ఆసరాతో అక్కా చెల్లెమ్మలకు భరోసా.. జగనన్న బలం మహిళలే రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నాడే అన్ని రంగాల్లో ముందంజ వేయగలుగుతారని ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకే అందించడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో "వై.యస్.ఆర్ ఆసరా" నాలుగవ విడత లబ్ధి కార్యక్రమాన్ని సాంబశివారెడ్డి మరియు వీరాంజనేయులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతల ఆశీర్వాదం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, గతంలో వైయస్సార్, ప్రస్తుతం జగనన్న ముఖ్యమంత్రి కావడానికి అక్కచెల్లెమ్మలే కారణమన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి పాదయాత్రలో మహిళల కోరిక మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన జగనన్న అధికారంలోకి వచ్చాక దశల వారీగా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నెరవేర్చారని ప్రశంసించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వై.యస్.ఆర్. ఆసరా క్రింద 4,835 సంఘాలకు నాలుగు విడతల్లో మహిళలకు దాదాపు రూ.169.88 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. అలాగే వై. యస్. ఆర్. సున్నా వడ్డీ పథకం క్రింద నియోజకవర్గ వ్యాప్తంగా 6,047 సంఘాలకు దాదాపు రూ.41.82 కోట్లు లబ్ది చేకూరిందన్నారు. జగనన్న ఆశీస్సులతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరాంజ నేయులును ఆశీర్వదించాలని కోరారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. కుల,మత పార్టీలకతీతంగా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నారన్నారు. గత టిడిపి పాలనలో ఇచ్చిన మాట తప్పితే నేడు జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఐదేళ్ల పరిపాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. మండల వ్యాప్తంగా నాలుగవ విడత వైయస్సార్ ఆసరా పథకం కింద 630 సంఘాలకు దాదాపు రూ. 21.70 కోట్లు, వైయస్సార్ ' 0' వడ్డీ పథకం ద్వారా 844 సంఘాలకు దాదాపు రూ.5.39 కోట్లు లబ్ధిచేకూరిందన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.

అనంతరం రూ.5.45 కోట్లు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు కలసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

జగనన్న చేసిన మేలుని ఓట్ల రూపంలో చూపించి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నారా భువనేశ్వరి చేతుల మీదుగా నామకరణం..

నారా భువనేశ్వరి చేతుల మీదుగా నామకరణం..

అనంతపురం జిల్లా శింగనమల నియోజక వర్గం బుక్కరాయశముద్రం మండల ఐటీడీపి అధ్యక్షుడు హేమంత్ యాదవ్ గారికి నారా లోకేష్ జన్మదినం రోజున జనవరి 23న బాబు జన్మించాడు అందుకని నారా భువనేశ్వరి అమ్మ గారు చేతుల మీదుగా కుషాల్ క్రిష్ణ గా నామ కరణం చేయడం జరిగింది.

వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో వైయస్సార్సీపీని ఆదరించాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలంలోని పెరవళి, జూలాకాలువ, జలాలపురం, కొరివిపల్లి, సలకంచెరువు, సోదనపల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పర్యటించారు.

గ్రామాల్లోని నాయకులు ఇళ్లకు వెళ్లి పలకరించారు. పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పని చేద్దామని, మీ అందరికి అందుబాటులో ఉంటానని, గెలిపించాలని కోరారు.

గ్రామాల్లోని ప్రజలతో, అవ్వ, తాతలను పలకరిస్తూ, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే జగనన్న పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలను నాడు- నేడు క్రింద ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా తీర్చిదిద్దుతున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు.

రాబోయే కాలంలో పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి వారి కుటుంబాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చి పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలు మార్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్

ప్రవేశపెట్టి ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారని, అలాగే ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించి పేదలకు రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి మళ్లీ రావాలి అంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి, వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికిన శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు

ఈనెల 18న రాప్తాడులో జగనన్న సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ను పరిశీలించడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికిన శింగనమల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు.

అనంతరం సభా స్థలాన్ని పరిశీలించారు.

