బుక్కరాయసముద్రం గ్రామంలోని జగనన్న లే అవుట్ 6 లో 47వీధి దీపాలు వెలిగేనా.. సిపిఎం
విద్యుత్ కనెక్షన్ పై అవగాహన ఉన్న అధికారులేనా ! వీధి దీపాలు వేసింది 70 కు పైగావెలుగుతున్నవి 23* *వెలగనివి 47* *వృత్తి నైపుణ్యం అంటే ఇదేనేమో* *కరెంట్ లేని లైన్ లకు వీధి దీపాల కనెక్షన్ ఇస్తే వెలుగుతాయా* *స్తంభం నెంబర్ 173 నుండి 172,171,170 వరకు ఉన్న స్తంభాలకు కాసారాలకు పింగాణీ లేక వైర్లు వేలాడుతున్న పట్టని అధికారులు.* *విద్యుత్ అధికారుల వైఫల్యమా* *పంచాయితీ నిర్వహణ వైఫల్యమా* *మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామపంచాయితీ పరిధిలో లేఅవుట్ నెంబర్ 6 లో దాదాపు 800 కు పైగా ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. ఇల్ల నిర్మాణాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వము ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తున్నది.* *అందులో భాగంగా లేఅవుట్ నంబర్ 6 నందు నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి దాదాపు 150 పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.* *వీటికి పంచాయతీ వీధి దీపాలను ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా అయింది.* *వీధిదీపాలలో 47 కు పైగా వెలగని పరిస్థితిలో ఉన్నాయి.* *కారణం విద్యుత్ అధికారులు పంచాయితీ అధికారుల వైఫల్యమా, విద్యుత్ అధికారుల వైఫల్యమా? ఎవరనేది తెలియక ప్రజలు రాత్రి పూట వెలుగులు చూడలేక పోతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి నాలుగు ఫేస్ కనెక్షన్లు ఒక న్యూటన్ లైన్లతో ఏర్పాటు చేశారు.* *ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు ఫేసులకు మాత్రమే కనెక్షన్ ఇచ్చారు.* *ఒక ఫేసుకి కనెక్షన్ ఇవ్వకపోవడం వాటికే వీధి దీపాల కనెక్షన్ ఇవ్వడం అధికారుల పని తీరు శహబాస్ అవురా అని ముక్కున వేలేసుకుంటున్నారు. వీథి దీపాల వెలగకపోవడానికి కారణాలు దొరకడం లేదు.* *విద్యుత్ అధికారులు నాలుగో ఫేస్ కూడా విద్యుత్ కనెక్షన్ ఇస్తే తప్ప ఆ వీధి దీపాలు వెలగవు.* *మొత్తం వీధి దీపాలన్నీ నిత్యము వెలగడం కూడా జరుగుతుంది.* *ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల పంచాయితీకి వీధిదీపాల విద్యుత్ కరెంటు భారంగా మారుతుంది.* *అలాగే 173, 174 స్తంభాల దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుండి తూర్పు వైపున 172,171,170 స్తంభాల మధ్య కాసారాలపై ఉండాల్సిన పింగాణి లేకపోవడం వల్ల విద్యుత్తు లైన్లో క్రింద వేలాడుతున్నాయి. ఈ విషయమై సిపిఎం మండల నాయకులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరం.* *283 స్తంభం కు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ ఉన్న ఇళ్లకు స్తంభాలకు తీగలు లాగ లేదు. దీనివల్ల ఇల్లు నిర్మించుకుంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.* *తక్షణం గ్రామ పంచాయితీ అధికారులు స్పందించి విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని వీధి దీపాలు వెలిగేటట్లు, పింగాణీలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించాలని 283 స్తంభం కు ఏర్పాటు చేసిన నాలుగోవ ట్రాన్స్ఫార్మర్ వద్ద నుండి మిగిలిన అన్ని సందులకు విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్. కుళ్ళాయప్ప కోరారు.*
Jan 17 2024, 17:09