గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. బుక్కరాయసముద్రం మండలం బోయకొట్టాల గ్రామంలోని వైస్సార్సీపీ మండల కన్వీనర్ అంకె నరేష్ నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాజరైయ్యారు. నూతన గృహంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ అంకె చిన్న ముసలన్న, నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నన్ను ఆశీర్వదించండి: నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు..
నన్ను ఆశీర్వదించండి: నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు* నిరుపేద కుటుంబం వచ్చిన సామాన్య కార్యకర్తను గుర్తించి ముఖ్యమంత్రి వైస్ జగనన్న నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని, మీ అందరీ దీవెనలతో గెలిపించాలని నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు కోరారు. బుక్కరాయసముద్రం మండలంలోని చెన్నంపల్లి, రేకులకుంట, కొర్రపాడు, పసులూరు, ఏడావులపర్తి, దండువారిపల్లి, అమ్మవారిపేట, రోటరీపురం, రెడ్డిపల్లి, గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో పర్యటించారు. గ్రామాల్లోని నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, మీ అందరికీ అందుబాటులో ఉంటానని, మీ అందరి దీవెనలు కావాలని మంచి మెజారిటీతో గెలిపించాలని వారిని విన్నవించుకున్నారు. కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ఎంతో మేలు చేశారన్నారు. గత ప్రభుత్వ పాలన కంటే వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. బడుగుబాలహీన వర్గాలకు రాజకీయంగా,సంక్షేమ పరంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, వైస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంలో యువకుడి కంట్లో కారం కొట్టి నగదుతో హుడాయించిన దుండగులు..
కళ్యాణదుర్గంలో యువకుడి కంట్లో కారం కొట్టి నగదుతో హుడాయించిన దుండగులు. కళ్యాణదుర్గం పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కుందుర్పి రోడ్డు వద్ద ముస్తఫా వ్యాపార నిమిత్తం నగదుతో కళ్యాణదుర్గంకు వస్తుండగా కంట్లో కారం కొట్టి 21,400 రూపాయలు నగదుతో హుడాయించిన దుండగులు. స్థానికుల సహాయంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. కళ్యాణదుర్గం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన ముస్తఫా, వ్యాపార నిమిత్తం పొరుగురికి వెళ్లి కళ్యాణదుర్గంకు వస్తున్న క్రమంలో, పట్టణ శివారులో మాటు వేసిన దుండగులు, ముస్తఫా కంట్లో కారం కొట్టి అతని వద్దనుండి 21,400 రూపాయల నగదుతో ఉడాయించారని, స్థానికుల సహాయంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు. కళ్యాణదుర్గం పట్టణంలో రోజురోజుకీ దొంగతనాలు , దోపిడీలు ఎక్కువవుతున్న దొంగలను కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతలో అర్ధరాత్రి అరాచకం. పశువుల షెడ్డు కు నిప్పు.. మంటల్లో ఒక ఎద్దు సజీవ దహనం..
అనంతలో అర్ధరాత్రి అరాచకం. పశువుల షెడ్డు కు నిప్పు.. మంటల్లో ఒక ఎద్దు సజీవ దహనం.

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీలో అర్ధరాత్రి అరాచకం చోటుచేసుకుంది. జయచంద్ర అనే రైతు పశువుల పాకకు అర్ధ రాత్రి దుండగులు నిప్పు పెట్టడంతో మంటల్లో ఒక ఎద్దు సజీవ దహనం కాగా మంటల్లో నుంచి మరో ఎద్దు తప్పించుకుంది. 10 ట్రాక్టర్ల పశుగ్రాసంతో పాటు, కోళ్ల షెడ్డు పూర్తిగా కాలిపోయిన‌ వైనం దాదాపుగా మంటల్లో రూ.10 లక్షలు ఆస్థి నష్టం వాళ్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాయిస్ ఓవర్ : రైతు జయచంద్ర వ్యవసాయమే జీవనాదారం పశువులను మేపుకుంటు, కోళ్లను పెంచుకుంటున్నారు అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పశువుల పాకకు నిప్పు పెట్టారు. రైతు మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన మంటల్లో ఒక ఎద్దు మృత్యువాత పడింది.మరో ఎద్దు మంటల నుండి తప్పించుకుంది.