madagoni surendar

Feb 11 2024, 15:11

నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్

కట్టంగూర్ మండలం బోల్లేపల్లి ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి బామ్మరిదీ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలికేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వేట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ( బాబు),ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,టౌన్ అధ్యక్షులు చెరుకు యాదగిరి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవుగోని సాయిలు గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్,నాయకులు చెరుకు నర్సింహా,రేకల శ్రీను,తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు...

.

madagoni surendar

Feb 11 2024, 10:46

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కే వి పి ఎస్. రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

కే వి పి ఎస్. రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా:-

సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.

ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు

వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

.

.

.

పాలడుగు నాగార్జున

madagoni surendar

Feb 10 2024, 21:10

100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :-100 నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్ 10 ఫిబ్రవరి):- అంబేద్కర్ విగ్రహం వద్ద 100 నూతన ఆర్టీసీ బస్సులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఇతర మంత్రులు, ఎమ్మెల్యే ల తో లిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల మరియు సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రవాణా మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు..

.

madagoni surendar

Feb 10 2024, 19:25

బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం - సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా :-బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం

- సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా :-

రామన్నపేట, ఫిబ్రవరి 10 బోగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మేడి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ ను కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలసి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సన్మానినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేడి కృష్ణ, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, మేడి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి చింతల వెంకటేష్, కోశాధికారి మేడి నర్సింహా, సహాయ కార్యదర్శి మేడి రామలింగం, సభ్యులు మేడి నర్సింహా, మేడి మల్లేష్, చిరంజీవి, నాయకులు ఎస్కే. మోహిన్, జల్లా శ్రీనివాస్, జరుపటి రాంబాబు, బిన్.యాదవ్, బైకానీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

...

madagoni surendar

Feb 10 2024, 18:10

గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం

సూర్యాపేట జిల్లా :-గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం

సూర్యాపేట జిల్లా :-

గరిడేపల్లి మండలం,కల్మలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సర్వారం గ్రామంలో గత కొద్దీ రోజులుగా విష జ్వరం కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా శనివారం రోజు సూర్యాపేట జిల్లా మెడికల్ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్ తో కలిసి సర్వారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 74 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగ్యూ వ్యాధిగా నిర్ధారణ అయింది అని డాక్టర్ సింహచలం చెప్పారు.మరియు గ్రామంలో మురికినీటి కాల్వలను మరియు వాటర్ ట్యాంక్ గేట్ వాల్వును ను పరిశీలించారు ముఖ్యంగా డ్రైనేజీలలో త్రాగు నీటి పైపులు మురికి కాలువలలో మునిగి ఉండి నీరు కలుషితం అయ్యి మరియు కాలువలలో మురికి నీరు నిలువ ఉండడం వలన దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు పారిశుధ్య లోపం లోపించింది అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత మరియు వ్యాధులపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.గరిడేపల్లి గ్రామంలో జ్వరాలు తగ్గేవరకు మెడికల్ క్యాంపును కొనసాగించాలని వైద్యాధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ శృతి, మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు ,హెచ్ ఇ ఓ రామకృష్ణ,సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, గ్రామ సె క్రటరీ బాలాజీ, ఏఎన్ఎం అనిత, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.

madagoni surendar

Feb 10 2024, 16:39

పొదుపు సంఘాల మహిళల డబ్బు బ్యాంకులో బలవంతంగా డిపాజిట్ ఎందుకు.

పొదుపు సంఘాల మహిళల డబ్బు బ్యాంకులో బలవంతంగా డిపాజిట్ ఎందుకు

పావలా వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు

ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.

పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

నల్గొండ జిల్లా:-

పొదుపు సంఘాల మహిళల సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈ రోజు నల్గొండ లోని దొడ్డి కొమురయ్య భవనంలో మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం చేనబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు పైసా పైసా కూడబెట్టి దినదినం అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తుంటే బ్యాంకులో బలవంతంగా డిపాజిట్లు చేయించడం ఏమిటని ? వెంటనే డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వకపోగా అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామన్న ప్రభుత్వాలు పొదుపు సంఘ మహిళల సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పొదుపు మహిళల పిల్లలకు స్కాలర్షిప్స్ సౌకర్యం గతంలో ఇచ్చేదని నేడు అది లేదని వెంటనే స్కాలర్షిప్ మంజూరు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సమ భావన సంఘాలకు బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నెలకొల్పారని మంచి నీరైన దొరకడం లేదు కానీ బ్రాండ్ విస్కీలు దొరుకుతున్నాయని అన్నార. జిల్లా వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి బెల్ట్ షాపులు రద్దు అయ్యేవరకు పోరాడతామన్నారు. మునుగోడు తరహాలో బెల్ట్ షాపులను రద్దు చేయాలని, ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై అనేక పద్ధతులలో దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు మద్యం గంజాయి ట్రక్స్ నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఐద్వా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ ,జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ,భూతం అరుణ,కుమారి పాదురి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యులు చనగని సైదామ్మ,గోలి వెంకటమ్మ,ఎండి సుల్తానా,తంగెళ్ళ నాగమణి,బూరుగు కృష్ణవేణి,కడకంచి అందాలు, తదితరులు పాల్గొన్నారు.

.

ఐద్వా జిల్లా కార్యదర్శి.

madagoni surendar

Feb 10 2024, 11:03

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు. బస్సు కండక్టర్ పై దాడి. చెప్పు తీసుకొని చంపలు వాయించిన మహిళ.

రంగారెడ్డి జిల్లా :-

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు.

బస్సు కండక్టర్ పై దాడి. చెప్పు తీసుకొని చంపలు వాయించిన మహిళ.

అడిగిన చోట బస్సు నిలుపలేదని ఆరోపిస్తూ కండక్టర్ ను విచక్షణారహితంగా చెప్పు తో కొట్టిన వైనం.

దుర్భాషలాడుతూ దాడి. ‌మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఘటన.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లి కి చెందిన ప్రసన్న గా గుర్తింపు.

madagoni surendar

Feb 10 2024, 10:59

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

ఢిల్లీ:-నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ..

చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే

స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్

రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ..

madagoni surendar

Feb 09 2024, 20:43

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి.

.

నల్గొండ జిల్లా:-

టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి శ్రీనివాస్ ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు.ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా ఇంచార్జీ గా నియమించినందుకు ఫౌండర్ ప్రెసిడెంట్ యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత సంఘాల, దళిత్ జాతి కోసం తన వంతు సేవ చేస్తానని అన్నారు.

.

madagoni surendar

Feb 09 2024, 10:11

తెలంగాణ మూడవ అసెంబ్లీ రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

తెలంగాణ మూడవ అసెంబ్లీ

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ

ప్రభుత్వ సమాధానం ఉండనుంది.

శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరుస్తారు.

మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, బి మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.

అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం cm రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు.

గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను....

తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉపసభల ముందు టేబుల్ చేస్తారు.

రేపు శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం.

అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం కానుంది.

బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక ఇచ్చింది.

విజిలెన్స్ నివేదికపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ ఆలోచన.

న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది

రిటైర్డ్ జస్టిస్ చే విచారణ చేయించాలని సర్కార్ ఆలోచన.

ఇలాంటి విషయాలపై కేబినేట్​లో చర్చించే అవకాశం.

వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.