అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న - మార్క అనిల్ గౌడ్


దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు - మార్క అనిల్ గౌడ్


•అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న - మార్క అనిల్ గౌడ్•

•అయోద్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా హిందువుగా గర్విస్తున్నాను•




•నీతి,నిజాయితీ,ధర్మంతో ఉత్తమమైన పాలనతో జగత్తును పరిపాలించిన ఆ జగదాభిరాముడు అందరివాడు. అలాంటి రాముని పవిత్రమైన చరిత్రకు నేడు అపవిత్రమైన రాజకీయ భూతాన్ని ఆపాదించకండి•

•మతాన్ని, దైవాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే భవిష్యత్తులో వినాశనం తప్పదు•

Central NEWS:


[ Crime journalist. ]



బిజెపి మతంతో,దైవంతో రాజకీయం చేయకుండా గత పది సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వ పాలనలో ప్రజా ఆమోదయోగ్యమైన సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారు ప్రజలకు వివరించండి. అంతేకానీ సర్వ మతాల నిలయమైన భారత దేశంలో మత రాజకీయాలు చేయకండి. హిందూ ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుని స్మరణ చేస్తు అన్య మతస్తులను, వారి సంప్రదాయాలను గౌరవించే హిందువుల మనోభావాలను మతం పేరుతో దెబ్బతీయవద్దు.మార్క అనిల్ గౌడ్ .
సైబర్ నేరగాళ్లు -ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు జాగ్రత్త - పోలీస్ కమిషనర్



తెలంగాణ:

[ Crime journalist. ]

(సిద్దిపేట జిల్లా):-

*లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.* *గూగుల్లో సెర్చ్ చేసి ఆన్లైన్ ట్రాన్జక్షన్ చేయకండి, ఆన్లైన్లో యాప్ ల గురించి వెతకకండి, డబ్బులు పంపించి మోసపోకండి* *టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి* *ఈ సంవత్సరం ఈ రోజు వరకు ₹ 19,40,750/- లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. త్వరలో విడతలవారీగా సంబంధిత బాధితుల అకౌంట్లో, బ్యాంకుల ద్వారా జమవుతాయి.* *పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., అధికారి* సైబర్ నేరగాళ్లు -ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు •ఓటిపి మోసాలు• •ఈ మెయిల్స్ ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటన పట్ల జాగ్రత్తగా ఉండండి• •సంస్థల నకిలీ ఈమెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి• •ఆన్లైన్ షాపింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి• •రుణ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి• •డెబిట్/ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి• •లాటరీ మెయిల్స్/ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి• •మొబైల్స్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి• •మీతోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బులు దోచేస్తారు జాగ్రత్త• •రాజకీయ నేతల హీరోల ఫోటోలతో ఆన్లైన్ ఓటింగ్ పేరుతో మోసం• •పెట్టుబడులు పెడతామంటూ ఫేస్బుక్ ద్వారా ఆకర్షిస్తారు జాగ్రత్త• •ప్రేమ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్• •అనధికార లింకులను నొక్కితే మీ ఫోన్ హ్యాకర్ కంట్రోకు వెళుతుంది జాగ్రత్త • •భీమా కంపెనీల పేరుట మోసాలు• •ఈ ఫైలింగ్ & ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పేరిట మోసాలు• •విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు సృష్టించి వాట్సప్ వేదికగా సైబర్ మోసాలు• •లక్కీ డ్రాలో ఎంపికైనట్లు ఎర వేసి మోసాలు• •ఈ కామర్స్ ఫ్రాడ్• •ఇంపెర్సొననేషన్- చీటింగ్ ఫ్రాడ్• •ఫేక్ ఆర్డర్స్• •ట్రేడింగ్ ఫ్రాడ్• •సైబర్ స్టాకింగ్ (సెక్టోరేషన్) ఫ్రాడ్• •అడ్వటైజ్మెంట్ పోర్టల్ ఫ్రాడ్• •సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్• •చైల్డ్ ప్రోనోగ్రఫీ• •మాట్రిమోనిల్ ఫ్రాడ్• *పై సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరం జరగగానే 1930 కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి* *1. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడు* గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫేస్బుక్లో ఫోర్ వీలర్ అమ్మకానికి ఉన్నదని కాంటాక్ట్ నెంబర్ పంపించగా అది నమ్మిన సదరు బాధితుడు వివరాలు అడగగా ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో మరియు ఆర్ సి తదితర వాహనం యొక్క పేపర్లు పంపించగా అది నమ్మిన సదరు బాధితుడు ఫైబర్ నేరగాడు చెప్పిన విధంగా ట్రాన్స్పోర్ట్ చార్జి జీఎస్టీ తదితర ఖర్చులు ఉంటాయని డబ్బులు పంపిస్తే వాహనం డెలివరీ చేస్తానని చెప్పగానే సదరు బాధితుడు సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు గూగుల్ పే ఫోన్ పే ద్వారా 97,649/- రూపాయలు పంపించాడు. తదుపరి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానం వచ్చిన సదరు బాధితుడు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగింది.
బదిలీ పై వచ్చిన తహసీల్దారు ను సన్మానించిన బీజేపీ నాయకులు


[ Crime journalist ] నల్లగొండ జిల్లా:


(నకిరేకల్ నియోజకవర్గం):- కట్టంగూరు మండల తహాసిల్దార్ గా బదిలీపై వచ్చిన శ్రీ గుగులోతు ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాదురి.వెంక రెడ్డి.
మొగుళ్లపల్లి ఎంపీడీవోకు ఆత్మీయ సన్మానం


•-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు•


[  Crime journalist ]


