ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి
సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.
కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆనాడు స్వతంత్ర జడ్పిటిసి గా గెలుపొంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి ని అన్నారు..
2009లో లీటర్ పెట్రోల్ తీసుకుని ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టె తీసుకొలేని ఉద్యమ నాయకుడు హరీష్ రావు ని ఎద్దేవ చేశారు..తెలంగాణ కోసం అసలైన ఆత్మ బలిదానం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతా చారి అని మరొకసారి గుర్తు చేశారు..
డ్రామాలు అంటేనే కెసిఆర్ కుటుంబమని, సినీ నటుల కంటే గొప్ప నటులు కెసిఆర్,హరీష్ రావు అని అన్నారు...
అలాగే మా నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు..
బిఆర్ఎస్ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు..
గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో దొంగ పాలన చేసినందుకు ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి ని ప్రజలు మెచ్చుకుంటున్నారని, దీనిని జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు..అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేశామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు..అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు..
...
ఈ కార్యక్రమంలో
బట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరరావు, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ, మండల కార్యదర్శి షేక్ రఫీ, మండల నాయకులు దంచనాల రాజేంద్రప్రసాద్, నరసింహారావు, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు..
Feb 06 2024, 12:51