కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 16న జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. 

    బుధవారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో ఈ నెల 16వ తేదీన ఏఐటీయూసీ తో పాటు 10 జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరగబోయే "దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్" కు సంబంధించిన గోడ పత్రికలను కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కుల రక్షణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కనీస ప్రయోజన కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదని , 44 రకాల శ్రామిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి వేసిందని , ఫలితంగా కార్మిక వర్గ ప్రయోజనాలకు బదులుగా యాజమాన్యాల కు ప్రయోజన కారిగా మారిందని ఆయన అన్నారు. 2014వ సంవత్సరంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని... ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని , కార్మిక వర్గ ప్రయోజనాలు కనీసం కూడా పట్టించుకోలేదని ఆయనన్నారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు కనీస హక్కులు , సౌకర్యాలు లేక యాజమాన్యాల దోపిడీకి ప్రైవేటు/ ప్రభుత్వా ల శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన అన్నారు. 

దేశంలో సుమారు 75 కోట్ల మంది ప్రజలు రోజుకు మూడు పూటల తిండి కూడా తినలేని దీనస్థితిలో ఉన్నారని , ఒకపక్క దేశానికి వెన్నెముక అయిన రైతులూ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని , మరొకపక్క అదానీ , అంబానీ లాంటి ధనికులు మాత్రం కుబేరులుగా మారుతూ... ప్రపంచ ధనికుల స్థానానికి పోటీ పడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. 

దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో బీద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికులచే శ్రమదోపిడి చేసుకుంటూ 5  నుండి 10 వేల రూపాయల అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని , గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్మిక కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలన్న స్పృహ లేకపోవడం విచారకరమైన విషయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ, ఆటో రంగా కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికునికి 26000 ఇవ్వాలని, ఈ ఎస్ ఐ,పిఎఫ్ సౌకర్యం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

 16న జరిగే సమ్మె లో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

    ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, సివిల్ సప్లై హమాలి యూనియన్ అధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, నాయకులు రామలింగయ్య, రెహ్మాన్, శ్రీకాంత్, బాబు, లింగస్వామి, మల్లేష్, నర్సింహా, ఈశ్వర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

  

బీఎస్పీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టు అప్రజాస్వామికం


బహుజన్ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ని జిల్లా పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పటు జరిగింది.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జి ఉప్పల జహంగీర్ మాట్లాడుతూ

 నిన్న మంగళవారం అర్థరాత్రి సమయంలో చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో ఆర్ఎస్ఎస్ , బిజెపి వారు చర్చిని కూలగొట్టి క్రిస్టియన్ మైనారిటీ దళితులపై దాడి చేశారని గుర్తు చేస్తూ. ఆర్ఎస్ఎస్ , బిజెపి దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బియస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడం కాంగ్రెస్ ద్వంధ వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు.  

మత స్వేచ్ఛ కలిగిన సెక్యులర్ దేశంలో క్రిస్టియన్ మైనార్టీ చర్చిలను కూలగొట్టడం మైనార్టీలు, దళితులపైన ఆర్ఎస్ఎస్ , బిజెపి దాడి చేస్తే ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అప్రజాస్వామిక విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడ అవలంబిస్తుందని కాబట్టి ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హితవు పలికారు .

తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లేని పక్షంలో బాధితుల పక్షాన న్యాయం జరిగేంత వరకు క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్యు ను సన్మానించిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే


పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ చార్యులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే సన్మానించారు. ఈనెల 19న రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న కూరెళ్ళ గ్రంథాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ,జిల్లా కలెక్టర్ కు కూరెళ్ళ విఠలాచార్య మంగళవారం ఆయన చాంబర్ లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విఠలా చార్య ను సత్కరించారు.

చదువుకుని లెక్చరర్ గా ఉద్యోగం చేసిన విఠలాచార్య పుస్తకాలను కలెక్ట్ చేస్తూ.. వచ్చి ఈ రిటైర్మెంట్ తర్వాత లైబ్రరీ ని ఏర్పాటు చేశారు. పట్టదలు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ..వయసుతో సంబంధం లేదని వారు నిరూపించారు. 2024 జనవరి 25న భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిఈఓ కి వినతిపత్రం అందజేసిన పర్ల గొర్ల మోదీ రాందేవ్ యాదవ్