బొలెరో వాహనం, సిమెంటు లారీని ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి...
అర్ధరాత్రి సోమవారం ఒంటిగంటలో ఇరిగేపల్లి హైవే దగ్గర బొలెరో వాహనం, సిమెంటు లారీని ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. బొలెరో వాహనంలో రొల్ల మండలం దాసప్పన పాల్యం గ్రామానికి చెందిన 3 గ్రామస్తులు సిరాలో జరుగు పెండ్లికి పోవుచుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్..
తిరుమల : తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్.. తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ గంధం వనం వద్ద ఏనుగుల గుంపు వచ్చాయి. శ్రీ గంధం వనం వద్ద ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టిటిడి అటవీ శాఖా అధికారులు ఘటనా స్థలంకు చేరుకున్నారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంను వదిలి బయటకు వచ్చినట్లు టిటిడి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఉల్లి రోషన్న మృతదేహానికి నివాళులర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
ఉల్లి రోషన్న మృతదేహానికి నివాళులర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు.. శింగనమల : మండల కేంద్రంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఉల్లి నారాయణస్వామి యాదవ్,ఉల్లి శివయాదవ్,గార్ల *తండ్రి ఉల్లి రోషన్న అనారోగ్యంతో ఈరోజు ఉదయం మృతి చెందడం జరిగింది.* ఈ విషయం తెలుసుకున్న *తెలుగు యువతరాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు సింగనమల మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాల వేసిన వారి కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని భరోసా కల్పించారు* ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ టియన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యనిర్వహకార్యదర్శి బండి పరుశురాం శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి తెలుగు యువత మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, మల్లికార్జున, ప్రసాద్ నాయక్,కాయల నారాయణస్వామి, శివశంకర్,కాయలసురి,* తదితరులు పాల్గొన్నారు
గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. బుక్కరాయసముద్రం మండలం బోయకొట్టాల గ్రామంలోని వైస్సార్సీపీ మండల కన్వీనర్ అంకె నరేష్ నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాజరైయ్యారు. నూతన గృహంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ అంకె చిన్న ముసలన్న, నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నన్ను ఆశీర్వదించండి: నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు..
నన్ను ఆశీర్వదించండి: నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు* నిరుపేద కుటుంబం వచ్చిన సామాన్య కార్యకర్తను గుర్తించి ముఖ్యమంత్రి వైస్ జగనన్న నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని, మీ అందరీ దీవెనలతో గెలిపించాలని నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు కోరారు. బుక్కరాయసముద్రం మండలంలోని చెన్నంపల్లి, రేకులకుంట, కొర్రపాడు, పసులూరు, ఏడావులపర్తి, దండువారిపల్లి, అమ్మవారిపేట, రోటరీపురం, రెడ్డిపల్లి, గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో పర్యటించారు. గ్రామాల్లోని నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, మీ అందరికీ అందుబాటులో ఉంటానని, మీ అందరి దీవెనలు కావాలని మంచి మెజారిటీతో గెలిపించాలని వారిని విన్నవించుకున్నారు. కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ఎంతో మేలు చేశారన్నారు. గత ప్రభుత్వ పాలన కంటే వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. బడుగుబాలహీన వర్గాలకు రాజకీయంగా,సంక్షేమ పరంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, వైస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంలో యువకుడి కంట్లో కారం కొట్టి నగదుతో హుడాయించిన దుండగులు..
కళ్యాణదుర్గంలో యువకుడి కంట్లో కారం కొట్టి నగదుతో హుడాయించిన దుండగులు. కళ్యాణదుర్గం పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కుందుర్పి రోడ్డు వద్ద ముస్తఫా వ్యాపార నిమిత్తం నగదుతో కళ్యాణదుర్గంకు వస్తుండగా కంట్లో కారం కొట్టి 21,400 రూపాయలు నగదుతో హుడాయించిన దుండగులు. స్థానికుల సహాయంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. కళ్యాణదుర్గం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన ముస్తఫా, వ్యాపార నిమిత్తం పొరుగురికి వెళ్లి కళ్యాణదుర్గంకు వస్తున్న క్రమంలో, పట్టణ శివారులో మాటు వేసిన దుండగులు, ముస్తఫా కంట్లో కారం కొట్టి అతని వద్దనుండి 21,400 రూపాయల నగదుతో ఉడాయించారని, స్థానికుల సహాయంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు. కళ్యాణదుర్గం పట్టణంలో రోజురోజుకీ దొంగతనాలు , దోపిడీలు ఎక్కువవుతున్న దొంగలను కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.