NLG: గ్రాస్ రూట్ శిక్షణకు 4 ఫుట్బాల్స్ బహుకరణ

నల్గొండ: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో జరుగుతున్న ఫుట్బాల్ గ్రాస్ రూట్ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు 4 ఫుట్బాల్స్ ను మాజీ క్రీడాకారుడు పోలీస్ కానిస్టేబుల్ అప్పల లింగయ్య క్లబ్ ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ కు అందించారని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్టేడియంలో నిర్వహిస్తున్న గ్రాస్ రూట్ ఫుట్బాల్ శిక్షణ క్యాంపును ప్రశంసిస్తూ ఫుట్బాల్ క్రీడా అభివృద్ధికి తమ తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాకటి బాలరాజు, మైనం ప్రశాంతి, దుప్పలపల్లి రమేష్ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు

TS: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిసిన ఓయూ మలిదశ ఉద్యమ నేత డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను తెలంగాణ మలిదశ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నేతలకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇవ్వాలని, నామినేటెడ్ పదవులలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ముస్లిం మైనార్టీ కి చెందిన విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ను కోరారు.

NLG: ఇందుర్తి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు

నల్గొండ జిల్లా:

మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా, శనివారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు, జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఆటలో ప్రాధాన్యత కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరింత శిక్షణ అవసరమని అదే రకంగా ఫిట్నెస్, స్నేహభావాన్ని పెంపొందించుకోవడం, కులాలకు మతాలకు అతీతంగా నడుచుకొని పోవడం క్రీడాకారులకు అవసరమని ఆయన అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, చేగువేరా లను ఆదర్శంగా తీసుకొని అభ్యుదయం వైపు యువత నడవాలని ఆయన అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అన్నారు. 

తదనంతరం బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గిరి విష్ణు, బద్రి, ఐతగోని నరసింహ, ఎండి ఉసేన్, మహేశ్వరం గణేష్, ఏర్పుల శివనందిని, పగిళ్ల శ్రీను,గిరి కరుణ్, పవన్ చారి, వంశీ, తదితరులు పాల్గొన్నారు

NLG: 30 పడకల మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడ: మండల కేంద్రంలోని 30 పడకల CHC ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్యం అంటే సేవ అని వైద్యం కోసం వచ్చే వారికి సమయానికి మెరుగైన చికిత్స అందించి, వారికి ప్రాపర్ గైడెన్స్ అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రికి ఇంకా కావాల్సిన వసతులు అందిస్తామని, సమస్యల పరిష్కారానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వైద్య సిబ్బందితో ప్రతి ఒక్కరూ మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని విద్య ఆరోగ్య రంగాలలో రోల్ మోడల్ గా నిలబెట్టడం కోసం ప్రస్తుతం తాను ఆరోగ్యము, విద్యపై దృష్టి సారించామని తెలిపారు. 

నియోజకవర్గంలో ఇప్పటికే తాము బెల్ట్ షాపులను మూయించానని ఎమ్మెల్యే తెలిపారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, 400 లేదా 500 మంది విద్యార్థులతో మూడు లేదా నాలుగు గ్రామాలకు కలిపి ఒక పాఠశాలను అభివృద్ధి చేసి ప్రజల, ప్రభుత్వ సహకారంతో మెరుగైన విద్యను అందిద్దామని అన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలలో మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తయారు చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

TTD: క్యూ కాంప్లెక్స్‌ లో వేచి వుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమల: క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,588 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 16,754 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు

TS: జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలి: గ్రామీణ జిల్లాల పోలీస్ అభ్యర్థులు
హైదరాబాద్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అభ్యర్థులు జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 53 శాతం పోలీస్ ఉద్యోగాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి కేటాయించడం, 47% ఉద్యోగాలు మిగతా గ్రామీణ జిల్లాలకు కేటాయించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అభ్యర్థులు జీవో నెంబర్ 46 ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత

NLG: రేపు మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

ఉదయం 10:30 గంటలకి మర్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో పద్మశాలి సోదరులకు అందించే చేనేత మగ్గాల పంపిణి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

NLG: 'వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం'

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, జాతీయ యువజన దినోత్సవం ను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిల్లల కోసం తొలిమెట్టు కమ్యూనిటీ ప్రోగ్రాం వారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి పుస్తకాలను మరియు బ్యాడ్జీలను వాలంటీర్లకి పంపిణీ చేయడం జరిగింది.

ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులు స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి బిక్షపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. యువత క్రమశిక్షణతో ఉండాలని వారు అనుకుంటే ఏదైనా సాధించగలరని, దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని అన్నారు. పిల్లల కోసం తొలిమెట్టు కార్యక్రమ నిర్వాహకులు స్టేట్ ఆర్గనైజర్ అభిజిత్ మాట్లాడుతూ.. యువత పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని యువత శక్తివంతులుగా తయారై దేశ సేవలో పాల్గొనాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పిల్లల కోసం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నాగుల వేణు, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, శీలం యాదగిరి, గంజి భాగ్యలక్ష్మి , శివరాణి , సెక్టర్ ఆఫీసర్ వీరయ్య, అధ్యాపకులు కృష్ణ కౌండిన్య, వెల్దండి,  శ్రీనాథ్ పటేల్, వెంకట్ రమణ, మల్లేష్ మరియు వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

TS: ప్రారంభమైన మోడల్ స్కూల్ అడ్మిషన్ లు

నేటి నుండి వచ్చే నెల 22వ తేదీ వరకు మోడల్ స్కూల్ అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు.. 7,8,9,10 తరగతి లలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయుటకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. ఉన్నతమైన విద్యా విలువలు కలిగిన తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకొని, ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.

NLG: శబరిమల కు బయలుదేరిన కంజర శ్రీను గురు స్వామి

నల్లగొండ పట్టణంలోని మణికంఠ నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో, ఈరోజు అయ్యప్ప స్వామి మాలాధరణ గురు స్వాములు, కన్నే స్వాములు దీక్ష పూర్తి చేసుకొని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం ఇరుముడి కట్టుకొని శబరిమల కు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో గురుస్వామి కంజర శ్రీను, తదితరులు ఉన్నారు.