ఆసరాతో అక్కా చెల్లెమ్మలకు భరోసా.. జగనన్న బలం మహిళలే రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నాడే అన్ని రంగాల్లో ముందంజ వేయగలుగుతారని ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకే అందించడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.
శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో "వై.యస్.ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ధి కార్యక్రమాన్ని సాంబశివారెడ్డి మరియు వీరాంజనేయులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతల ఆశీర్వాదం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, గతంలో వైయస్సార్, ప్రస్తుతం జగనన్న ముఖ్యమంత్రి కావడానికి అక్కచెల్లెమ్మలే కారణమన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి పాదయాత్రలో మహిళల కోరిక మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన జగనన్న అధికారంలోకి వచ్చాక దశల వారీగా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని ప్రశంసించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వై.యస్.ఆర్. ఆసరా క్రింద 4,835 సంఘాలకు నాలుగు విడతల్లో మహిళలకు దాదాపు రూ.169.88 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. అలాగే వై. యస్. ఆర్. సున్నా వడ్డీ పథకం క్రింద నియోజకవర్గ వ్యాప్తంగా 6,047 సంఘాలకు దాదాపు రూ.41.82 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. జగనన్న ఆశీస్సులతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరాంజ నేయులును ఆశీర్వదించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. కుల,మత పార్టీలకతీతంగా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నారన్నారు. గత టిడిపి పాలనలో ఇచ్చిన మాట తప్పితే నేడు జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఐదేళ్ల పరిపాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. మండల వ్యాప్తంగా నాలుగవ విడత వైయస్సార్ ఆసరా పథకం కింద 630 సంఘాలకు దాదాపు రూ. 21.70 కోట్లు, వైయస్సార్ ' 0' వడ్డీ పథకం ద్వారా 844 సంఘాలకు దాదాపు రూ.5.39 కోట్లు లబ్ధిచేకూరిందన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.
అనంతరం రూ.5.45 కోట్లు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు కలసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
జగనన్న చేసిన మేలుని ఓట్ల రూపంలో చూపించి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Feb 17 2024, 07:31