాలు రాసేవారంతా పాత్రికేయులే. సామాజిక స్పృహ ఉండి ప్రజాసమస్యల మీద స్పందించి కలం పట్టి ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి చూపేవారంతా ముమ్మాటికీ నిఖార్సయిన పాత్రికేయులే. ఇలాంటివారికి అక్రిడిటేషన్‌తో సంబంధం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తీసుకుంటే ఎక్కడ తమ రాతల్లో పక్షపాతానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్రిడిటేషన్‌కి దరఖాస్తు చేయని ఎందరో గొప్ప పాత్రికేయులు నేటికీ ఉన్నారు. దశాబ్దాలపాటు కలాన్ని నమ్ముకున్ని ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తూ సొంత మీడియాలు ఏర్పాటు చేసుకున్న సీనియర్‌ పాత్రికేయులు ఎందరికో నేటికీ అక్రిడిటేషన్లు లేవు. అంటే వీరందరికి అక్రిడిటేషన్లు లేవు కావున వీరంతా జర్నలిస్టులు కాదని, వారంతా నకిలీ విలేకర్లని కొందరు చెప్పడం నిజంగా సిగ్గు చేటు. ఇలాంటి ప్రకటనలు ఇస్తున్న అధికారులు, పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జర్నలిస్టు కావడానికి చదువుతోపాటు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. కేవలం నిజాయితీ, నిబద్ధత, సామాజిక స్పృహ ఉన్నవారంతా కలం యోధులే. వేదికలు చిన్నవా పెద్దవా? అనే తేడానే లేదు. వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రాయితీనే అక్రిడిటేషన్‌. అక్రిడిటేషన్‌కు ఇంతకు మించి విలువ లేదు. అంతకన్నా చెల్లుబాటు లేదు. అయితే కొందరు అధికారులు అక్రిడిటేషన్‌ అంటే జర్నలిజం పట్టాగా పేర్కొంటూ రాజ్యాంగ స్ఫూర్తిని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఇలాంటి పోకడ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేసే వ్యవహారంగా ఉన్నది. జర్నలిజం ముసుగులో రాజకీయాలు నెరిపే వ్యవహారంతో నిజంగా నిఖార్సయిన జర్నలిజానికి ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడ్డాయి.

.

.

.

ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్

నల్లగొండ జిల్లా :-

 ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్

 హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్

సూపర్డెంట్ లచ్చు నాయక్  ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్

లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీకి

కొనసాగుతున్న తనిఖీ లు

గుండె పోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

గుండె పోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

జగిత్యాల జిల్లా:-

జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షత్ గుండె పోటుతో మృతి చెందాడు.కుటుంబంతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన అతడు అర్థరాత్రి తిరిగి రూముకి చేరుకున్నాడు, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.చిన్న వయసులోనే హర్షత్ గుండె పోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

విద్యుత్ షాక్ తో తాటి కమ్మల గుడిసె దగ్దం కావడంతో వారి కుటుంబానికి బియ్యం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు

కట్టంగూర్ లో తాటికమ్మలగుడిసే విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం అవ్వగా జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కట్టంగూర్ గాంధీనగర్ జంగాల కాలనీ లో పర్వతం సైదులు తాటి కమ్మలగుడిసె విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం ఐన విషయం తెలిసిన జిల్లా కాంగ్రెస్ యవజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ పరిశీలించి వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.వారి వెంట మాజీ వార్డ్ నెంబర్ ఏనుగు సైదులు,పర్వతం మహేష్,సిరిసల ఉపేందర్, కాలేం సైదులు, నర్సింగ్ సంతోష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

.

.

.

.

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి.
రాహుల్ హెగ్డే ఐపిఎస్, జిల్లా ఎస్పి. సూర్యాపేట జిల్లా :-
జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు,డీ ఎస్ పి నాగభూషణం, సీఐ రాజశేఖర్ లతో కలిసి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ .

గంజాయి నివారణలో జిల్లా పోలీసు పటిష్టంగా పని చేస్తుంది, పూర్తి సమాచారంతో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నాము దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణం లో తనిఖీ చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ రహదారి పై ఈనాడు ఆఫీస్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని 1.5 కేజీల గంజాయి సీజ్ చేసి  యన్.డీ.పి.ఎస్  యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయండి జరిగినది. నిందితులకు గంజాయి అమ్మడం, త్రాగటం అలవాటు ఉన్నది, గత నేర చరిత్ర కలిగి ఉన్నారు అని ఎస్పి గ అన్నారు.

గంజాయి సంబంధ కేసుల్లో ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్ పోర్టు ల విషయంలో సమస్యలు వస్తాయి. కలశాలలు వీటి పై దృష్టి పెట్టాలి అని ఎస్పి  కొరినారు.

నిందితుల వివరములు 

1. రోషన్ కుమార్ సింగ్, 2.తెలనాగి మురుగేష్, 3.మొహమ్మద్ అంజద్ పాషా.

1.5 కిలోల గంజాయి. స్వాధీనము చేసుకున్నారు.
. . .
భువనగిరి హాస్టల్ ని సందర్శించిన.బి.ఎస్.పి.నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి

భువనగిరి హాస్టల్ ని సందర్శించిన మేడి ప్రియదర్శిని

యాదాద్రి భువనగిరి:-

ఇటీవల భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ హాస్టల్ ని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని సందర్శించింది. ఆ పిల్లలిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ?, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఆరా తీసింది.అనంతరం భవ్య, వైష్ణవి తల్లితండ్రులను కలిసి వాళ్లకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ 'భవ్య , వైష్ణవి లు చనిపోవడం చాలా బాధాకరం. ఆ పిల్లలిద్దరి తల్లితండ్రుల బాధను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇదివరకే హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిలపై దాడి చేసారని తెలిసింది. వాళ్ళు ఎవరో పోలీసులు విచారించి పట్టుకోవాలి. అంతే కాకుండా హాస్టల్ లో సెక్యూరిటీ ని బాగా పెంచాలి, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే విద్యార్థులు ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల భయపడుతున్నారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి భరోసా నింపే బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత హాస్టల్ భవనాలను నిర్మించాలి' అంటూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది..

.

.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవా

బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

నల్గొండ జిల్లా:-

సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

.

.

.

నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,బచ్చుపల్లి గంగాధర్ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,బచ్చుపల్లి గంగాధర్ రావు

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన పోలగోని అంజయ్యలక్ష్మీ గౌడ్ దంపతుల ప్రధమ కుమారుడు విజయ్ గౌడ్ వివాహ మహోత్సవంలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బి.జీ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఈకార్యక్రమంలో.

గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు..

..

నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా:-

కట్టంగూర్ మండల కేంద్రంలోని బి యన్ పంక్షన్ హల్ లో జరిగిన సోమగాని శివకృష్ణ కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారిని ఆశీర్వదించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈకార్యక్రమంలో.కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ 2 మాది యాదగిరి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బి.జి.ఆర్.ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు,మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది యాదగిరి,బూరుగు శ్రీను,మిట్టపల్లి శివ,కేవీ గౌడ్,ధార భిక్షం,గుండు పరమేష్,లింగయ్య,శేఖర్,జిల్లా యూవజన నాయకులు రెడిపల్లి స్వామి,తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

.

.