వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
వైఎస్ఆర్సీపీ ని ఆదరించండి.. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటాను.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో వైయస్సార్సీపీని ఆదరించాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలంలోని పెరవళి, జూలాకాలువ, జలాలపురం, కొరివిపల్లి, సలకంచెరువు, సోదనపల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పర్యటించారు.
గ్రామాల్లోని నాయకులు ఇళ్లకు వెళ్లి పలకరించారు. పార్టీ బలోపేతానికి కలసికట్టుగా పని చేద్దామని, మీ అందరికి అందుబాటులో ఉంటానని, గెలిపించాలని కోరారు.
గ్రామాల్లోని ప్రజలతో, అవ్వ, తాతలను పలకరిస్తూ, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే జగనన్న పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలను నాడు- నేడు క్రింద ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. జాతీయస్థాయిలో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రతిభ చాటే విధంగా తీర్చిదిద్దుతున్న ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు.
రాబోయే కాలంలో పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి వారి కుటుంబాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చి పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలు మార్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్
ప్రవేశపెట్టి ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారని, అలాగే ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించి పేదలకు రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. తండ్రి బాటలో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి మళ్లీ రావాలి అంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి, వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 14:22