భువనగిరి ఏరియా ఆసుపత్రి ముందు వేతనాలు పెంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ధర్నా


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ ముందు ఏఐటియూసి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం  ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ మరియు వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి, పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ని , వర్కర్లను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 19న డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయ భవనం ప్రారంభం: జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ రేపు సోమవారం 19న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం భవనాన్ని ప్రారంభిస్తారని, జిల్లా కలెక్టర్ హనుమంతు కె జేండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటిగంటకు రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం చేరుకుని డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయం భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ కు బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

వలిగొండ మండల కేంద్రంలోని దోనూరు ప్రతాపరెడ్డి గార్డెన్ లో ఇంద్ర పాల నగరం కు చెందిన నూతన వధూవరులను ఆశీర్వదించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దోనూరు ప్రతాప్ రెడ్డి గార్డెన్ లో ఆదివారం ఇంద్రపాల నగరానికి చెందిన బొప్పని నగేష్ - లాస్య వివాహము లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో జిల్లా చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇంద్రపాల నగరం గ్రామ పెద్దలు, బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

.

వలిగొండ మండల కేంద్రంలో విజయవంతంగా సాగిన SFI జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు


*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధోశక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని విజ్ఞానవంతులుగా మేధావులుగా తయారవాలన్నారు

విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలన్నారు ఉద్యమాలతో పాటు విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించడం వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు అదే విధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై పోరాడడం కాకుండా పరీక్షల పై అవగాహన పెంపొందించేందుకు వారిలో ఉన్న భయాన్ని తీసేసి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు టాలెంట్ టెస్టులో సుమారు 200కు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు త్వరలో మండల వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ర్యాంకులు తీసి షీల్డ్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ పొలేపాక విష్ణు,బోలుగుళ్ళ కావ్య బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ ఎస్,కే ఫర్దిన్, మైసొల్ల నరేందర్, డి. నేహ, సాయి, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతర సందర్భంగా బస్సుల కొరతను అర్థం చేసుకోవాలి: యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్


 తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళమైన 

"మేడారం జాతర " ను పురస్కరించుకుని యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని, సహకరించాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజుల పాటు యాదగిరిగుట్ట డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయని ఆయన తెలిపారు. బస్సుల, సిబ్బంది కొరత వల్ల కలిగే అసౌకర్యాన్ని ప్రయాణికులు, విద్యార్థులు,పరిసర గ్రామాల ప్రజలు, యాదగిరిగుట్ట దైవదర్శనం కోసం వచ్చే భక్తులు అర్థం చేసుకొని, ఆర్టీసీ కి సహకరించాలని ఆయన కోరారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన స్వప్న వైఫ్ ఆఫ్ శ్రీశైలం కుటుంబానికి శనివారం భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 1 లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కు ని అందజేశామని అన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ,బాధితులు తదితరులు పాల్గొన్నారు

మొగిలి పాక కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని 

మొగిలి పాక గ్రామంలో గత ఏడు మాసాలుగా ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతూ శనివారం రోజున ఉదయం సమయంలో సయ్యద్ బురాన్ మరణించడం జరిగింది. వారియొక్క కుటుంబ సభ్యులకు గాను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అద్వర్యంలో ముద్దసాని రామాచంద్ర రెడ్డి వారికి కుటుంబానికి. 5000/- రూపాయలు ఆర్దిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కోర్ కమిటి మెంబర్ మామిడి సత్తి రెడ్డి, ముద్దసాని జయసింహ రెడ్డి,మాజీ అధ్యక్షుడు పాపయ్య, నర్సయ్య వెలిసాజు నరేందర్ చారీ, పరుష రాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాంబాబు, సహయ కార్యదర్శి చేన్నారం మహేష్  అదే విధంగా మైనారీటీ సోదరులు షేక్ ఉస్సేన్, హైదర్ ,చాందుపాష ,హిమం తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారిని ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. అనంతరం మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని తెలంగాణకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. జన్మదిన వేడుకలో కేక ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి వలిగొండ మండల పార్టీ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు మాజీ రైతు సమన్వయ కమిటీ కో కన్వీనర్ పడమటి మమత బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ కొండూరు వెంకటేశం గౌడ్ మాద శంకర్ గౌడ్ ఐటిపాముల సత్యనారాయణ, పోలపాక సత్యనారాయణ, మండల నాయకులు కాసుల పెద్దలు, సోమనబోయిన రమేష్, ఎడవల్లి శాంత కుమార్, మోతి మల్లేశం బల్గూరి నరేష్ రెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బస్వాపురం ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలి: కొండమడుగు నరసింహ CPM రాష్ట్ర కమిటీ సభ్యలు


      బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువును నింపి రైతాంగానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల పరిధిలో ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సిపిఎం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక బోరుబావులు వెండిపోతున్న పరిస్థితులు ఉన్నదని అన్నారు. అనేకమంది బోరు బావుల ఆధారంగా దాదాపు 7,8 వందల ఎకరాల భూమిలో వరి, గడ్డి,సోప్ప సాగు చేసినారని తీరా నాటు బెట్టి నెల ,రెండు నెలలు గడవకముందే బోరు బావుల్లో నీళ్లు తగ్గి బోర్లు పోయలేని పరిస్థితి ఏర్పడిందని దీనితో రైతులు ఆవేదన చెందుతున్నారని గత నాలుగైదు సంవత్సరాల నుండి బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం చెరువులోకి తూము ద్వారా నీళ్లు రావడం వల్ల రైతాంగానికి సాగునీరు లభించిందని గత ఐదారు నెలల నుండి నీళ్లు రాకపోవడంతో ముత్తిరెడ్డిగూడెం చెరువులో రోజురోజుకు నీళ్లు తగ్గి బోరు బావులు ఎండుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లా యంత్రాంగం బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి సాగు, తాగునీరు అందించి రైతులను, ప్రజలను ఆదుకోవాలని నర్సింహ్మ కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాణి మూడవ వర్ధంతి సందర్భంగా అనాధాశ్రమంలో వస్తువుల బహూకరణ


 

జట్ఠా సాగర్,జీవిత భాగస్వామి జట్టా శ్రీవాణి మూడవ వర్థంతి సందర్భంగా రాయగిరి లోని సహృదయ అనాదాశ్రమంలో కుర్చీలు, నిత్యావసర వస్తువులు దానం చేసిన జట్టా సాగర్ అభినందనీయుడని చిన్న కందుకూరు మాజీ ఉపసర్పంచ్ కల్లేపెల్లి మహేందర్ అన్నారు. శనివారం రాయగిరి శివారులోని సహృదయ అనాదాశ్రమం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జట్టా సాగర్, తన జీవిత భాగస్వామి శ్రీవాణి జ్ఞాపకార్థం అనాదాశ్రమం లో సుమారు 16 ( ప్లాస్టిక్ ) కుర్చీలు, నిత్యావసర వస్తువులు దానం చేసి, మానవత్వాన్ని చాటుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న కందుకూరు మాజీ వార్డు సభ్యులు సుబ్బురు శ్రీనివాస్, దాత జెట్టా సాగర్, నాయకులు సంజీవ,బండ బిక్షపతి, సుధాకర్ , స్వామి, సంతోష్, శ్రీను, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.