Anantapur

Jan 17 2024, 07:37

ఆదర్శ కవికి ఆత్మీయ సన్మానం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ

ఆదర్శ కవి ఎన్నో అవార్డులు గెలుచుకున్న అవార్డు గ్రహీత

మన నార్పల మండల నివాసి శ్రీ వల్లెపు వెంకట సాయినాథ్ గారికి గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్

శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు

ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది

Anantapur

Jan 17 2024, 07:18

గుడి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం

సిద్దారంపురం గ్రామంలో నూతనంగా సొంత ఖర్చుతో నిర్మిస్తున్న

శ్రీ విశాలాక్షి అమ్మవారి గుడి నిర్మాణ పనులను పరిశీలించిన

జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

Anantapur

Jan 14 2024, 09:44

ముగిసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం.. క్రికెట్ ఫైనల్ లో సచివాలయం వన్ 35 పరుగులు తేడాతో ఘనవిజయం
ఆడుదాం ఆంధ్ర కోకో, వాలీబాల్, కబడ్డీ, బాడ్మింటన్, పురుషుల, మహిళల బుక్కరాయసముద్రంమండల స్థాయి ఆటల పోటీల సందర్భంగా ఈరోజు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ బి.కే.ఎస్-1, బి.కే.ఎస్-4 జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి గ్రామ సర్పంచ్ పార్వతి, నీలం భాస్కర్ జెడ్పిటిసి, ముఖ్య అతిథులుగా తెజ్యోష్ణ ఎంపిడిఓ, లక్ష్మీనారాయణ ఎంపీటీసీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ స్థాయి నుండి నిర్వహించిందని దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను వెలుపలకు తీసి రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లి తదుపరి శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగేటట్లు చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి సజావుగా జరిగేటట్లు చూడాలని ఓటమి అయినా గెలుపైన సమానంగా స్వీకరించాలని ఇరుజట్లకు క్రీడాభినందనలు తెలియజేసి రాష్ట్రస్థాయి పోటీలలో కూడా బుక్కరాయసముద్రం మండలం పేరు వినబడేటట్లు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. BKS-1 V/S BKS-4 సచివాలయాల మధ్య జరిగిన ఫైనల్ పోటీలలో ముందుగా టాస్ గెలిచి బికేస్-4 జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బి కే ఎస్-1 జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 రన్లు చేసింది. తరువాత బ్యాటింగ్ చేపట్టిన బి కే ఎస్-4 జట్టు 10 ఓవర్లు పూర్తి అయ్యేటప్పటికీ ఏడు వికెట్లు కోల్పోయి 72 రన్నులు మాత్రమే చేసింది .బి కేఎస్-1 35పరుగులతో విజయం సాధించింది . జనవరి 23 నుండి నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బి కే యస్-1 అర్హత సాధించింది.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేష్ పంచాయితీ సెక్రటరీలు సాదిక్, మల్లికార్జున. సువర్ణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 13 2024, 06:45

పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.. రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..

పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.... రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈరోజు ఉదయం వ్యవసాయ కార్యాల యం లో శ్రీ పెద్ద కొండయ్య అధ్యక్ష్యతన జరిగినది.

ఈ సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ 2 పశువులు ఉన్న రైతులకు ఒక లక్ష రూపాయలు 4 పశువులు ఉన్న రైతులకు 1.5లక్ష రూపాయలు యస్సి ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ వర్తిస్తుందని పశుస oవర్ధక కార్యాలయం ద్వారా సబ్సిడీ పై సరఫరా చేయుచున్న షెడ్లను ఆసక్తి అనువైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసారు.

అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య గారు మాట్లాడుతూ రైతులందరు రబి పంట నమోదు చేసుకోవాలని తెలియజేసారు.ఎ డి ఎ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటికే 128 మంది దరఖాస్తు చేసుకున్నారని రైతు దరఖాస్తు లను పరిశీలన చేసి ఆమోద్యాయోగమైన దరఖాస్థులను ఉన్నతధికారులకు పంపేదమని తెలియజేసారు. వ్యవసాయధికారి మాట్లాడుతూ పి యం కిసాన్ నిధులు 16వ విడత ఈ నెలలో విడుదల చేస్తారని 52 మంది రైతులు ekyc చేయుంచుకొని వారు ఉన్నారని మరియు NPCI లింక్ కానీ రైతులు 90 మంది ఉన్నారని రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు వారికి తెలియజేసారని ekyc NPCI చేయుంచుకొంటేనే డబ్బులు జమ అవుతాయని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో miao హరిత, రేకులకుంట లక్ష్మీనారాయణ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు. ఇట్లు యం. శ్యాం సుందర్ రెడ్డి మండల వ్యవసాయధికారి, బుక్కరాయసముద్రం మండలము.

Anantapur

Jan 13 2024, 06:36

కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరణ..

