పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.. రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..
పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.... రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈరోజు ఉదయం వ్యవసాయ కార్యాల యం లో శ్రీ పెద్ద కొండయ్య అధ్యక్ష్యతన జరిగినది.
ఈ సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ 2 పశువులు ఉన్న రైతులకు ఒక లక్ష రూపాయలు 4 పశువులు ఉన్న రైతులకు 1.5లక్ష రూపాయలు యస్సి ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ వర్తిస్తుందని పశుస oవర్ధక కార్యాలయం ద్వారా సబ్సిడీ పై సరఫరా చేయుచున్న షెడ్లను ఆసక్తి అనువైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసారు.
అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య గారు మాట్లాడుతూ రైతులందరు రబి పంట నమోదు చేసుకోవాలని తెలియజేసారు.ఎ డి ఎ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటికే 128 మంది దరఖాస్తు చేసుకున్నారని రైతు దరఖాస్తు లను పరిశీలన చేసి ఆమోద్యాయోగమైన దరఖాస్థులను ఉన్నతధికారులకు పంపేదమని తెలియజేసారు. వ్యవసాయధికారి మాట్లాడుతూ పి యం కిసాన్ నిధులు 16వ విడత ఈ నెలలో విడుదల చేస్తారని 52 మంది రైతులు ekyc చేయుంచుకొని వారు ఉన్నారని మరియు NPCI లింక్ కానీ రైతులు 90 మంది ఉన్నారని రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు వారికి తెలియజేసారని ekyc NPCI చేయుంచుకొంటేనే డబ్బులు జమ అవుతాయని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో miao హరిత, రేకులకుంట లక్ష్మీనారాయణ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు. ఇట్లు యం. శ్యాం సుందర్ రెడ్డి మండల వ్యవసాయధికారి, బుక్కరాయసముద్రం మండలము.
Jan 14 2024, 09:44