NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పండ్ల మొక్కలు నాటిన అధ్యాపకులు
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం కొన్ని రకాల పండ్ల చెట్లను కళాశాల అధ్యాపకులు నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. కళాశాలలో కొన్ని రకాలైన పండ్ల చెట్లను నాటడం జరిగిందని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని తెలిపారు.
గతంలో కళాశాలలో ఉడుతలు గాని పక్షులు గాని కనిపించకుండా ఉండేది. ఈ మధ్య కాలంలో కళాశాలలో పిచ్చుకలకు, ఉడుతలకు ఆహార పదార్థాలు తినేందుకు, నీరు తాగేటందుకు వీలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని మనము ఈ విధంగా కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు రవిచంద్ర, డాక్టర్ రాజారామ్, కళాశాల సూపరింటెండెంట్ జ్యోతి, రమేష్, యాదగిరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.











నల్గొండ: పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ సెలక్షన్లలో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన క్రీడాకారులు.. అండర్ 10 విభాగంలో బొమ్మపాల సాయి శివ, మరియు అండర్ 12 విభాగంలో జాకటి చరణ్ ప్రీత్ లు ఇద్దరూ ప్రథమ స్థానం పొందారని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.



























Jan 29 2024, 21:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k