జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్..
అనంతపురం జిల్లా
బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో, అలాగే పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ అంగన్వాడి సెంటర్స్ నందు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ నందు గౌరవ ఎంపీపీ దాసరి సునీత గారు, ఎంపీడీవో శోభారాణి గారు, డాక్టర్ స్వాతి లక్ష్మి ఎంఈఓ లింగా నాయక్, సిహెచ్ మోహన్ రావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మద్దయ్య సూపర్వైజర్ నూర్ భాషా, పీహెచ్ఎం చేన్నమ్మ, ఈవో ఆర్ డి దామోదరమ్మ, హై స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నాగరాజ్ గౌడ్, ఎస్సీ కాలనీ ప్రధానోపాధ్యాయులు కొండమ్మ గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ పిల్లలకు ఆల్బెండజోల్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, అలాగే ఎస్సీ కాలనీ నందు ఉన్న అంగన్వాడి సెంటర్ నందు మరియు ఎంపీపీ స్కూల్ నందు గౌరవ సర్పంచ్ కుమారి పార్వతి గారు ఆల్బెండజోల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మండల వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ నులి పురుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు జరుగుతున్న 15వ జాతీయ నులి పురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి, ఈరోజు ఆబ్సెంట్ అయిన పిల్లలకు 16వ తేదీ మాపప్ కార్యక్రమం ద్వారా పిల్లలకు టాబ్లెట్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు, అలాగే 12 వారాలు దాటిన గర్భవతులు తప్పనిసరిగా ఈ టాబ్లెట్ వేసుకోవాలని తెలియజేశారు మన ఆరోగ్య కేంద్ర పరిధిలో 184 మంది గర్భవతులు ఈ టాబ్లెట్లు ఈరోజు తీసుకుంటారని తెలియజేశారు. 1.నులిపురుగులు వ్యాపించు విధానం మలిన పడిన చేతి వేళ్ళు కలుషిత ఆహారము, నీరు ద్వారా, అంటూ పడిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే గోళ్ళల్లో చేరిన మట్టి ద్వారా చేతులను శుభ్రపరుచుకోకుండా ఆహారం తినటం వల్ల ఈగల ద్వారా ఆహార పదార్థాలు కలుషితం కావడం వల్ల. 2.ఈ వ్యాధి లక్షణాలు మలద్వారం చుట్టూ దురద రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన కలుగుతుంది. కడుపులో అజీర్తి కడుపునొప్పి నీరసం పోషకాహార లోపం, రక్తహీనత శారీరక పెరుగుదలలో లోపం కాళ్లు వాపులు ముఖం ఉబ్బటం నులిపురుగుల గురికాకుండా ఉండాలంటే ఈ కింది చర్యలను పాటించాలని వారు తెలియజేశారు గోర్లను వారానికి ఒకసారి చిన్నవిగా కత్తిరించుకోవడం పరిశుభ్రమైన నీటిని తాగటం ఆహార పదార్థాల పైన ఈగలువాలకుండా ఎల్లప్పుడూ మూతలు ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి మట్టిలో నడుచునప్పుడు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవాలి. ఆరుబయట మలవిసర్జన చేయరాదు ఎల్లప్పుడు మరుగుదొడ్డిని వాడాలి భోజనానికి ముందు మల విసర్జన తర్వాత ఆహారము వన్డే ముందు చేతులను రెండు నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. అలాగే చేతులను కడుక్కునే విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది చేతులు కడుక్కొని విధానాలు ఆరు భాగాలుగా ఉంటాయని వారు తెలియజేశారు. 1 అరచేతులను మరియు చేతివేళ్ల సందులో బాగా రుద్దుకోవాలి 2. రెండు చేతుల వెనుక వైపు నుండి వేళ్ళ సందులో బాగా రుద్దుకోవాలి 3. చేతి వేళ్ళు కిళ్ళు బాగా రుద్దాలి 4. రెండు చేతుల బొటనవేళ్లు బాగా రుద్దుకోవాలి 5. రెండు చేతుల మునివేలు బాగా రుద్దుకోవాలి 6. రెండు చేతుల మణికట్లు బాగా రుద్దుకొని సుబ్రమైన నీటితో కడుక్కోవాలి అలాగే ప్రతి రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఆకుకూరలు కూరగాయలు బాగా కడిగి కూరగాయల తొక్కను తీసి బాగా ఉడకబెట్టుకొని తినాలి అని వారు తెలియజేశారు ఈరోజు ఆరోగ్య కేంద్ర పరిధిలో మొత్తం 10253 మంది మాత్రలు మాత్రలు అందజేయడం జరిగింది అలాగే 12 వారాలు దాటిన గర్భవతులకు 178 మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్ అందజేయడం జరిగింది అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సూపర్వైజర్ జానీ రాజ్, అంగన్వాడీ టీచర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సచివాలయం మహిళ ఆరోగ్య కార్యకర్తలు ,హెల్త్ అసిస్టెంట్లు. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్యశాఖ తరఫున వైద్యాధికారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
Feb 14 2024, 07:08