జయచంద్ర కుమారుడు ప్రవీణ్ వాటి పోషణ చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటు జీవనాధారం పొందుతున్నారు. ప్రవీణ్ కు ముగ్గురు కూతుళ్లు,ఒక కుమారుడు లను వ్యవసాయం లో వచ్చే డబ్బు తో కుటుంబ పోషణ ,పిల్లల చదువులు చెప్పిస్తూ ఉన్నాడు. అగ్నిప్రమాదంలో ఎద్దు,షెడ్లు,పశుగ్రాసం మొత్తం మంటల్లో అగ్నికి ఆహుతయ్యని ఆవేదన చెందుతున్నారు. రైతు జయచంద్ర, ప్రవీణ్ లు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో, అలాగే పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ అంగన్వాడి సెంటర్స్ నందు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో ఆఫీస్ దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ నందు గౌరవ ఎంపీపీ దాసరి సునీత గారు, ఎంపీడీవో శోభారాణి గారు, డాక్టర్ స్వాతి లక్ష్మి ఎంఈఓ లింగా నాయక్, సిహెచ్ మోహన్ రావు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మద్దయ్య సూపర్వైజర్ నూర్ భాషా, పీహెచ్ఎం చేన్నమ్మ, ఈవో ఆర్ డి దామోదరమ్మ, హై స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నాగరాజ్ గౌడ్, ఎస్సీ కాలనీ ప్రధానోపాధ్యాయులు కొండమ్మ గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ పిల్లలకు ఆల్బెండజోల్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, అలాగే ఎస్సీ కాలనీ నందు ఉన్న అంగన్వాడి సెంటర్ నందు మరియు ఎంపీపీ స్కూల్ నందు గౌరవ సర్పంచ్ కుమారి పార్వతి గారు ఆల్బెండజోల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మండల వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ నులి పురుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు జరుగుతున్న 15వ జాతీయ నులి పురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి, ఈరోజు ఆబ్సెంట్ అయిన పిల్లలకు 16వ తేదీ మాపప్ కార్యక్రమం ద్వారా పిల్లలకు టాబ్లెట్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు, అలాగే 12 వారాలు దాటిన గర్భవతులు తప్పనిసరిగా ఈ టాబ్లెట్ వేసుకోవాలని తెలియజేశారు మన ఆరోగ్య కేంద్ర పరిధిలో 184 మంది గర్భవతులు ఈ టాబ్లెట్లు ఈరోజు తీసుకుంటారని తెలియజేశారు. 1.నులిపురుగులు వ్యాపించు విధానం మలిన పడిన చేతి వేళ్ళు కలుషిత ఆహారము, నీరు ద్వారా, అంటూ పడిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే గోళ్ళల్లో చేరిన మట్టి ద్వారా చేతులను శుభ్రపరుచుకోకుండా ఆహారం తినటం వల్ల ఈగల ద్వారా ఆహార పదార్థాలు కలుషితం కావడం వల్ల. 2.ఈ వ్యాధి లక్షణాలు మలద్వారం చుట్టూ దురద రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన కలుగుతుంది. కడుపులో అజీర్తి కడుపునొప్పి నీరసం పోషకాహార లోపం, రక్తహీనత శారీరక పెరుగుదలలో లోపం కాళ్లు వాపులు ముఖం ఉబ్బటం నులిపురుగుల గురికాకుండా ఉండాలంటే ఈ కింది చర్యలను పాటించాలని వారు తెలియజేశారు గోర్లను వారానికి ఒకసారి చిన్నవిగా కత్తిరించుకోవడం పరిశుభ్రమైన నీటిని తాగటం ఆహార పదార్థాల పైన ఈగలువాలకుండా ఎల్లప్పుడూ మూతలు ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి మట్టిలో నడుచునప్పుడు మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవాలి. ఆరుబయట మలవిసర్జన చేయరాదు ఎల్లప్పుడు మరుగుదొడ్డిని వాడాలి భోజనానికి ముందు మల విసర్జన తర్వాత ఆహారము వన్డే ముందు చేతులను రెండు నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. అలాగే చేతులను కడుక్కునే విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది చేతులు కడుక్కొని విధానాలు ఆరు భాగాలుగా ఉంటాయని వారు తెలియజేశారు. 1 అరచేతులను మరియు చేతివేళ్ల సందులో బాగా రుద్దుకోవాలి 2. రెండు చేతుల వెనుక వైపు నుండి వేళ్ళ సందులో బాగా రుద్దుకోవాలి 3. చేతి వేళ్ళు కిళ్ళు బాగా రుద్దాలి 4. రెండు చేతుల బొటనవేళ్లు బాగా రుద్దుకోవాలి 5. రెండు చేతుల మునివేలు బాగా రుద్దుకోవాలి 6. రెండు చేతుల మణికట్లు బాగా రుద్దుకొని సుబ్రమైన నీటితో కడుక్కోవాలి అలాగే ప్రతి రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఆకుకూరలు కూరగాయలు బాగా కడిగి కూరగాయల తొక్కను తీసి బాగా ఉడకబెట్టుకొని తినాలి అని వారు తెలియజేశారు ఈరోజు ఆరోగ్య కేంద్ర పరిధిలో మొత్తం 10253 మంది మాత్రలు మాత్రలు అందజేయడం జరిగింది అలాగే 12 వారాలు దాటిన గర్భవతులకు 178 మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్ అందజేయడం జరిగింది అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సూపర్వైజర్ జానీ రాజ్, అంగన్వాడీ టీచర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సచివాలయం మహిళ ఆరోగ్య కార్యకర్తలు ,హెల్త్ అసిస్టెంట్లు. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్యశాఖ తరఫున వైద్యాధికారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
మత సామరస్యానికి ప్రతీక మసూద్ గాజి దర్గా దర్శించుకున్న.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు..