డిజిపి ఆఫీసు మంగళగిరి నందు రాష్ట్ర పోలీసు సంఘం EC మెంబర్ మరియు అనంతపురం 14వ బెటాలియన్ ప్రెసిడెంట్ పెద్దయ్య శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరించటం జరిగింది

ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది కి రావాల్సిన సరెండర్స్, టి.ఎ లు ప్రభుత్వం తో మాట్లాడి వేయిస్తాము అని చెప్పుతూ పోలీసు సిబ్బంది సమస్యలు గురించి రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం రిప్రెంజెంటేషన్ ఇవ్వగా వెంటనే వాటి పరిష్కారానికి పైస్థాయి అధికారుల కమిటీ వేయటం జరిగింది

ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు కూడా ప్రభుత్వానికి పంపించి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది గౌరవ డిజిపి గారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Anantapur

Jan 12 2024, 14:29

టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉండి 10వేల రూ.లు ఆర్థికసాయం చేసిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి..

టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతు పావని హాస్పిటల్ నందు చికత్స పొందుతున్న

టీడీపీ కార్యకర్త బండారు వెంకటకొండయ్య గారికి ₹10000/- రూ.లు ఆర్థికసాయం చేసినా జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Anantapur

Jan 12 2024, 07:03

LCDC ప్రోగ్రామ్( లెప్రోసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) తనిఖీ చేసిన..జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా లెప్రసి ఆఫీసర్ అనుపమ జేమ్స్

పట్టణ ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రం ను లెప్రోసి జాయింట్ డైరెక్టర్ దేవసాగర్ గారు,మరియు జిల్లా లెప్రసి ఆఫీసర్ అనుపమ జేమ్స్ గారు, డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు LCDC ప్రోగ్రామ్( లెప్రోసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) ను తనిఖీ చేశారు.

Leprosy Cases records ను మరియు పేషంట్స్ వివరాలను phc డాక్టర్ Dr. Swathi Laxmi మేడం గారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా LCDC action plan ప్రకారము కార్యక్రమం ఎలా జరుగుచున్నది అడిగి తెలుసు కున్నరు.

ఈ. కార్యక్రమము క్రింద అనుమానముగా గుర్తించిన leprosy cases వివరాలను తెలుసుకొన్నారు. కచ్చితంగా గుర్తించిన leprosy cases వివరాలను తెలుసుకొన్నారు. అశాల ద్వారా ప్రతి రోజూ survey చేసిన reports ను, మరియు ప్రతి రోజూ phc ద్వారా జిల్లా కు పంపే దిన రిపోర్ట్స్ ను పరిశీలించారు. అదేవిదంగా ఫీల్డ్ లో జరిగే ఆశాల ద్వారా జరిగే LCDC సర్వే ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో డీపీఎంఓ సూర్య ప్రకాశ్ రెడ్డి, phn చెన్నమ్మ గారు సూపరవైజర్ ఈశ్వరమ్మ గారు హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ANMs, ఆశాలు పాల్గొనినారు.

Anantapur

Jan 12 2024, 06:52

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు కలిసిన మదమంచి శ్రీధర్..

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు కలిసిన మదమంచి శ్రీధర్..

శింగనమల : తెలుగుదేశం పార్టీ సింగనమల నియోజకవర్గం ఆర్టిఎస్ కోఆర్డినేటర్ గా మదమంచి శ్రీధర్ అను నన్ను నియమించుటకు కృషి చేసినటువంటి నాయకులు

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా

పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశాను ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రామాంజి తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 12 2024, 06:46

టిడిపి జిల్లా సీనియర్ నాయకులు రామలింగారెడ్డిని ఘనంగా సన్మానించిన RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్ "..

సింగణమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మాజీ zptc " రామలింగ రెడ్డి " అన్న గారికి సన్మాన కార్యక్రమం.

" RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్ " ఎన్నుకున్నందునా

ఆనందం వ్యక్తం చేస్తు గార్లదిన్నె మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ పాండు గారు.

మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్, శ్రీనివాసులు మండల ప్రధానకార్యదర్శి.

Anantapur

Jan 12 2024, 06:40

ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడు కేశవరెడ్డిని ఘనంగా సన్మానించిన RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్

సింగణమల నియోజకవర్గం " ద్విసభ్య కమిటీ సభ్యులు " ముంటిమడుగు కేశవరెడ్డి " గారికి అలాగే బుక్కరాయసముద్రం మాజీ zptc " రామలింగ రెడ్డి " అన్న గారికి సన్మాన కార్యక్రమం. " RTS" సింగణమల నియోజకవర్గం కోర్డినేటర్ గా " మధమంచి శ్రీధర్ " ఎన్నుకున్నందునా

ఆనందం వ్యక్తం చేస్తు గార్లదిన్నె మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ పాండు గారు. మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్, శ్రీనివాసులు మండల ప్రధానకార్యదర్శి.

బీసీ సెల్ గోసుల సుబ్బయ్య. మండల తెలుగుయువత అధ్యక్షులు దబ్బర శ్రీనాథ్ నాయుడు. కల్లూరు సుధాకర్ రెడ్డి. sc సెల్ జిల్లా కార్యదర్శి తుర్పింటి నరేష్,

సుధాకర్ రెడ్డి.టీడీపీ నాయకులు చలపతి, రామాంజినేయులు. టీడీపీ నాయకుకు హాజరయ్యారు.