జయహో బీసీ ప్రచార రథాన్ని ప్రారంభించిన శింగనమల నియోజకవర్గం దిసభ్య కమిటీ సభ్యులు..

జయహో బిసి ప్రచార రథాన్ని శింగనమల నియోజకవర్గం దిశభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు అన్న గారు, ముంటిమడుగు కేశవరెడ్డి అన్నగారు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

జయహో బీసీ కార్యక్రమానికి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య గారు, TNTUC రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్లా నాగేంద్ర గారు , గార్లదిన్నే మండల కన్వీనర్ పాండు గారు.

అనంతపురం పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య గారు, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్. నియోజకవర్గ బీసీ కార్యదర్శి నారాయణస్వామి.

ఐ టిడిపి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. తదితరులు బీసీ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి

నియోజకవర్గ ఇన్చార్జ్ నారా లోకేష్ గారు భోగి ఎస్టేట్స్  క్రీడా ప్రాంగణం నిర్వహిస్తున్న

 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా

విచ్చేసిన టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యం.యస్ రాజు గారు.....

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు..

పరిటాల శ్రీరాముల గారికి గజమాల వేసి ఘనంగా సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన : దండుశ్రీనివాసులు

శింగనమల : ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో పరిటాల శ్రీరామ్ చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు

ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ,టియన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యనిర్వహకార్యదర్శి బండి పరుశురాం,

శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, పార్లమెంట్ తెలుగు రైతు అధికార ప్రతినిధి తలారితిప్పన్న, అకులేడు పవన్ సతీష్ రాయల్, రంగస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు

రెండు లారీలు ఢీ.. పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి...

అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమి దొడ్డి వద్ద

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి

గాయాలు ఒకరి పరిస్థితి ఆందోళనకరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు దుర్మరణం...

వెంకటాంపల్లి గ్రామ నివాసులైన ఇద్దరు వ్యక్తులు బైక్ పై అనంతపురము వెళ్తుండగా SRIT College,

రోటరీపురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. వీరిలో తలారి నాగముని అను వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

వీరికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మరో వ్యక్తి గాయపడగా..

అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది.

దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు

సమాజ సేవలో దండు శ్రీనివాసులు సేవల అమోఘం : బలిజ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు. శింగనమల ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశానికి హాజరై ప్రసంగిస్తున్న *బలిజ సంఘం రాష్ట్ర నాయకులు దండు శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ....

మన కమ్యూనిటీ పరంగా నిర్వహించు ప్రతి కార్యక్రమానికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని సంఘం యొక్క విలువలు కాపాడుతానుఅన్నారు

అలాగే ప్రజా సేవా కార్యక్రమాల్లో నేను చేసిన కార్యక్రమాలను గుర్తించి అనంతపురం జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు సంజీవరాయుడు గారు నన్ను సత్కరించడం నాపైన మరింత బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వీరందరి ఆశీస్సులతో ముఖ్యంగా నన్ను ఆదరించే ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు

ఈ కార్యక్రమంలో *వెన్నెల క్రిష్ణ, దాసరి గంగాధర్, సతీష్ రాయల్,దృవ, దండు ప్రకాష్, దాసరి వెంకటరమణ,సోము,* తదితరులు పాల్గొన్నారు

ఆనాడు రాష్ట్ర వైసిపి నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచి ఈనాడు అదే పార్టీలో కంటతడి పెడుతూ వాటికి గుడ్ బై చెప్తూ ఏడ్చేసిన కాపు రామచంద్రారెడ్డి..

వైసీపీకి రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే రాజీనామా .. సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతుకోశారు. నాకు టికెట్ లేదని బయటకు పంపించారు. జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా. నేను రాయదుర్గం, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం..

అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం జగన్ కూ గుడ్ బై అంటూ.. సీఎంఓ ఆఫీస్ ముందు ఏడ్చేసిన ఎమ్మెల్యే. సిఎం జగన్ కూ గుడ్ బై అంటు సెల్యూట్ చేసిన ఎమ్మెల్యే.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జగనన్న అభిమానంతో వైసిపి పార్టీలోకి చేరాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికల ప్రకటించింది ఆ మధ్యంతర ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం నుంచి కాపు రామచంద్ర రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేయగా అధిక మెజార్టీతో వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాడు

అలాంటి మొదటి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కంటతడి పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు..

సర్పంచ్ చేతుల మీదుగా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని డయాలసిస్ 10,000 రూ.లు పెన్షన్ పంపిణీ..

అనంతపురం జిల్లా బుక్కరయసముద్రం మండల కేంద్రంలోని సచివాలయం 4 పరిధిలోని... ఇంద్ర గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న.. బండారు రామక్క అనారోగ్యంతో 2 కిడ్నీలు చెడిపోవడం వల్ల ఆమెకు వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా డయాలసిస్ 10,000 రూపాయలు పెన్షన్ను గౌరవనీయులైన సర్పంచ్ అమ్మవారిపేట . పార్వతి గారు చేతులు మీదుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ రమణా చౌదరి , వార్డ్ నెంబర్ కుల్లాయప్ప , వాలంటీర్లు పాల్గొన్నారు.

చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం..
చుక్కలు చూపిస్తున్న సన్న బియ్యం.. అమాంతం పెరిగిన ధరలు.. రూ.6వేల నుంచి రూ.7వేల వరకు.. నెల రోజుల్లో రూ. 800 నుంచి రూ.వెయ్యి పెరుగుదల ఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు ధరలను అదుపు చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస్తులుండే పరిస్థితి దాపురించింది. గతంలో క్వింటాలు సన్న బియ్యానికి రూ.4వేల నుంచి రూ.4500 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు సామాన్యులు కొనలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను అదుపు చేసి, సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

జనవరి 2 బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చుకలు చూపిస్తున్నాయి. గత నెల రోజులతో పోలిస్తే ప్రస్తుతం బియ్యం ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తినలేని దుస్థితి వచ్చింది. క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే పాత, కొత్త బియ్యానికి రెకలు వచ్చాయి. పెరిగిన బియ్యం ధరలతో రైతులు పండించిన ధాన్యానికి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఆహార గింజల కొరతతోపాటు యాసంగిలో వరి కోతల ముందు తుపాన్‌ ప్రభావంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ర్టాల్లో ధాన్యానికి డిమాండ్‌ ఉండడంతో ఎగుమతులు ఎకువయ్యాయి. దీంతో బియ్యం ధరలకు ఒకసారిగా రెకలొచ్చాయి.

ఈ సీజన్లో గ్రేడ్‌ 'ఏ' రకానికి రూ.2203, కామన్‌ గ్రేడ్‌ రకానికి రూ.2,183 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నది. ఇక ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ.3100 నుంచి రూ.3200 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వడ్ల వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మూడు నెలల క్రితం వరకు నార్మల్‌గా ఉన్న బియ్యం ధరలు ఒకసారిగా పెరగడంతో పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారింది. ఏకంగా క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పెరగడంతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు.

విజయమసూరి కొత్త బియ్యానికి క్వింటాలు రూ.4500 నుంచి రూ.4800 వరకు, పాత బియ్యానికి రూ.5800 నుంచి రూ.6200, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యానికి కొత్త వాటికి రూ.5200 నుంచి రూ.5500 వరకు ఉండగా పాత బియ్యానికి రూ.6,500 నుంచి రూ.6,800 వరకు పెరిగింది. జై శ్రీరామ్‌ కొత్త బియ్యానికి రూ.6000 నుంచి రూ.6200 వరకు, పాత బియ్యానికి రూ.7500 నుంచి రూ.7800 వరకు ప్రస్తుతం ధరలు ఉన్నాయి. దీంతో సన్నబియ్యం కొనాలంటే జనం జంకుతున్నారు. క్వింటాకు రూ.2వేల వరకు పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. గతంలో సన్నబియ్యం క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4,500వరకు ధర ఉండేది. ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతున్నది. అంటే సుమారు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబాలైతే సన్నబి య్యం తినే అవకాశం లేకుండా పోతున్నది. ప్రభుత్వం బియ్యం ధరలను అదు పు చేయకపోతే పేదలు మూడు పూటలా అన్నం తినే అవకాశం ఉండదు.
బైజుస్ తో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్..
బైజుస్ తో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్ కార్యాలయం దగ్గర ఆందోళన అనంతపురం అర్బన్: ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా బైజుస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో బైజ్యూస్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ సంతోష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షు, కార్యదర్శి రమణయ్య కుల్లాయి స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నది. ట్యాబ్ లను పంపిణీ చేయడానికి 3500 కోట్ల రూపాయలు బైజూస్ సంస్థ కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. విద్యార్థులకు తరగతులు అర్థం కానప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సబ్జెక్ట్స్ నీ అర్థం చేసుకోవడానికి బైజూస్ ట్యూషన్ పాయింట్స్ ని బైజు సంస్థ ఏర్పాటు చేసింది .ప్రతి విద్యార్థి దగ్గర నుండి 15వేల రూపాయలు కట్టించుకొని అడ్మిషన్ చేసుకున్నారు. ఎవరైనా ఒక నెల తర్వాత తరగతులు వద్దనుకుంటే వాళ్ల ఫీజులు మొత్తం వాపసు చేస్తామని బైజూస్ ప్రతినిధులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు ఒకేసారి 60000 రూపాయలు ఫీజులు చెల్లించ లేనప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఇఎంఐ రూపంలో ప్రతినెల 5000 నుండి 6000 రూపాయలు వరకు సౌకర్యం కల్పించింది.బైజుస్ అనేది దేశంలో దివాలా తీసిన సంస్థ .ఇప్పటికే బైజూస్ మీద మనీ లాండరింగ్ కేసులు కూడా నమోదు అయి ఉన్నాయి. 9200 కోట్ల రూపాయలు ఇతర దేశాలకి మనీలాండరింగ్ చేశారు. అటువంటి సంస్థ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా దుర్మార్గం. ట్యాబుల పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకొని భారీ దోపిడీ జరుగుతుందన్నారు బైజుస్ కంపెనీ 3,500 కోట్లు దోచి పెట్టారని విమర్శించారు బైజుస్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తో ఒప్పందం కుదుర్చుకొని ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్నారు ముఖ్యమంత్రి అధికారులు బైజూస్ తో లాలూచీ పడడంతో ఈ సాధ్యమైందన్నారు విద్యార్థులకు నష్టం కలిగిస్తూ, తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న, బైజుస్ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బరేర్స్ వెంకట్ నాయక్ ఆంజనేయులు వంశీ ఏఐవైఎఫ్ నాయకులు లిఖిల్ శ్రీకాంత్ చాంద్ బాషా రాజశేఖర్ తదితరులు.