TS: ప్రారంభమైన మోడల్ స్కూల్ అడ్మిషన్ లు
నేటి నుండి వచ్చే నెల 22వ తేదీ వరకు మోడల్ స్కూల్ అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు.. 7,8,9,10 తరగతి లలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయుటకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. ఉన్నతమైన విద్యా విలువలు కలిగిన తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకొని, ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.





















Jan 12 2024, 20:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.3k