విద్యుత్ షాక్ తో తాటి కమ్మల గుడిసె దగ్దం కావడంతో వారి కుటుంబానికి బియ్యం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు

కట్టంగూర్ లో తాటికమ్మలగుడిసే విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం అవ్వగా జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కట్టంగూర్ గాంధీనగర్ జంగాల కాలనీ లో పర్వతం సైదులు తాటి కమ్మలగుడిసె విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం ఐన విషయం తెలిసిన జిల్లా కాంగ్రెస్ యవజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ పరిశీలించి వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.వారి వెంట మాజీ వార్డ్ నెంబర్ ఏనుగు సైదులు,పర్వతం మహేష్,సిరిసల ఉపేందర్, కాలేం సైదులు, నర్సింగ్ సంతోష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

.

.

.

.

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి.
రాహుల్ హెగ్డే ఐపిఎస్, జిల్లా ఎస్పి. సూర్యాపేట జిల్లా :-
జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు,డీ ఎస్ పి నాగభూషణం, సీఐ రాజశేఖర్ లతో కలిసి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ .

గంజాయి నివారణలో జిల్లా పోలీసు పటిష్టంగా పని చేస్తుంది, పూర్తి సమాచారంతో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నాము దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణం లో తనిఖీ చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ రహదారి పై ఈనాడు ఆఫీస్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని 1.5 కేజీల గంజాయి సీజ్ చేసి  యన్.డీ.పి.ఎస్  యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయండి జరిగినది. నిందితులకు గంజాయి అమ్మడం, త్రాగటం అలవాటు ఉన్నది, గత నేర చరిత్ర కలిగి ఉన్నారు అని ఎస్పి గ అన్నారు.

గంజాయి సంబంధ కేసుల్లో ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్ పోర్టు ల విషయంలో సమస్యలు వస్తాయి. కలశాలలు వీటి పై దృష్టి పెట్టాలి అని ఎస్పి  కొరినారు.

నిందితుల వివరములు 

1. రోషన్ కుమార్ సింగ్, 2.తెలనాగి మురుగేష్, 3.మొహమ్మద్ అంజద్ పాషా.

1.5 కిలోల గంజాయి. స్వాధీనము చేసుకున్నారు.
. . .
భువనగిరి హాస్టల్ ని సందర్శించిన.బి.ఎస్.పి.నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి

భువనగిరి హాస్టల్ ని సందర్శించిన మేడి ప్రియదర్శిని

యాదాద్రి భువనగిరి:-

ఇటీవల భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ హాస్టల్ ని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని సందర్శించింది. ఆ పిల్లలిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ?, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఆరా తీసింది.అనంతరం భవ్య, వైష్ణవి తల్లితండ్రులను కలిసి వాళ్లకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ 'భవ్య , వైష్ణవి లు చనిపోవడం చాలా బాధాకరం. ఆ పిల్లలిద్దరి తల్లితండ్రుల బాధను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇదివరకే హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిలపై దాడి చేసారని తెలిసింది. వాళ్ళు ఎవరో పోలీసులు విచారించి పట్టుకోవాలి. అంతే కాకుండా హాస్టల్ లో సెక్యూరిటీ ని బాగా పెంచాలి, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే విద్యార్థులు ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల భయపడుతున్నారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి భరోసా నింపే బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత హాస్టల్ భవనాలను నిర్మించాలి' అంటూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది..

.

.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవా

బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

నల్గొండ జిల్లా:-

సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

.

.

.

నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,బచ్చుపల్లి గంగాధర్ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,బచ్చుపల్లి గంగాధర్ రావు

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన పోలగోని అంజయ్యలక్ష్మీ గౌడ్ దంపతుల ప్రధమ కుమారుడు విజయ్ గౌడ్ వివాహ మహోత్సవంలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బి.జీ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఈకార్యక్రమంలో.

గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు..

..

నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమం లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా:-

కట్టంగూర్ మండల కేంద్రంలోని బి యన్ పంక్షన్ హల్ లో జరిగిన సోమగాని శివకృష్ణ కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హజరై చిన్నారిని ఆశీర్వదించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈకార్యక్రమంలో.కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ ప్రస్తుత ఎంపీటీసీ 2 మాది యాదగిరి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బి.జి.ఆర్.ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు,మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది యాదగిరి,బూరుగు శ్రీను,మిట్టపల్లి శివ,కేవీ గౌడ్,ధార భిక్షం,గుండు పరమేష్,లింగయ్య,శేఖర్,జిల్లా యూవజన నాయకులు రెడిపల్లి స్వామి,తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

.

.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్

కట్టంగూర్ మండలం బోల్లేపల్లి ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి బామ్మరిదీ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలికేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వేట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ( బాబు),ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,టౌన్ అధ్యక్షులు చెరుకు యాదగిరి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవుగోని సాయిలు గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్,నాయకులు చెరుకు నర్సింహా,రేకల శ్రీను,తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు...

.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కే వి పి ఎస్. రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

కే వి పి ఎస్. రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా:-

సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.

ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు

వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

.

.

.

పాలడుగు నాగార్జున

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :-100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్ 10 ఫిబ్రవరి):- అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల మరియు సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రవాణా మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు..

.

బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం - సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా :-బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం

- సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా :-

రామన్నపేట, ఫిబ్రవరి 10 బోగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మేడి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ ను కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలసి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సన్మానినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేడి కృష్ణ, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, మేడి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి చింతల వెంకటేష్, కోశాధికారి మేడి నర్సింహా, సహాయ కార్యదర్శి మేడి రామలింగం, సభ్యులు మేడి నర్సింహా, మేడి మల్లేష్, చిరంజీవి, నాయకులు ఎస్కే. మోహిన్, జల్లా శ్రీనివాస్, జరుపటి రాంబాబు, బిన్.యాదవ్, బైకానీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

...