చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి
చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి
చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నల్లగొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనగణలో కులగనని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలందర ఫిబ్రవరి 5 6 తేదీల్లో చలో ఢిల్లీ ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం సభ్యులతోపాటు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ నాగుల వేణు యాదవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా మహిళా కార్యదర్శి కంభంపాటి దుర్గ దుడుకు తిరుపతయ్య పగిళ్ల కృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్ల కీర్తి శ్రీనివాస్, సదాశివ రుదిగామ స్వామి గంజి రాజేందర్ గంజి రంగనాయకులు ఖమ్మంపాటి కనకయ్య మునాస నాగరాజు తాడిమనీల్ కుమార్ అంబటి రాజశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Jan 29 2024, 20:15