కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరణ..
డిజిపి ఆఫీసు మంగళగిరి నందు రాష్ట్ర పోలీసు సంఘం EC మెంబర్ మరియు అనంతపురం 14వ బెటాలియన్ ప్రెసిడెంట్ పెద్దయ్య శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరించటం జరిగింది
ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది కి రావాల్సిన సరెండర్స్, టి.ఎ లు ప్రభుత్వం తో మాట్లాడి వేయిస్తాము అని చెప్పుతూ పోలీసు సిబ్బంది సమస్యలు గురించి రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం రిప్రెంజెంటేషన్ ఇవ్వగా వెంటనే వాటి పరిష్కారానికి పైస్థాయి అధికారుల కమిటీ వేయటం జరిగింది
ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు కూడా ప్రభుత్వానికి పంపించి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది గౌరవ డిజిపి గారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
Jan 17 2024, 12:19