హై టెన్షన్ తెర దింపిన జగనన్న.. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు..
జగనన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...
సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు(మాదిగ)సామాజిక సమీకరణలో భాగంగా.. శింగణమల మండలం సి. బండమీద పల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు(మాదిగ)ను సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఎమ్మెల్యే దంపతుల సహకారంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన సమన్వయకర్త ఎంపిక.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పును స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యం. వీరాంనేజియులను జగనన్న సమన్వయకర్తగా నియమించడం హర్షిస్తున్నామన్నారు. సమన్వయకర్తగా నియమించిన యం.వీరాంనేజియులుకు సహకరిస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
సమన్వయకర్తగా ఎంపిక చేసిన జగనన్నకు రుణపడి ఉంటాము: యం. వీరాంజినేయులు (మాదిగ)*
సామాజిక సమీకరణలో భాగంగా శింగణమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనను ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వం విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేస్తానన్నారు.
తనను సమన్వయకర్తగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Jan 19 2024, 06:50