జయశంకర్ భూపాలపల్లి జిల్లా:


(మొగుళ్ళపల్లో ) :- మండలానికి నూతనంగా విచ్చేసి గురువారం బాధ్యతలను స్వీకరించిన ఎంపీడీవో జయశ్రీని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద సుధాకర్ లు మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి మాట్లాడారు. మండల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
*మొగుళ్ళపల్లి-చిట్యాల ప్రధాన రహదారిలో వెదజల్లుతున్న దుర్గంధం - దుర్వాసనతో తల్లడిల్లుతున్న ప్రజలు*


-తట్టుకోలేని స్థితిలో అటువైపుగా వెళ్లే ప్రయాణికులు*



[ Crime journalist ]


జయశంకర్ భూపాలపల్లి జిల్లా:


(మొగుళ్ళపల్లి):- మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల్ మరియు ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు ములుగు జిల్లా వెంకటాపూర్ లో కొనసాగించాల్సిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలకు నూతన భవనం నిర్మించకపోవడంతో రెండు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1200 మంది విద్యార్థులు మల, మూత్ర విసర్జన చేయడంతో ఆ మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, కళాశాలలకు అతి సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలకు మరియు మొగుళ్ళపల్లి-చిట్యాల ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు, రైతులకు తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో తట్టుకోలేని స్థితిలో ప్రజలు ముక్కు, నోరు మూసుకొని కిలోమీటర్ మేర వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుర్గంధం వెదజల్లకుండా, దుర్వాసన రాకుండా తక్షణమే తగు చర్యలను చేపట్టాలని మండల ప్రజలు, రైతులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
*మొగుళ్ళపల్లి ఎంపీడీవోగా టి జయశ్రీ*


మర్యాదపూర్వకంగా కలిసిన మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది



[ Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:


(మొగుళ్ళపల్లి):-మొగుళ్ళపల్లి ఎంపీడీవోగా టి జయశ్రీ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన కృష్ణవేణి వరంగల్ జిల్లా గీసుకొండకు బదిలీ కాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపీడీవోగా పనిచేసిన టి జయశ్రీ మొగుళ్ళపల్లికి ఎంపీడీవోగా బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
*13 డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతి*




వరంగల్ జిల్లా:

[  Crime journalist. ]


(వరంగల్):- వరంగల్ నగరంలోని13వ డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతిని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ఆదేశాల మేరకు నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా మహిళ అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్ తెలిపారు.13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోట్ల ప్రసాద్ సమక్షంలో 13వ డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ప్రభావతి మాట్లాడుతూ పార్టీ కోసం 30 సంవత్సరాల నుండి తమవంతు కృషి చేశానని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక తమ వంతు సహాయం చేశానని, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నారగోని స్వప్న-మురళి గౌడ్, బొట్ల ప్రసాద్ నా కృషిని, పట్టుదలను గుర్తించి డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..డివిజన్ అభివృద్ధి కోసం కార్యకర్తలను, మహిళలను అందరిని కలుపుకొని కృషి చేస్తానని తెలిపారు.
*నత్త నడకన మినీ మేడారం జాతర పనులు*




[  Crime journalist ]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:


మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఈనెల 21 నుండి ప్రారంభం కానుండగా ఇంతవరకు జాతర లో ఎలాంటి పనులు జరగలేదు, గత కొన్ని సంవత్సరాల నుండి మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాలకు చెందిన డైరెక్టర్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. కాగా ఈ సంవత్సరం ఇంతవరకు కమిటీ నిర్ణయం కాకపోవడంతో అసలు జాతర నడుస్తుందా లేదా అన్న సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ జోక్యం కలుగజేసుకోవడంతో ఇదంతా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించి జాతర కమిటీ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చి జాతర పనులను ప్రారంభించి వేగవంతం చేసి జాతరను విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
*బీసీ కుల జన గణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం*



*బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి మరువలేనిది - మార్క అనిల్ గౌడ్ -బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి*


[ Crime journalist ]


(తెలంగాణ రాష్ట్రం):- స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు అట్టడుగు స్థానంలోనే ఉన్నారు. బీసీల జీవితాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన మొదటి ప్రభుత్వం మన తెలంగాణ.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే దేశంలో బీసీల అస్తిత్వం బలపడుతుంది. రేపటి దేశ రాజకీయాల్లో నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఒక సంచలనం. బీసీల ఆత్మగౌరవం నేడు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా దేశవ్యాప్తంగా వినబడేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మార్క అనిల్ గౌడ్.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్*



*ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్*



*-వాగుల శివారులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా జెసిబితో గుంతలు*

*-వినూత్న రీతికి శ్రీకారం చుట్టిన ఎస్ఐ మాధవ్ గౌడ్ కు అభినందనల వెల్లువ*


[  Crime journalist ]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి ):-మండలంలోని వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా మొగుళ్లపల్లి ఎస్ఐ. తీగల మాధవ్ గౌడ్ అడ్డుకట్ట వేశారు. మండలంలోని వేములపల్లి గ్రామ శివారులోని గల గునకపల్లి, ఇస్సిపేట గ్రామ శివారులోని వాగొడ్డుపల్లి వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్ఐ. తీగల మాధవ్ గౌడ్ గుర్తించారు. దీంతో వాగుల శివారుల నుండి అక్రమంగా ఇసుక తరలకుండా జెసిబి సహాయంతో వాగుల చుట్టూ గుంతలు తీయించారు. కాగా ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ వినూత్న రీతికి శ్రీకారం చుట్టడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మాట్లాడారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.