ఖమ్మం: కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి..
ఖమ్మం:
కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి..
బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు కార్మికులు..
నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
మరింత సమాచారం తెలియాల్సి ఉంది
NLG: బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు ఆధ్వర్యంలో నూతన నియోజకవర్గ కమిటీలు
నల్లగొండ జిల్లా:
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ మరియు మిర్యాలగూడ నియోజకవర్గాలలో బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు ముఖ్యఅతిధి గా పాల్గొని రెండు నియోజకవర్గాలలో నూతన నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యేకుల రాజారావు మాట్లాడుతూ.. అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, బూత్ లెవెల్ కమిటీ నిర్మాణాలే ప్రామాణికం అని నాయకులకువివరించారు.
అలాగే జన కళ్యాణ్ దివాస్ గురుంచి పూర్తిగా వివరించి వారికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. రెండు నియోజకవర్గాల పట్టభద్రులు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల కాన్షిరాం, జిల్లా కోశాధికారి గండు నాగేంద్రబాబు, నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్ ,పుట్టల దినేష్ నల్లగొండ మరియు మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు, మండలాల నాయకులు, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.
NLG: మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దు: ఎస్పీ
నల్లగొండ: మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లను మెసేజ్ లను క్లిక్ చేసి మోసపోవద్దు అని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు.
TS: నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా:
నల్లగొండ మున్సిపాలిటీ ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి బుధవారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, శంకుస్థాపన చేశారు.
తర్వాత NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కు పలు సూచనలు చేశారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, యుపిఎస్సి తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు.
సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
NLG: ప్రజాహితం కోసమే సమాచార హక్కు వికాస సమితి: యర్రమాద కృష్ణారెడ్డి
నల్లగొండ: ఆర్డీవో కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని మండిపడ్డారు.మౌలిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇది నాగాలాండ్ ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
TS: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు...RRR పనులకు చర్యలు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మరో మణిహారం రానుంది, అదే RRR. ప్రాంతీయ రింగురోడ్డు (RRR) పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. RRR కోసం భూసేకరణను మూడు నెలలలో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణతో పాటు RRR ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలవాలని, దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని NHAI ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణభాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.
TS: జనవరి 20న పాస్‌పోర్ట్ అదాలత్
జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు.
సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్ జరగనున్నట్లు చెప్పారు.
వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు.
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
దరఖాస్తుదారులు ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
TS: అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్..
అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసిసి....
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరీ వెంకట్ పేర్లు ఖరారు....
అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్...
నిన్నటి వరకు ఎమ్మెల్సీ జాబితాలో అద్దంకి దయాకర్...
దయాకర్ స్థానంలో మహేష్ గౌడ్ పేరు....
Jan 18 2024, 21:03