జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామం గోవిందం పల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దాసరి సునీత గారు, మరియు గ్రామ సర్పంచ్ లక్ష్మిరెడ్డి గారు,రాష్ట్ర జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ ఆఫీసర్ కె శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ గారు వచ్చారు,
గౌరవ ఎంపీపీ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గత అక్టోబర్లో నిర్వహించినప్పుడు మండల వ్యాప్తంగా 6,393 మంది చూపించుకోవడం జరిగింది వారిలో 282 మందిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ ( ఆరోగ్యశ్రీ కింద) చేయడం జరిగింది. ఈ 282 కేసుల్లో 281 కేసులు 281 కేసులు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది, అలాగే కంటికి సంబంధించి 243 మంది ఆపరేషన్లకు అవసరం కాక ఇప్పటివరకు 92 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది, మిగతా వారికి కంటి అద్దాలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది,
ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రధాన కార్యక్రమముగా తీసుకొని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని వారు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రతి చోట ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అనారోగ్యంతో ఉన్న వారిని అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారిని కంటి ఆపరేషన్లు, మరియు అద్దాలు అవసరమైన వారిని గుర్తించి , జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వారు వచ్చి క్యాంపును విజయవంతం చేసేటట్లు గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని వారు తెలియజేశారు, అలాగే జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, డాక్టర్లు రాసినటువంటి మందులు తప్పనిసరిగా ఇచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులో వారికి పంపిణీ చేయాలని తెలియజేశారు, అలాగే ఈరోజు స్కూల్ పిల్లలకు గ్రామ ప్రజలకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి గారు, స్పెషలిస్ట్ డాక్టర్లు శరత్ రెడ్డి గారు జనరల్ ఫిజీషియన్, డాక్టర్ శివ జ్యోతి శ్రీ. గైనకాలజీ డాక్టర్ ( స్త్రీ సంబంధిత , గర్భవతి బాలింత ప్రత్యేక వైద్యురాలు) , ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కంటికి సంబంధించి ఆప్తమిక్ అసిస్టెంట్ ప్రసాదు, సౌమ్యకృష్ణ, సిహెచ్ మోహన్ రావు గారు, సూపర్వైజర్ స్టాప్, ఐసిడిఎస్ వారు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఆశా కార్యకర్తలు , గోవిందం పల్లి సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు,
ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఓపి 359 హాజరయ్యారు, 02 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది 48 మందికి కంటి అద్దాల కోసం పరీక్షించడం జరిగింది
Jan 04 2024, 08:54