ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు బీర్ల ఐలయ్య గారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో,ప్రజా ప్రతినిధులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలని,చిన్న లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు,తెలంగాణ ప్రజలందరూ,సుఖ సంతోషాలతో ఉండాలని శివయ్యను ని కోరుకున్నారు.

మెగా డీఎస్సీ ని ప్రకటించాలి: కూచి మల్ల నాగేష్ మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు


మెగా డీఎస్సీ కోసం బీఈడీ మరియు డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన 5089 పోస్టులకుగాను మరో 20 వేల పోస్టులు అదనంగా కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ప్రకటించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఊరుకో బడి అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రాతిపదికన సెకండ్ గ్రేట్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు వ్యాయామ ఉపాధ్యాయులు క్రాప్ ఆర్ట్ టీచర్లు మొదలగు అన్ని ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు.

భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


యాంకర్ పార్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సోమవారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గ కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు క్యాంప్ ఆఫీస్ కి వచ్చి తమ సమస్యలను తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్, టిపిసిసి మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల గణన విజయోత్సవ కార్యక్రమం


బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ పిలుపుమేరకు ..రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సాధన విజయోత్సవాలు భువనగిరిలో బీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ. ...

  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా 

బీసీ కులాల లెక్కలు చేపట్టాలని చేస్తున్న ఉద్యమానికి స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన పై తీర్మానం చేయడం జరిగింది, ఇది బీసీల పోరాట విజయం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గార్ల కృషితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం లభించడం ఎంతో 

హర్షనియం, అని అలాగే ఇది చారిత్రాత్మక నిర్ణయం.

కావున యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్త బీసీ సమాజం, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని... మహాత్మ జ్యోతిబాపూలే, విగ్రహం వద్ద  విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు వేతనాలు పెంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ధర్నా


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ ముందు ఏఐటియూసి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం  ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ మరియు వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి, పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ని , వర్కర్లను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయ భవనం ప్రారంభం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ రేపు సోమవారం 19న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం భవనాన్ని ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్ హనుమంతు కె జేండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం చేరుకుని డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయం భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ కు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

వలిగొండ మండల కేంద్రంలోని దోనూరు ప్రతాపరెడ్డి గార్డెన్ లో ఇంద్ర పాల నగరం కు చెందిన నూతన వధూవరులను ఆశీర్వదించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దోనూరు ప్రతాప్ రెడ్డి గార్డెన్ లో ఆదివారం ఇంద్రపాల నగరానికి చెందిన బొప్పని నగేష్ - లాస్య వివాహము లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో జిల్లా చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇంద్రపాల నగరం గ్రామ పెద్దలు, బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

.

వలిగొండ మండల కేంద్రంలో విజయవంతంగా సాగిన SFI జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు


*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధోశక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని విజ్ఞానవంతులుగా మేధావులుగా తయారవాలన్నారు

విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలన్నారు ఉద్యమాలతో పాటు విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించడం వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు అదే విధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై పోరాడడం కాకుండా పరీక్షల పై అవగాహన పెంపొందించేందుకు వారిలో ఉన్న భయాన్ని తీసేసి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు టాలెంట్ టెస్టులో సుమారు 200కు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు త్వరలో మండల వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ర్యాంకులు తీసి షీల్డ్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ పొలేపాక విష్ణు,బోలుగుళ్ళ కావ్య బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ ఎస్,కే ఫర్దిన్, మైసొల్ల నరేందర్, డి. నేహ, సాయి, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతర సందర్భంగా బస్సుల కొరతను అర్థం చేసుకోవాలి: యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్


 తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళమైన 

"మేడారం జాతర " ను పురస్కరించుకుని యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని, సహకరించాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజుల పాటు యాదగిరిగుట్ట డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయని ఆయన తెలిపారు. బస్సుల, సిబ్బంది కొరత వల్ల కలిగే అసౌకర్యాన్ని ప్రయాణికులు, విద్యార్థులు,పరిసర గ్రామాల ప్రజలు, యాదగిరిగుట్ట దైవదర్శనం కోసం వచ్చే భక్తులు అర్థం చేసుకొని, ఆర్టీసీ కి సహకరించాలని ఆయన కోరారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన స్వప్న వైఫ్ ఆఫ్ శ్రీశైలం కుటుంబానికి శనివారం భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 1 లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కు ని అందజేశామని అన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ,బాధితులు తదితరులు పాల్గొన్నారు