 భువనగిరి విద్యార్థుల సమస్యల పైన యాదాద్రి భువనగిరి జిల్లాDEO నారాయణ రెడ్డి AD ప్రశాంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందించారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ ఇయర్ ఎండింగ్ పరీక్షల టైంలో విద్యార్థులను ఫీజుల పేరుతో ప్రవేట్ స్కూల్ యజమాన్యం రక్తం తాగుతున్నరు ఫీజులు కట్టలేదని ఎండలో నిలబెడుతున్నారు ప్రవేట్ స్కూల్ యజమాన్యం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విద్యను వ్యాపారం చేయొద్దన్న ప్రవేట్ విద్యాసంస్థలు ఆ ఉత్తర్వులను పెడచెవ్విన పెట్టి ట్యూషన్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, డొనేషన్ ఫీజు, బుక్స్ ఫీజు, బస్సు ఫీజు, అని అధిక ఫీజులతో విద్యార్థుల విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తున్నారు , టెట్టు  క్వాలిఫై కానీ టీచర్లతో టీచింగ్ చెప్పిస్తున్నారు వ్యాలిడిటీ అయిపోయినటువంటి స్కూల్ బస్సులు నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు ప్రైవేట్ స్కూల్ యజమాన్యం ,  విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు సప్పులు తెచ్చే ఆత్మహత్యలు చేసుకుని ఫీజులు కడుతుంటే ప్రభుత్వ నాయకులు స్పందిస్తలేరు 2005లో హైకోర్టు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే జీవోను అమల్లోకి తెస్తలేరు ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలి  ప్రవేట్ స్కూల్ లపై ఒక కమిటీ వేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి అధిక ఫీజులపై ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి విద్యార్థుల అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు దీనిపై అధికారులు స్పందిస్తూ వారం రోజుల్లో అలాంటి స్కూల్ లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి పెయింటింగ్ కాంపిటీషన్ కు ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి విద్యార్థిని ఎం కీర్తి


యాదాద్రి భువనగిరి జిల్లా సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని బచ్ పన్ స్కూల్ లో జరిగిన పెయింటింగ్  జిల్లా స్థాయి పోటీలో వలిగొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎం కీర్తి జిల్లాస్థాయిలో తృతీయ స్థానం పొంది , రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారు . ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ఎం కీర్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ... శ్రీమతి డి మంజుల... ఉపాధ్యాయులు మల్లేష్, అంజయ్య, స్వామి రాజ్ , అర్ట్ టీచర్ రాము అభినందించారు.

వలిగొండ మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి....


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి మహేందర్ లాల్ మండలంలోని ప్రజలు కొన్ని సూచనలు ,సలహాలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, సంచరిస్తున్నట్లుగా అనుమానం కలిగితే వెంటనే... ఆ సమాచారాన్ని వలిగొండ పోలీసులకు అందజేయాలని అన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు.. మీ ఊర్లో సంచరిస్తూ ...మీ బంగారు వస్తువులకి మెరుగు దిద్దుతామంటూ.. వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. మహిళలు మరియు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ... ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆభరణాలు కనిపించకుండా, వస్త్రాలతో కప్పుకోవాలని, సైబర్ నెరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ,మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలియజేయకుండా ....తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అపరిచితుల ఆన్లైన్ లింక్స్, వెబ్సైట్ లో ,మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలిపారు.

ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్


 ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    సోమవారం రోజున డిఎం & హెచ్ఓ కార్యాలయంలో ఈ నెల 16 ఫిబ్రవరి 2024న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కు సంబంధించిన సమ్మె నోటీస్ ను డి ఈ ఓ లతో కలిసి డిఎంహెచ్ఒ డాక్టర్ ఏ పరిపూర్ణ చారీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం.స్కీమ్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనీ , ఎన్. హెచ్.ఎం.ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు అనగా డిసెంబర్, జనవరి వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 16వ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డి.హెచ్ కార్యాలయం కోటి హైదరాబాద్ వద్ద జరిగే ఒక రోజు సమ్మెలో అల్ క్యాడర్స్ ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్. హెచ్. ఎం ఉద్యోగుల క్యాలెండర్ ను డిఎంహెచ్ఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సుమంత్ కళ్యాణ్, ఏ.ఎస్.ఓ జమాల్ షరీఫ్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, డి. ఈ. ఓ లు వినోద్ కుమార్, దుర్గా, సరిత, సౌజన్య, శ్రీదేవి, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 18న వలిగొండలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టును విజయవంతం చేయండి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కార్యాలయంలోని మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం మండల అధ్యక్షులు పోలేపాక విష్ణు అధ్యక్షతన జరుగగా... ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ....ఈనెల 18వ తేదీన వలిగొండ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరుగు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులను మండల వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు .అదేవిధంగా త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టేందుకు, వారిలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని అన్నారు

చాలామంది విద్యార్థులు పరీక్షలు అనగానే భయం మొదలవుతుంది, ఆ భయంతో ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి ఈ టాలెంట్ టెస్ట్ 100% ఉపయోగపడుతుందని అన్నారు 

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్ మండల నాయకులు వేములకొండ వంశీకృష్ణ ,వేముల శివమణి ,ఎస్.కె ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు

కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలిరండి: యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం


 తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి కురుమలు అధిక సంఖ్యలో తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి డోకె బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య పిలుపునిచ్చారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు . ఫిబ్రవరి 18 న మధ్యాహ్నం రెండు గంటలకు కోకాపేట సెజ్ లో కురుమల ఆత్మగౌరవ భవనం (దొడ్డి కొమురయ్య భవన్) ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లు హాజరవుతారని వారన్నారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని కురుమ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు, షెఫర్డ్స్, కురుమ కుల పెద్దలు అధిక సంఖ్యలో హాజరై, ప్రారంభోత్సవ కార్యక్రమం ను విజయవంతం చేయాలని వారు కోరారు.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతి కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :మేడి ప్రియదర్శిని


సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.