TTD: జనవరి 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం.
తిరుమల: పవిత్రమైన ధనుర్మాసం జనవరి14 తో ముగియనుండడంతో జనవరి 15వ తేదీ సోమవారం నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.
గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో.. శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండటంతో.. జనవరి 15 నుండి యధాతధంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం.. మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరపనున్నారు.














Jan 14 2024, 09:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.0k