మత సామరస్యానికి ప్రతీక మసూద్ గాజి దర్గా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు   పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు శింగనమల మండల కేంద్రంలో వెలసిన హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మండల కేంద్రంలో హజరత్ మసూద్ గాజి ఉరుసు ఘనంగా నిర్వహించారు. పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు దర్గా చేరుకుని గాజి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శి నూర్ మహమ్మద్ ఇంటి దగ్గర నుంచి చక్కెర, పూలతో ఊరేగింపుగా వెళ్లారు. దర్గాలో చదివింపులు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ ముస్లింలు కలిసి పెద్ద పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
టీడీపీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..
టీడీపీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోనీ నిరుపేద టీడీపీ కార్యకర్త నాగరాజు గారి తల్లి దహనసంస్కరణ ఖర్చులకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమిరెడ్డి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ మల్లికార్జున, వడ్డే అంజి, గోపాల్, మూర్తి, రవి, తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత గారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కొర్రపాడు నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ను శ్రీమతి D.సునీత MPP అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశం లో అనంతపురం జిల్లా నుండి మందులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కొర్ర పాడు నకు తీసుకురావడానికి అగు రవాణా ఖర్చు గురించి, అలాగే ల్యాబ్ నందు పరీక్షలకు సంబందించిన పరికరాలు గురించి, మొదలగు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అమోదం జరిగినది. అలాగే గ్రామ నాయకులు శ్రీ D. విజయ భాస్కర్ రెడ్డి వారు ఆసుపత్రి పనితీరును ప్రశంసిస్తూ ఆసుపత్రి కి అవసరమగు NS 100 ml బాటిల్స్ ను స్వచ్చంగా ఇవ్వడం జరిగినది.అలాగే శ్రీమతి D.సునీత గారు,గ్రామ నాయకులు D. విజయ భాస్కర్ రెడ్డి గారు తో ఈ నెల 9 వ తేదీన జరుగు జాతీయ నులిపురుగుల కార్య క్రమం పోస్టర్స్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా.D.ఇందిరా ప్రియదర్శిని,డా.R.వినోద్ కుమార్,అలాగే గ్రామ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి గారు, T.మోహన్ బాబు CHO, M. పర్వీన్ HE, సూపర్ వైజర్ లు శ్రీదేవి,కేసవయ్య, స్టాఫ్ నర్స్ మంజుల, ఫార్మసీస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ కరుణాకర్, ఆరోగ్య కార్య కర్తలు రమేష్, రామలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు
వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరం కృషి చేద్దాం  నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు ◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి..
వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరం కృషి చేద్దాం  నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు ◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి . ◆ పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య. రానున్న ఎన్నికల్లో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు అన్నారు. గార్లదిన్నె మండల కేంద్రం, జంబులదిన్నె, ఓబుళాపురం, పాపినేపాళ్యం, గుడ్డాలపల్లి, సిరివరం, కల్లూరు, ఇల్లూరు గ్రామాల్లో ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరిస్తూ, జగనన్న మాత్రమే పేదల పక్షపాతి అని, ఈ సంక్షేమం కొనసాగాలంటే అది ఆయన వల్లే సాధ్యం అని వారికి వివరించారు. ఎం. వీరాంజినేయులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధే జగనన్న సంకల్పం అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. ఇలాంటి సంక్షేమ పాలన మళ్లీ మనకి అందాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking.... 6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం...
Breaking..

6,100 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి ప్రభుత్వం... SGT - 2,280, School Assistant - 2,299, TGT - 1,264, PGT - 215, Principal - 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 12 నుండి DSC ప్రక్రియ ప్రారంభం... ఏప్రిల్ 7 న ఫలితాలు... ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన మంత్రి బొత్స .. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ .. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం. ఎస్‌జీటీ-2280, స్కూల్‌ అసిస్టెంట్స్‌-2299 పోస్టులు, టీజీటీ-1264, పీజీటీ-215, ప్రిన్సిపాల్ పోస్టులు-42. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తాం-మంత్రి బొత్స..